ఉత్తరాయణం

విలువలు గల రాజకీయ నేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అర్ధ శతాబ్దంపాటు కేంద్ర, రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్రవేసిన రాజకీయ దురంధరుడు, మేధావి, ఉత్తమ పార్లమెంటేరియన్, మాజీ కేంద్ర మంత్రి, మహబూబ్‌నగర్ జిల్లా ముద్దుబిడ్డ సూదిని జైపాల్‌రెడ్డి అనారోగ్యంతో బాధపడుతూ మృత్యువాత పడడం తెలంగాణ సమాజానికి తీరని లోటు. తెలంగాణ రాష్ట్రం గొప్ప ప్రజాసేవకుడు, పాలనాదక్షుడు, మంచి వక్తను కోల్పోయింది. ప్రజలకోసం నిబద్ధతతో పనిచేసే నాయకుడు, మానవతావాది అయిన జైపాల్‌రెడ్డి దేశం యావత్తు గర్వించదగ్గ నేతగా అభివర్ణించవచ్చు. ప్రజావాణిని శాసనసభ, పార్లమెంటులో అనర్గళంగా వినిపించడంలో తనకుతానే సాటి. వైకల్యాన్ని సైతం అధిగమించి తన వాగ్ధాటితో మంత్రముగ్ధులను చేయగల ధీశాలిగా కీర్తిగడించారు. తొలి దశ తెలంగాణ ఉద్యమంలో సమైక్యవాదిగా ముద్రపడ్డ జైపాల్‌రెడ్డి మలి దశ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలకపాత్ర పోషించారు. నమ్ముకున్న సిద్ధాంతాలకు కట్టుబడి, కాంగ్రెస్ పార్టీలో అంచెలంచెలుగా ఎదిగి తనకంటూ ప్రత్యేక స్థానం సొంతం చేసుకున్నారు. నాలుగుసార్లు ఎం.ఎల్.ఏగా, రెండుసార్లు రాజ్యసభ సభ్యుడిగా, ఐదుసార్లు ఎంపీగా రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడిగా, జనతాపార్టీలో జాతీయ ప్రధాన కార్యదర్శిగా వీ.పి.సింగ్, మన్మోహన్‌సింగ్, గుజ్రాల్‌లు ప్రధానులుగా కొనసాగినపుడు వివిధ మంత్రి పదవులను చేపట్టి వనె్నతెచ్చిన వ్యక్తిగా గుర్తింపబడ్డారు. జైపాల్‌రెడ్డి భౌతికంగా మనముందు లేకున్నా రాజకీయ రంగం ఉన్నంతకాలం వారి సిద్ధాంతాలు, విలువలు ప్రతీ ఒక్కరిలో చిరస్థాయిగా నిలిచి ఉంటాయి. వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుందాం.
-కామిడి సతీష్‌రెడ్డి, జయశంకర్ భూపాలపల్లి జిల్లా