ఉత్తరాయణం

బాల భార’తం..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ప్రపంచ ఆకలి సూచీ’ ప్రకారం మన దేశం 112 దేశాల్లో 102వ స్థానంలో ఉంది. పిల్లల ఎదుగుదల, పౌష్టికాహార లభ్యత, శిశుమరణాల రేటు ప్రాతిపదికన ఈ ర్యాంకింగ్‌లను ఏటా ఇస్తున్నారు. ఐదేళ్ల లోపు బాలలు వయసుకుతగ్గ బరువు లేకపోవడం, వయసుకు తగ్గ ఎత్తుకి ఎదగక పోవడం లాంటి సమస్యలు తీవ్రంగా ఉన్నాయి. ఐక్యరాజ్యసమితి గణాంకాల ప్రకారం కూడా మన దేశంలో బాలల ఆరోగ్యం తీసికట్టుగానే ఉంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ముగ్గురు బాలల్లో ఒకరు పౌష్టికాహార లేమితో ఉండగా, మన దేశంలో ఇద్దరిలో ఒకరు అలా ఉన్నారు. ఈ పరిస్థితిని అధిగమించాల్సిన అవసరం తొలి ప్రాధమ్యం కావాలి. ఆర్థికంగా బలపడుతున్న అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం- ఎలాంటి రాజకీయ, అంతర్గత అస్థిరత్వం లేని దేశం బాలల ఆరోగ్యం సంరక్షించడంలో వెనకబాటు చూపిస్తుందంటే అది శోచనీయం. రానున్న రోజుల్లో జనాభాలో యువత సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యకరమైన బాల్యం విలువైన భవితను నిర్దేశిస్తుంది. ఎదుగుదలలో ఎంతో కీలకమైన వయస్సు పౌష్టికాహారలేమితో కొనసాగితే అది భవిష్యత్తుపై ఎంతో దుష్ప్రభావాన్ని కలగజేస్తుంది. ఎంతో విలువైన మానవ వనరుల్ని వృథా చేసే ఏ సమాజమూ బాగుపడదు. కాబట్టి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సరైన ప్రణాళికలు రచించాలి. ఫలితాల ఆధారంగా విధానాల రూపకల్పన చెయ్యాలి. ప్రతి ఇంటికీ పౌష్టికాహార లభ్యత, పంపిణీ సక్రమంగా జరిగేలా పూచీ పడాలి. తల్లి చదువుతో పిల్లల ఆరోగ్యం ముడిపడి వున్న విషయం ఒక అధికారిక సర్వేద్వారా నిరూపణ జరిగింది. కాబట్టి విద్యావకాశాలు పెంచేలా కృషిచెయ్యాలి. ఇక స్వచ్ఛమైన పరిసరాలు, వ్యాధి నిరోధక విధానాల ప్రభావం తెలిసిందే. ఈ అంశాలన్నింటిపై ఏకకాలంలోనే దృష్టిపెట్టాల్సిన అవసరముంది. నిర్దేశించుకున్న గమ్యాల్ని చేరలేకపోతున్నామంటే వ్యూహాల్లో లోపమున్నట్టు. వాటిని సరిదిద్దుకొంటేనే బంగరు బాల్యం, బంగరు భవిత సాధ్యం.
-డా.డి.వి.జి.శంకరరావు, పార్వతీపురం
అతివేగం అనర్థదాయకం
ప్రతి ఏడాది దేశవ్యాప్తంగా రోడ్డుప్రమాదాల బారినపడి వేలాదిమంది మృత్యువాత పడటం సర్వసాధారణమైంది. విచ్చలవిడిగా మత్తుమందు సేవించి డ్రైవింగ్‌కు ఉపక్రమించడం, వేళకానివేళ రోడ్డు ప్రయాణాలకు బయలుదేరడం- ఈ రెండు కూడ మనిషి ప్రాణాలు నిర్ధాక్షిణ్యంగా కబళించి వేసే తీవ్ర హానికరమైన అంశాలే. ముఖ్యంగా ఈతరం యువకులు పెద్దలు చెప్పే విషయాలను పెడచెవిన పెడుతూ వేగంగా వెళ్లడమే తమ అభిమతం అంటూ ఏమాత్రం జాగ్రత్తలు పాటించకుండా బైకులపై జెట్ స్పీడ్ వేగంతో దూసుకుపోతున్నారు. బైక్, కార్ల రేసులు పెట్టుకొనిమరీ ‘్ఢ అంటే ఢీ’ అంటూ దుస్సాహసానికి ఒడిగడుతూ తమ ప్రాణాలను తామే చేజేతులారా పోగొట్టుకొంటున్నారు. రోడ్డు ప్రమాదాల్లో ఇతరుల ప్రాణాలను సైతం కబళిస్తుండటం అత్యంత బాధాకరం. పోలీసు శాఖవారు ప్రతి ఏడాది భద్రతావారోత్సవాలను ఎంతో ఘనంగా నిర్వహిస్తూ రోడ్డుప్రమాదాలను అరికట్టేందుకు ఎన్నో విప్లవాత్మక చర్యలకు నడుం బిగిస్తున్నారు. కానీ, ఈ ప్రయత్నాలేవీ ఘోర రోడ్డుప్రమాదాలను అరికట్టలేక పోతుండటం అత్యంత దురదృష్టకరం. పోలీసు శాఖవారు- ‘వేగము థ్రిల్లింగ్‌గా, ఆసక్తికరంగా ఉంటుంది కాని అది మన ప్రాణాలను అనంతవాయువుల్లో కలిపివేస్తుంది..’ అనే నినాదాన్ని బాగా ప్రచారంలోకి తీసుకువచ్చి, నిబంధనలను ధిక్కరించిన వారిని అత్యంత కఠినంగా శిక్షించాలి. బలమైన చట్టాలను వాడుకలోకి తేవాల్సిన బాధ్యత మన ప్రభుత్వంపై, పోలీసు శాఖపై ఉంది.
-బుగ్గన మధుసూదనరెడ్డి, బేతంచెర్ల