ఉత్తరాయణం

మనె్నం పోరు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాతముత్తాతల కాలం నుంచి
ఇక్కడే జీవనం సాగిస్తున్నాం
నల్లమల మా పుట్టిల్లు

చెట్టుచేమ, ఆకు అలములు
సకల జీవులు మా తోబుట్టువులు

కొండకోనలు, వాగువంకలు,
నదులు, సెలయేళ్ళు
మా ఇలవేల్పులు

అడవితల్లిని నమ్ముకున్నోల్లం
అనె్నం పునె్నం ఎరుగని ఆదివాసీలం

ఇప్పుడు
మా నల్లమల ‘ఎద’మీద
మీ కార్పొరేట్ కండ్లు పడ్డయ్
యురేనియం పేరిట ఉరితాళ్ళు పేనుతున్నరు
అటవీ సంపద కొల్లగొట్టే కుట్రలు పన్నుతున్నరు
పచ్చదనపు గుండెల్లో గునపం
దింపజూస్తున్నరు

మాఫియా ముష్కరులారా!
ఎగదోస్తున్న ఏలికల్లారా!
మీ ధ్వంసరచన ఇలాగే సాగిస్తే...

వౌనం గొంతుకలోంచే
ధిక్కార స్వరాలు వినిపిస్తాయి
భయం గుండెలోంచే విల్లంబులు విరబూస్తాయి
నిర్బంధం నీడలోంచే ఆయుధాలు మొలుస్తాయి

ఇకనైనా..
‘నల్లమల’పై మీ చీకటి చేష్టలు చాలించండి
కుయుక్తుల మృత్యురాగాలు విరమించండి

కాదు...కూడదు... అన్నారో!
మరో ‘మనె్నం పోరు’ రగులుట తథ్యం...
ఆ అగ్నిజ్వాలలో మీరు,
మీ దోపిడీ వ్యవస్థలు కాలి కూలుట సత్యం...
(నల్లమలలో యురేనియం తవ్వకాలపై ఆదివాసీల మనోగతం)

-కోడిగూటి తిరుపతి 95739 29498
యురేనియం తవ్వకాలు వద్దు
నల్లమల అడవుల్లో ప్రభుత్వం తలపెట్టిన యురేనియం వెలికితీత కార్యక్రమం ఉభయ తెలుగు రాష్ట్రాలకు తీరని నష్టం కలగజేస్తుంది. ఆ ప్రాంతంలో పర్యావరణ కాలుష్యంతోపాటు, కృష్ణానది నీటిని కలుషితం చెయ్యడం ద్వారా లక్షలాది మందిపై దుష్ప్రభావం చూపుతుంది. అక్కడ నివాసమున్న ప్రజలు, మూగజీవులు దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడే అవకాశాలు అధికమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కడప జిల్లా తుమ్మపల్లె ప్రాంతంలో చేపట్టిన యురేనియం తవ్వకాల వల్ల జరుగుతున్న నష్టం కళ్లెదుటే ఉండడాన్ని వారు గుర్తు చేస్తున్నారు. రక్షణ, వ్యూహాత్మక ఆయుధ అవసరాల కోసం రేడియో ధార్మిక యురేనియం లాంటివి దిగుమతి చేసుకుంటేనే మంచిది. యురేనియంను అధికంగా వినియోగిస్తున్న అమెరికా కూడా తన అవసరాలకు 90 శాతాన్ని దిగుమతి చేసుకొంటోంది. మన దేశంలో విద్యుత్ అవసరాల కోసం ప్రత్యామ్నాయ మార్గాలు పుష్కలంగా ఉన్నాయి. సౌర, వాయు విద్యుత్ వినియోగంలో ఇంకా మనం ప్రాథమిక దశలోనే ఉన్నాం. వాటిని పూర్తిగా వినియోగించుకొంటే దేశీయ అవసరాల్ని సులభంగా తీర్చుకోవచ్చు. ప్రకృతిపరంగా ఉన్న అనుకూలతల్ని వదిలి, అణు కుంపట్లని తలకెత్తుకోవడం మతిలేని పని. కాబట్టి కేంద్రం, ఉభయ తెలుగు రాష్ట్రాలు నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాల ఆలోచన పక్కకు పెట్టాలి. ప్రత్యామ్నాయ ఇంధన వనరులపై దృష్టిపెట్టాలి. దీర్ఘకాలికంగా దేశాన్ని ఆదుకొనే మార్గమిదే.
-డా. డి.వి.జి.శంకరరావు, విజయనగరం