ఉత్తరాయణం

కేన్సర్ బాధితులను ఆదుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న ‘ఆసరా’ పథకం చాలామంది పేదలను ఆదుకుంటున్నది. అయితే ఈ పథకం పరిధిలోకి కేన్సర్ బాధితులను కూడా చేర్చాలి. ఖరీదైన వైద్యం చేయించుకోలేని పేదలకు ఈ పథకం కొండంత ధైర్యాన్ని ఇస్తుంది. ముఖ్యమంత్రి కెసిఆర్ ఈ దిశగా చర్యలు తీసుకోవాలి. మారిన జీవనశైలి, వంశపారంపర్య, జన్యు కారణాల వల్ల, స్వీయతప్పిదాల వల్ల కేన్సర్ బారిన పడుతున్నవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఆ వ్యాధుల చికిత్స ఖరీదుతో కూడుకోవడం, ఔషధాల ధరలు ఎక్కువగా ఉండటం వల్ల పేదలకు జీవన్మరణ సమస్యగా మారింది. ఎన్నో పధకాలతో పేద, మధ్య తరగతిని ఆదుకుంటున్న ముఖ్యమంత్రి కేన్సర్ రోగులకు ప్రయోజనం కలిగించేందుకు వారికి ‘ఆసరా’ అందించాలి. త్వరలో జరగబోయే అసెంబ్లీ సమావేశాలలో ఈ మేరకు నిర్ణయం తీసుకోవాలి
-సూరం అనిల్, వరంగల్
పాండవుల గుట్టలను కాపాడాలి
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉన్న పాండవుల గుట్టలు పర్యాటక ప్రాంతాలుగా ఆదరణ పొందుతున్నాయి. పూర్వం అజ్ఞాతవాసం సందర్భంగా పాండవులు ఇక్కడ సేదదీరారని స్థానికుల విశ్వాసం. గుట్టలపై ఉన్న ధర్మరాజు పాదాలు, భీముని గుడి, కుంతమ్మ గుడి, లక్కమేడలు, సుమారు 500 మంది కూర్చునేందుకు వీలుగా ఉండే సభాస్థలి, గుహలు అక్కడ కనువిందు చేస్తాయి. ఆ గుట్టలు ఎక్కడానికి మెట్లుకూడా ఉన్నాయి. ప్రకృతి అందాలతో అలరిస్తున్న పాండవుల గుట్టలో డోలమైట్ ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయని తేలడంతో వ్యాపారుల దృష్టి పడింది. వీటిని తవ్వి ఖనిజాన్ని తరలించేందుకు కొందరు సిద్ధపడుతున్నారు. ప్రభుత్వం ఆదాయంపై దృష్టిపెట్టకుండా చారిత్రక స్థలమైన పాండవుల గుట్టను రక్షించాల్సి ఉంది.
-కె.సతీష్‌రెడ్డి, జడలపేట