ఉత్తరాయణం

సరుూద్‌పై పాక్ ప్రేమ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాకిస్తాన్ ఎప్పటికప్పుడు ఉగ్రవాదులకు తనెంత సానుకూలమో తెలియజేస్తోంది. తాజాగా జగమెరిగిన ఉగ్రవాది హఫీజ్ సరుూద్‌ని జైలు జీవితం నుంచి విముక్తి కలిగించడం ద్వారా ఆ విషయాన్ని మరోసారి ప్రపంచానికి ధ్రువపర్చింది. సరుూద్ మామూలు నేరస్తుడు కాదు. కరడుగట్టిన తీవ్రవాది. ముంబైలో ఉగ్రవాద దాడితో సహా పలు తీవ్రవాద చర్యలకు సూత్రధారి. అన్ని సాక్ష్యాలతో భారత్ ఈ విషయాన్ని బయటపెట్టింది. ఐక్యరాజ్య సమితి అతడిని తీవ్రవాదిగా గుర్తించింది. అమెరికా అలా గుర్తించడమే కాక అతడిని పట్టుకుంటే పది మిలియన్ డాలర్ల మొత్తం అందిస్తామని ప్రకటించింది. చైనా, పాకిస్తాన్ తప్ప అందరి దృష్టిలో అతడు ఉగ్రవాది. అమెరికా కాస్త మెత్తబడేటప్పటికి పాక్ వైఖరి మారిపోయింది. సరుూద్‌పై ఉగ్రవాద ఆరోపణలను ఉపసంహరించుకుని సాకులతో గృహనిర్బంధానికి పరిమితం చేసింది. అమెరికా ద్వంద్వ విధానాలు మారాలి.
-డి.వి.జి.శంకరరావు, పార్వతీపురం
జిఎస్‌టితో కష్టాలు
ఎంతో ప్రతిష్ఠాత్మక సంస్కరణగా మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న వస్తుసేవల పన్ను (జిఎస్‌టి) వ్యవహారం ప్రజలకు కష్టనష్టాలను కలుగజేస్తున్నది. ప్రభుత్వం ఆశించిన విధంగా ఫలితాలు లేవు. ప్రజలు కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. పెద్దనోట్ల రద్దుతో నల్లధనం బయటకు వస్తుందన్న భ్రమలు తొలగిపోయాయి. దానికి బదులు నల్లధనం తెల్లధనంగా మారిపోవడానికి నోట్ల రద్దు కారణమయిందన్న భావన ప్రజల్లో నెలకుంటున్నది. ప్రభుత్వం ఆర్భాటంగా చెప్పుకున్న ఈ రెండు చర్యలు ఇప్పుడు మోదీ ప్రభుత్వంపై అసంతృప్తికి కారణమవుతున్నాయి. పేదలు, మధ్య తరగతిని ఆదుకోవడానికే ఈ సంస్కరణలు చేసి ఉంటే అమలులో జరుగుతున్న లోపాలను తక్షణం సరిచేయాలి. విమర్శలకు సరైన జవాబు చెప్పాలి. ప్రజల్లో విశ్వాసం కలిగించగలగాలి. లేనిపక్షంలో ప్రజల్లో అసంతృప్తి పెరిగి కేంద్రప్రభుత్వానికి గుణపాఠాలవుతాయి.
-బుగ్గన మధుసూదన్‌రెడ్డి, బేతంచర్ల