ఉత్తరాయణం

బుల్లెట్ రైళ్లు అవసరమే..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మన దేశానికి ఇప్పుడు బుల్లెట్ రైళ్లు అవసరమేమిటని సణుగుడు ప్రారంభం అయింది. స్వాతంత్య్రం వచ్చిన తొలి సంవత్సరాల్లో సైన్యంపై ఖర్చుని విమర్శించారు. నెహ్రూ దృక్పథమూ అదే. చైనా మనమీద యుద్ధానికి వచ్చినపుడు మన సైనికులకు సరైన బూట్లు కూడా లేవు. తగినంతగా ఆయుధాలు, మందుగుండు లేవు. ఓటమి, చైనా మోసం తట్టుకోలేక నెహ్రూ కన్నుమూశారు. ఉపగ్రహ ప్రయోగాలు ఎందుకని కొందరు విమర్శించారు. ఇప్పుడు అవే పెద్దఎత్తున ఆదాయాన్ని అందించేందుకు కారణమయ్యాయి. నవీనయుగంలో భారత్ వేగంగా అభివృద్ధి చెందుతున్న దశలో కష్టనష్టాలు ఉన్నప్పటికీ కొన్ని ఆవిష్కరణలు అవసరమే. బుల్లెట్‌రైళ్లకు ఆహ్వానం అందులో ఒకటి.
-పి.శుభలక్ష్మి, కాకినాడ
విశాఖ తీరంలో భద్రత ఏదీ?
విశాఖ తీరంలో సరైన భద్రత, పర్యవేక్షణ లేక అల్లరిమూకల ఆగడాలు ఎక్కువయ్యాయి. చీకటిపడిన తరువాత సాగరతీరానికి వస్తున్న యువత కేరింతలు కొడుతూ అలల్లో చిక్కుకుపోయి ప్రాణాలు కోల్పోతున్న సంఘటనలు ఇటీవల ఎక్కువయ్యాయి. ముఖ్యంగా విశాఖలోని రామకృష్ణాబీచ్, సాగర్‌నగర్, ఋషికొండ, భీమిలి, యారాడ బీచ్‌లలో రాత్రిపూట భద్రత కరువైంది. తాగుబోతులతో సమస్యలు ఎదురవుతున్నాయి. సాగర్‌నగర్ దాటిన తరువాత బైక్‌లపై వెళ్లేవారు సైలెన్సర్లు తీసివేసి పెద్దశబ్దాలు చేస్తూ రేసుల్లో పాల్గొంటున్నారు. సాధారణ ప్రయాణికులకు, స్థానికులకు ఇది ఇబ్బందికరంగా మారింది. పోలీసులు తగిన చర్యలు తీసుకుని సామాన్య పౌరులు నిర్భయంగా సాగరతీరంలో తిరగగలిగేలా చూడాలి.
-సి.ప్రతాప్, శ్రీకాకుళం
సీరియల్స్‌పై నిషేధం సాధ్యమా?
టీవీ చానెళ్లలో మహిళపై హింసను ప్రేరేపించేలా ప్రసారం చేస్తున్న సీరియల్స్‌ను నిషేధించాలని రాష్ట్ర మహిళ కమిషన్ చైర్‌పర్సన్ నన్నపనేని రాజకుమారి కోరడమే కాకుండా ఈ మేరకు సెన్సార్ బోర్డుకు లేఖ రాసినట్లు పేర్కొన్నారు. అది మంచిదే. ఒకవేళ సెన్సార్‌బోర్డు స్పందించని పక్షంలో ప్రధాని, రాష్టప్రతిని కలసి ఫిర్యాదు చేస్తామని కూడా ఆమె చెప్పారు. అది అవసరమే. అయితే ఆమె పేర్కొన్న తీరులో ఉండే సీరియల్స్‌లో అభ్యంతరకర సన్నివేశాలను తొలగించడం సాధ్యమేమోకానీ అది సెన్సార్‌బోర్డు పరిధిలో ఉందా అన్నది సందేహమే. నిజానికి సెన్సార్‌బోర్డు సినిమాలకు సంబంధించి ‘కట్స్’ చెప్పగలదు. నిషేధించే హక్కు ఆ బోర్డుకు ఉందంటారా?
-బి.ప్రభాస్, గాంధీనగర్