ఉత్తరాయణం

నిగనిగల వెనుక విషం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నోరూరించే వివిధ రకాల పండ్లు మార్కెట్‌లోకి వస్తున్నాయి. వేసవిలో మామిడి, మిగతా సీజన్లలో తర్బూజ, బొప్పాయి, అరటిపండ్లు బంగారు వర్ణంలో మన కళ్లు చెదిరేలా మెరిసిపోతుంటాయ. లేత నారింజ, ఎరుపు రంగుల సమ్మేళనంతో సపోటా ఎంతో ఇంపుగా కనిపిస్తుంది. యాపిల్ పండు చీకటిలో పెట్టెనా ఎరుపు రంగుతో వెలిగిపోతుంది. పండ్లు ప్రతినిత్యం తింటే ఆరోగ్యకరం అంటున్నారు వైద్యులు. అలాగని తియ్యతియ్యని పండ్లు తినేద్దామనుకుంటున్నారా? జర జాగ్రత్త..! కంటికి కనిపించేదంతా నిజం కాదు. ఆ రంగు వెనుక, ఆ తాజాదనం వెనుక కనిపించని నిజాలు ఎన్నో ఉన్నాయ. మార్కెట్టులోకి వస్తున్న పండ్లన్నీ రసాయనాలతో మాగబెట్టినవే. తప్పనిసరి పరిస్థితులలో వాటిని కొంటున్నాం. ద్రాక్ష, అరటి, యాపిల్, బొప్పాయి, మామిడి ఇలా ప్రతి పండునూ రసాయనాలతో మాగబెడుతున్నారు. సీజన్ కాని సీజన్‌లో సైతం తర్బూజ, మామిడి పండ్లను విక్రయిస్తున్నారు. వ్యాపారులు లాభార్జన కోసం అనారోగ్యకర పద్ధతులను పాటిస్తున్నారు. బొప్పాయి, అరటి గెలలకు ప్రమాదకర ఇథనాల్ లిక్విడ్, కార్బోహైడ్రేడ్ రసాయనాలను విస్తృతంగా వినియోగిస్తున్నారు. ఈ పండ్లను తింటే క్యాన్సర్ లాంటి ప్రమాదకర వ్యాధులు సంభవిస్తాయని వైద్యులు పేర్కొంటున్నారు. మార్కెట్టులో దొరికే పండ్లని తొక్కతీసి తినడం ఆరోగ్యకరం అని వైద్యులు అంటున్నారు. ఉప్పునీటితో కడిగి తినమంటున్నారు. ప్రస్తుతం ప్రతి ప్రాంతంలో విరివిగా దొరికే అరటి పండ్లు అశాస్ర్తియంగా పండుతున్నవే. కార్బోహైడ్రేడ్ పొగను వేయడం, గెలలను ఇథనాల్ లిక్విడ్‌లో ముంచి తీయడం, పౌడర్‌ను చల్లడం వంటి పద్ధతులలో అరటిని మాగబెడుతున్నారు. బొప్పాయిని కూడా ఇదే విధానంలో కృత్రిమంగా పండబెడుతున్నారు. కాయ మొత్తం ఒకేసారి పసుపు రంగు వచ్చిందంటే అది కార్బోహైడ్రేడ్ ద్వారా పండిందేనని గుర్తుపట్టవచ్చు. తెలుగు రాష్ట్రాలకు యాపిల్స్ వేరే రాష్ట్రాల నుండి దిగుమతి అవుతున్నాయి. వాటిని వ్యాపారులు తైలంతో కడిగి, స్టిక్కర్లు వేస్తున్నారు. ఆ యాపిల్స్ చూడగానే ఆకర్షణీయంగా వుండి ధర ఎంతైనాసరే కొనాలనిపిస్తుంది. మన దేశంలో యాపిల్ పండ్లపై మైనం పూస్తున్నారని అధికారులు చెబుతున్నారు. నేడు తెలుగు రాష్ట్రాలలో పండ్ల వ్యాపారం జోరుగా సాగుతోంది. రహదారుల వెంబడి పండ్ల స్టాళ్లను ఏర్పాటుచేసి విక్రయిస్తున్నారు. ధరల విషయంలో నియంత్రణ లేదు. పండ్లు అమ్మేవారు చెప్పిందే వేదం. అధికారులు నిర్లక్ష్యంగా ఉంటూ ఎలాంటి దాడులు చేయడంలేదు. పండ్లు తింటే ఆరోగ్యం బాగుపడుతుందంటే, అంతకన్నా ఎక్కువ రోగాలు రావడం తథ్యం అనిపిస్తుంది. ప్రజలలో తగిన అవగాహన లేదు. వివిధ స్వచ్ఛంద సంస్థలు, మేధావులు స్పందించి తాజా పండ్లను, రసాయనాలు లేని పండ్లను అమ్మేలా చైతన్యం తేవాలి. పండ్ల వ్యాపారులు, దళారుల ఆగడాలపై నిఘావేసి చట్టపరంగా శిక్షించాలి.
