ఉత్తరాయణం

ఐలయ్యకు రక్షణ ఎందుకు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒక సామాజిక వర్గాన్ని కించపరుస్తూ, వారిని స్మగ్లర్లుగా చిత్రిస్తూ రచనలను ప్రచురించిన కంచ ఐలయ్య పోలీసుల రక్షణ కోరడం హాస్యాస్పదం. భావప్రకటన స్వేచ్ఛ పేరుతో మరోవర్గంపై అవాకులుచవాకులు రాయడం సరికాదు. సాధారణ ప్రజానీకానికి భద్రత కల్పించేందుకే తగినంత మంది పోలీసులు లేరు. ఇలా ఉద్దేశపూర్వకంగా వివాదాలు రేపేవారికి రక్షణ కల్పించాల్సిన అవసరం పోలీసులకు ఏముంది? కులమతలింగ వివక్ష కూడదని రాజ్యాంగం చెబుతుంటే ఐలయ్య అందుకు విరుద్ధంగా వైశ్యులను స్మగ్లర్లుగా చిత్రీకరించడం సబబుకాదు. ఐలయ్యలాంటి వారిని వామపక్షవాదులు, పౌరహక్కుల సంఘాలు సమర్ధించడంలో అర్థం లేదు.
-వేదుల సత్యనారాయణ, కాకరపర్రు
జనరిక్ మందులకు ప్రాధాన్యం
చౌకగా లభించే నాణ్యమైన, దుష్ప్రభావాలు కలిగించిన జనరిక్ ఔషధాల వాడకంపై విస్తృత ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది. ప్రతి మండల కేంద్రంలో జనరిక్ మందుల దుకాణం ఉండేలా చర్యలు తీసుకుంటామన్న ప్రభుత్వ ప్రకటన ఆచరణలో చూపాలి. ప్రైవేటు వైద్యం చేయించుకుంటున్నవారికి అర్థమయ్యేలా జనరిక్ ఔషధాల ప్రాధాన్యం, వాటి నాణ్యతపై అవగాహన కల్పించేలా కార్యక్రమాలను చేపట్టాలి.
-కె.రామారావు, హైదరాబాద్