ఉత్తరాయణం

మోదీ సంస్కరణలు భేష్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మన ప్రధాని నరేంద్ర మోదీ విజేయుడనిపించుకుంటూ ముందుకు పోతున్న విషయం అందరికీ తెలిసిందే. లోక్‌సభ ఎన్నికల ముందు పుల్వామా దాడులకు ప్రతిదాడుల నేపథ్యంలో లష్కరే తోయిబా స్థావరం మీద మెరుపుదాడులు చేసి అనేక మందిని మట్టుపెట్టడంతో యావత్ ప్రపంచం ‘ఔరా.. భారత్..!’ అని ఆశ్చర్యపడింది. మన స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి 7 దశాబ్దాలుగా జమ్మూ కశ్మీర్‌లో కొనసాగుతున్న 370వ అధికరణాన్ని రద్దుచేయడం ద్వారా మరోసారి మోదీ ‘శభాష్’ అనిపించుకున్నారు. మన దేశానికి ఉగ్రవాదం అతి పెద్ద సమస్యగా మారిన విషయం తెలిసిందే. ఈ ఉగ్రవాదానికి ఎక్కువ భాగం మన దాయాదీ దేశమైన పాకిస్తాన్ అనేక రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్న సంగతి బహిరంగ రహస్యమే. ఉగ్రవాద ముఠాలకు కశ్మీర్ స్వర్గ్ధామంలా ఉపయోగపడుతున్న విషయం గురించి వేరే చెప్పవలసిన పనిలేదు. భారతదేశంలో ఎక్కడో విసిరేసిపడినట్లుగా వున్న కశ్మీర్ ద్వారా మొత్తం యావత్ దేశానికి ప్రతిరోజు కంట్లో నలుసులాగా... ఉగ్రవాదులు ఎప్పుడు ఎక్కడ దాడులు చేస్తారోనని భయాందోళనలు వుండేవి. కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే 370వ ఆర్టికల్ రద్దుకావడంతో మొత్తం దేశానికి విముక్తి లభించినట్లుగా యావన్మంది ప్రజలు సంతోషిస్తున్నారు. శాంతి భద్రతల విషయంలోనే కాకుండా మోదీ ప్రధానిగా గత ఐదున్నర ఏళ్లలో అనేక సంస్కరణలు తీసుకొచ్చినందున మన దేశం ఇప్పుడిప్పుడే పేదరికపు ఛాయలను పూర్తిగా తుడిచివేస్తూ... అభివృద్ధి పథంలో పురోగమిస్తున్నది. ఈ నేపథ్యంలో మోదీ తీసుకొచ్చిన నూతన వ్యవసాయ విధానాలకు, సూక్ష్మ చిన్నతరహా పరిశ్రమలకు పెద్దపీట వేస్తున్న పద్ధతులను అభినందిస్తూ... మావంతు కర్తవ్యంగా తెలుగు రాష్ట్రాలలో ‘ముద్ర అగ్రికల్చర్ అండ్ స్కిల్ డెవలప్‌మెంట్ మల్టీస్టేట్ కో-ఆపరేటివ్ లిమిటెడ్’ తరఫున ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను (ఆహార శుద్ధికేంద్రాలు) ఏర్పాటు చేయాలని సంకల్పించాము. ఇప్పటికే ఏపీలో ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీఐఐసీ)కు చెందిన స్థలాలను ప్రభుత్వం నిర్ణయించిన ధర మేరకు సేకరించాము. కర్నూలు, అనంతపురం జిల్లాల్లో ఏపీఐఐసీ ప్లాట్లు సేకరించడమైనది. ఇలాగే మరికొన్ని జిల్లాలలో సైతం సంబంధిత శాఖల నుంచి ముద్ర కోఆపరేటివ్ సొసైటీకి అలాట్‌మెంట్ లెటర్లు వచ్చాయి. ఈ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు