ఉత్తరాయణం

గల్ఫ్‌లో వలస కార్మికుల వెతలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎన్ని ప్రభుత్వాలు మారినా గల్ఫ్ దేశాలలోని ప్రవాస భారతీయుల దయనీయ స్థితి దశాబ్దాల తరబడి మారడం లేదు. 2016వ సంవత్సరంలో సాక్షాత్తూ మన ప్రధాని నరేంద్ర మోదీ ఖతార్‌లోని దోహాలో ప్రవాస భారతీయ కార్మికుల శిబిరాల్లో వారు ఎదుర్కొంటున్న సమస్యలను వీక్షించి, వాటిని వెంటనే తీరుస్తానని హామీ ఇచ్చి రెండేళ్ళు దాటినా కించిత్ అయినా మార్పు రాకపోవడం బాధాకరం. సరైన ధ్రువపత్రాలు లేకుండా నివసిస్తున్న ప్రవాసులను దేశం విడిచి వెళ్ళాలని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రభుత్వం క్షమాభిక్ష పథకాన్ని ప్రవేశపెడితే దరఖాస్తుచేసుకున్న వారిలో 90 శాతం భారతీయులు. వీరిలో 60 శాతం మంది తెలుగు రాష్ట్రాలకు చెందినవారు వుండడం ప్రభుత్వాల వైఫల్యానికి అద్దం పడుతోంది. తక్కువ చదువుతో అధిక వేతనాలు, మెరుగైన జీవనోపాధి ఆశతో గల్ఫ్ దేశాల్లో ఉద్యోగాలు వెతుక్కుంటూ వెళ్ళిన భారతీయులు దాదాపు కోటికి పైగా వుండగా, అధిక శాతం తెలుగువారే వుండడం, 20 లక్షల మంది కార్మికులుగా జీవిస్తూ, దళారీల మోసాలతో సరైన ధ్రువపత్రాలు లేక అయినవారికి దూరంగా మనోవ్యధను అనుభవిస్తున్నారు. మనదేశంలో నిరుద్యోగ యువత ఎక్కువగా వుండడంతో కొంతమంది నకిలీ ఏజెంట్లు ఈ పరిస్థితులను తమకు అనుకూలంగా మలచుకొని ప్రాథమిక విద్య పూర్తికాని వారికి కూడా అధిక వేతనాల ఆశ చూపించి, గల్ఫ్‌లో సరైన ఉద్యోగాలు లేకపోయినా వారి నుండి భారీ మొత్తాల్లో డబ్బు గుంజుతున్నారు. పర్యాటక వీసాలు లేనందున బోగస్ వీసాల మీద తప్పుడు పత్రాలతో గల్ఫ్‌లో వీరిని విడిచి రావడం, చివరికి వాస్తవాలు తెలుసుకొని ప్రవాసులు రహస్య జీవనం సాగించడం నిత్యకృత్యమైపోయింది. ఎవరైనా ప్రమాదానికి గురైతే సరైన ఇన్సూరెన్స్, పత్రాలు లేక సకాలంలో చికిత్స అందక వేల మంది నిర్భాగ్యుల జీవితాలు గాలిలో కలిసిపోతున్నాయి. మన ప్రభుత్వాలు దాహం అయ్యాక బావి తవ్వే చందాన మృతదేహాలను రప్పించేందుకు అప్పుడు చర్యలు మొదలు పెట్టడం, కనీసం మృతదేహాలను చూసే భాగ్యం బంధువులకు కలగకపోవడం, ఇలాంటి ఘటనలు ఎన్నిసార్లు పునరావృత్తం అయినా ప్రభుత్వాలలో స్పందన కరువవడం బాధిత కుటుంబాలలో అసంతృప్తి జ్వాలలను రగిలుస్తున్నాయి. రాయబార కార్యాలయంలోని అధికారులు ప్రవాసుల సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేయకపోవడంతో ఇప్పటికీ సుమారు 24వేల మంది తెలుగువారు గల్ఫ్ జైళ్ళలోనే మగ్గుతున్నారు. వీరిని విడిపించేందుకు ప్రభుత్వాలు ఎలాంటి ఉపశమన చర్యలకు ఉపక్రమించక పోవడం దారుణం.
- సి.కనకదుర్గ, హైదరాబాద్
హిందూ దేశం కాక మరేమిటి?
మన దేశాన్ని హిందూ దేశంగా మార్చాలని ప్రధాని నరేంద్ర మోదీ ప్రయత్నాలు చేస్తున్నారని ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడు డి.రాజా తెగ బాధపడిపోయారు. ఆ పెద్దమనిషికి తెలియదా? మనది హిందూ దేశమేనని. పోనీ ఈ దేశాన్ని ఏమని పిలవాలి? ఇండియా, భారత్, హిందూస్తాన్- ఇవన్నీ ‘హిందూ’ పదానికి పర్యాయపదాలే కదా! క్రిష్టియన్ దేశాలు, ముస్లిం దేశాలు ఇతర దేశాల్లో ఉండగా పరమ పవిత్రమైన, పురాతనమైన వేదభూమి, ఋషులు, సన్యాసులు, ఆధ్యాత్మికవేత్తలు, తదితర పురాణ పురుషులు నడయాడిన ఈ దేశం అనాదిగా హిందూదేశంగానే పిలవబడుతోంది. సర్వేపల్లి రాధాకృష్ణన్ తన ‘హిందూ వ్యూ ఆఫ్ లైఫ్’లో కూడా ‘హిందూ’ పదానికి దీర్ఘనిర్వచనం తెలియజేసారు. ఈ దేశపు కమ్యూనిస్టులు ఇతర దేశాలను నెత్తికెక్కించుకుంటారు గానీ మాతృదేశాన్ని తూలనాడడం పరిపాటి అయిపోయింది. వీరిలో దేశభక్తి ఎంత? వీరి మాటలను పట్టించుకునేదెవరు?
-ఎన్.ఎస్.ఆర్.మూర్తి, సికిందరాబాద్