- కామిడి సతీష్‌రెడ్డి, జడలపేట
నేరాల నియంత్రణలో వైఫల్యం
ఏటా మన దేశంలో నేరాలను, హింసాత్మక ఘటనలను గణించే జాతీయ నేర గణాంకాల చిట్టా 2017 సంవత్సరానికి సంబంధించి ఇటీవలే- కాస్త ఆలస్యంగానైనా విడుదలైంది. అధికారిక లెక్కలు ఎలాగూ అసలు లెక్కలకన్నా తక్కువగానే ఉంటాయి. ఏదో కారణాల రీత్యా ప్రభుత్వం దృష్టికి రాని నేరాలు, వాటిని ఏయే పద్దుల్లో చూపాలో తెలియక వెనకబెట్టినవి వెరసి పెద్ద మొత్తంలోనే చిట్టాలోకి ఎక్కకుండా చీకట్లోనే ఉంటాయి. ఇంకా ఈ గణాంకాల్లో మూక హత్యలు, పరువు పేరుతో సాగుతున్న పాశవిక హత్యల లెక్కలు లేకపోవడం లోటు. అయితే, నేరాల సరళి ఎలా వుందో చెప్పే ఈ గణాంకాలు ఎంతో ప్రాముఖ్యమైనవి. శాంతిభద్రతల పరిరక్షణ రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోని అంశం. రాష్ట్ర ప్రభుత్వపు పాలనా సామర్థ్యం, స్థానికాంశాలు నేరాల తీరుపై ప్రభావం చూపొచ్చుగానీ స్థూలంగా హింసాత్మక చర్యలకు హద్దులుండవు. కొన్ని రకాల నేరాలు కొన్ని రాష్ట్రాల్లో ఎక్కువగా ఉన్నా మిగతా ప్రాంతాలు నేర రహితంగా ఉన్నట్టుకాదు. ఉదాహరణకు 2017లో స్ర్తిలపై నేరాలు నమోదైనవి 3 లక్షల 59వేలు. అందులో 56వేలతో ఉత్తరప్రదేశ్‌ది మొదటి స్థానం. 2016కన్నా 6 శాతం వృద్ధి చోటు చేసుకొంది. దేశ రాజధాని ఢిల్లీలో రోడ్డుప్రమాదాలెక్కువ. అధికారులు చిత్తశుద్దితో పనిచేసిన ప్రాంతాలలో నేరాలకు సంబంధించిన గణాంకాలు నమోదవుతున్నాయ. అలా లేని చోట్ల నేరాలకు సంబంధించి వాస్తవ గణాంకాలు బయటకు రావడంలేదు. స్థూలంగా చూస్తే మహిళలు, చిన్నారులు, బడుగువర్గాల వారిపై నేరాలు, అత్యాచారాలు ఏటా పెరుగుతూ పోవడం ఆందోళనకరం. సైబర్‌క్రైమ్ అంతకుముందు ఏడాది కన్నా 77 శాతం పెరిగింది. ఇవన్నీ చెప్పేదొకటే. నేర నియంత్రణలో ప్రభుత్వాలు దారుణంగా వైఫల్యం చెందాయని. నేరాలను నియంత్రించడానికి అవసరమైన చట్టాలున్నాయి. ఆధునిక పరిజ్ఞానం నేర పరిశోధనను సులభతరం చేసింది. అయినా వైఫల్యం అంటే అది వ్యవస్థాగత లోపం. చిత్తశుద్ధితో సరిదిద్దుకోవాల్సిన అత్యవసర విషయం. పోలీసుల దర్యాప్తు, కోర్టు విచారణ కారణంగా సగం కేసుల్లో శిక్షలు ఖరారు కావడంలో తీవ్ర జాప్యం జరిగినట్టు తేలింది. సక్రమంగా జరగాల్సిన తంతు ఇంత ఆషామాషీగా జరుగుతుంటే నేరస్థులకు భయం ఎక్కడనుండి వస్తుంది? ఇక రాజకీయ జోక్యాలు సరేసరి. ఒక నేరాన్ని చూసే విషయంలో కులం, మతం, ప్రాంతం, హోదా అడ్డురాకూడదు. చట్టం అందరికీ సమానమే అన్న సందేశం బలంగా ఇస్తే సగం నేరాలు తగ్గుతాయి. సోషల్ పోలీసింగ్, ఆధునిక పరిజ్ఞానం ఉపయోగించుకోవడం, దర్యాప్తు, విచారణ ప్రక్రియలు వేగవంతం చెయ్యడం లాంటి వాటిపై దృష్టిసారిస్తేనే నేరాలు కొంతవరకైనా తగ్గుముఖం పడతాయి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లెక్కలకన్నా ఈజ్ ఆఫ్ లివింగ్‌లో ముందడుగు వెయ్యడం అత్యవసరం.
డా.డి.వి.జి.శంకరరావు, పార్వతీపురం