సంబంధించి ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినమైన సెప్టెంబర్ 7న అన్నిచోట్ల భూమి పూజలు నిర్వహిస్తున్నాము. ఆ తరువాత భవన నిర్మాణ కార్యక్రమం పూర్తిచేయబోతున్నాము. ఈ పరిశ్రమల భవనాలకు ‘మోదీ సహకార భవన్’లుగా పేరుపెట్టాలని నిర్ణయించాము. ప్రపంచవ్యాప్తంగా ముంచుకొస్తున్న ఆర్థిక మాంద్యం పరిస్థితుల నేపథ్యంతోపాటు, ఆర్థిక ఒడిదుడుకుల అనుభవాలను పరిగణనలోకి తీసుకుంటే.. భారీ పరిశ్రమలకన్నా చిన్నతరహా పరిశ్రమల ద్వారానే సామాన్యులకు చాలావరకు ఊరట లభిస్తుందని ఎక్కువ మంది ఆర్థిక మేధావులు అభిప్రాయపడుతున్నారు. అనేక సందర్భాలలో ప్రధాని మోదీ సూక్ష్మ చిన్నతరహా, మధ్యతరహా పరిశ్రమల ఆవశ్యకతను నొక్కి వక్కాణించి చెప్పారు. ప్రత్యేకంగా మేము ఏర్పాటుచేస్తున్న ఈ చిన్నతరహా పరిశ్రమలలో రైతు ఉత్పత్తులను కొని వాటిని శుద్ధిచేసి మార్కెటింగ్ చేయాలని భావించాము. ఒకవైపు రైతులకు గిట్టుబాటు ధర తీసుకురావాలని భావిస్తూ.. అదే సందర్భంలో నిరుద్యోగ యువతకు చేయూతనివ్వాలనేది మా లక్ష్యం. ఇందులో భాగమే త్వరలో ప్రారంభించబోతున్న మా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల నిర్మాణ లక్ష్యం.
-తిప్పినేని రామదాసప్ప నాయుడు 99898 18212
మట్టి గణపతే మహాగణపతి
వినాయక చవితి పర్వదినం సందర్భంగా మన ఇంట్లో, కాలనీల్లో ప్రతిష్ఠించే వినాయక విగ్రహాలు రసాయనాలను ఉపయోగించనివిగా, సాధ్యమైనంత వరకు చిన్నవిగా ఉండేటట్లు చూసుకోవాలి. పర్యావరణానికి మేలుచేసే మట్టి విగ్రహాలను పసుపు, కుంకుమ, ఆకులు పూలతో అలంకరించి భక్తిశ్రద్ధలతో పూజిద్దాం.. నిమజ్జనం చేసినప్పుడు నీటిలో పూర్తిగా విగ్రహాలు మునిగిపోవాలి. పూజించడానికి పెద్ద విగ్రహాలు ప్రతిష్ఠించాల్సిన అవసరం లేదు. విగ్రహం ముప్పయ్ అంగుళాలు ఉంటే చాలు. పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని రంగులు వాడని చిన్న మట్టి విగ్రహాలను ప్రతిష్టించి పూజిస్తే బాగుంటుంది. విగ్రహాలకు రసాయనాలతో కూడిన రంగులు ఉపయోగించడం వల్ల జలాశయాలు కలుషితమై, పర్యావరణానికి ముప్పు వాటిల్లుతోంది. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకొని కృషిచేయాలి. గణేష్ విగ్రహాలు పోటీపడి భారీస్థాయిలో ప్రతిష్ఠించి, మైకులతో చుట్టుపక్కల వారికి ఇబ్బంది కలిగించకుండా జాగ్రత్తలు తీసుకుంటే మరీ మంచిది. పోలీసు అధికారులు సూచించిన నియమ నిబంధనలను కచ్చితంగా పాటిస్తూ, వినాయక చవితి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలి.
- కాయల నాగేంద్ర, హైదరాబాద్