ఉత్తరాయణం

అఘాయిత్యాలకు అంతం లేదా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశ్వనగరం.. భాగ్యనగరం.. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న మహానగరం హైదరాబాద్ అని పాలకులు గొప్పలు చెప్పుకుంటున్న నేపథ్యంలో శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో ఓ వైద్యురాలిపై జరిగిన సామూహిక అత్యాచారం, సజీవ దహనం ఉదంతం యావత్ దేశాన్ని కలిచి వేసింది. 2012లో దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ‘నిర్భయ’ ఘోరం తరహాలో ఆమధ్య జరిగిన దారుణం పట్ల ప్రజానీకం దిగ్భ్రాంతికి గురి అయ్యింది. ఈ దుర్ఘటనకు సంబంధించిన కేసుకు అప్పటి సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సి.వి.ఆనంద్ ‘అభయ’ అని పేరు పెట్టారు. నిర్భయ హంతకులకు ఏ విధంగా అతి తొందరగా ప్రత్యేక కోర్టు ద్వారా శిక్ష పడిందో, ‘అభయ’ కేసులో హంతకులకు అదే తరహాలో ఏడాది తిరగకుండానే శిక్ష పడేటట్లు అప్పటి పోలీస్ కమిషనర్ ఆనంద్ వ్యవహరించిన తీరు పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమయ్యింది. అభయ, నిర్భయ ఉదంతాల కంటె ఘోరంగా తాజాగా శంషాబాద్ సమీపంలో దాష్టీకం జరిగింది. ఇదే హైదరాబాద్ శివార్లలో నెల రోజుల క్రితం మహిళా తహసీల్దార్ విజయా రెడ్డిపై పెట్రోల్ పోసి ఓ ఉన్మాది దారుణంగా హత్య చేశాడు. 6 నెలల కిందట వరంగల్‌లో నాలుగు సంవత్సరాల చిన్నారిపై ఓ ప్రబుద్ధుడు అత్యాచారం చేసి హత్యచేశాడు. మానవత్వం నశించిన ఆ ముష్కరునికి కేవలం 40 రోజులలోనే శిక్ష పడేటట్లు వరంగల్ పోలీసు కమిషనర్ రవీందర్ తీవ్రంగా కృషిచేశారు. మహిళా వైద్యురాలి హత్యోదంతం జరిగిన మరుసటి రోజే అదే శంషాబాద్ పరిధిలో ఓ యువతి అనుమానస్పదంగా మంటల్లో కాలి బూడిదయ్యింది. ఈ దారుణాల గురించి దేశవ్యాప్తంగా చర్చించుకుంట్ను తరుణంలోనే ఢిల్లీలో 55 సంవత్సరాల మహిళపై ఓ మానవ మృగం అత్యాచారం జరిపి హత్యచేశాడు. 15 రోజుల కిందట చిత్తూరు జిల్లా కురుబులకోటలో ఐదారు సంవత్సరాల చిన్నారిని మరో కామాంధుడు కాటువేసి హత్యచేశాడు. విజయవాడలో కూడా ఈమధ్య ఇటువంటి ఘోరానికి మరో చిన్నారి బతుకు ఛిద్రమయ్యింది. ఇలా చిన్నారులు, యుక్తవయసు యువతులు, నడివయసు మహిళలు, వృద్ధ మహిళలు మగ మృగాళ్లకు బలిపశువులవుతుంటే... మున్ముందు ఆడజాతి అంతరించే దుస్థితి వస్తుందేమోనని ఆందోళన వ్యక్తమవుతున్నది. ఇటువంటి దారుణాలు మళ్లీమళ్లీ జరగకుండా వుండడానికి ఏ విధమైన చర్యలు చేపట్టాలో ఆలోచించాలని యావన్మందిలో ఓ ఆలోచన మొదలయ్యింది. 2008లో వరంగల్‌లో ఓ యువతిపై యాసిడ్ పోసిన యువకుడిని పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. 1995-2000 సంవత్సరాల మధ్య అనంతపురం జిల్లా పెనుకొండలో ఆస్తితగాదాల నేపథ్యంలో దగ్గరి బంధువైన ఓ చిన్నారిని హత్య చేయడంతో పెనుకొండ బార్ అసోసియేషన్ సభ్యులు మూకుమ్మడిగా హంతకుడి తరఫున బెయిల్ కోసం వాదించకూడదని తీర్మానం చేశారు. ఇలాగే ఆస్తితగాదాల ఫలితంగా 5 సంవత్సరాల కిందట విజయవాడలో ఓ వ్యాపారి కుటుంబానికి చెందిన చిన్నారిని హత్యచేశారు. ఇలా చెప్పుకుంటూపోతే.. రాష్ట్రాలు, ప్రాంతాలు అనే వ్యత్యాసం లేకుండా చాలాచోట్ల మహిళలు అకృత్యాలకు బలైపోతున్నారు. ఇపుడు వైద్యురాలి హత్యోదంతం గురించి తెలుసుకున్న వెంటనే కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి హంతకులను ఉరితీయాలని భావోద్వేగానికి గురయ్యారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కేంద్ర ప్రభుత్వ స్థాయిలో హోంశాఖ పరంగా కఠినమైన చట్టాలు తీసుకురాబోతున్నామని మంత్రి తెలియజేశారు. ఇటువంటి వైపరీత్యాలకు దారితీస్తున్న పరిస్థితులను అధిగమించడానికి సమాజంలోని అన్ని వర్గాలవారూ చొరవ చూపాలి. మానవ సమాజాం ఎటువైపు పోతున్నదన్న విషయమై అవగాహన కలిగించేందుకు సరికొత్త మానసిక విప్లవం తీసుకురావలసిన సమయం ఆసన్నమైంది.
-తిప్పినేని రామదాసప్పనాయుడు
ఆంగ్ల మాధ్యమంతోనే ఉద్యోగాలు రావు..
నేడు కొన్ని దేశాల్లో ఐటీ రంగానికి వున్న డిమాండుతో తెలుగు రాష్ట్రాల వారిలో ఇంగ్లీషు పట్ల వ్యామోహం వేలం వెర్రిగా మారింది. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాథమిక స్థాయి నుంచే ఆంగ్ల మాధ్యమంలో విధిగా బోధన జరగాలని ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. అర్థం కాని చదువులు వ్యర్థం అనేది సామెత. చిన్నపిల్లలకు మాతృభాషలోనైతే తేలికగా ఏ విషయమైనా అర్థమవుతుందని అభివృద్ధి చెందిన చైనా, జపాన్, కొరియా వంటి దేశాలు వారి మాతృభాషలోనే బోధిస్తున్నాయి. అక్కడి బాలలకు సిలబస్ భారం కూడ తక్కువే. వారికి లేని సమస్యలు మనకేమున్నాయి? ఆడుతూ పాడుతూ చదువుకోవలసిన బాల్యంలో ఉదయం నుండి రాత్రివరకు కార్పొరేట్ బడుల్లో ర్యాంకుల కోసం పోటీ, వత్తిడితో పిల్లలు ఆత్మహత్యలకు సైతం పాల్పడటం, ఇళ్ల నుంచి పారిపోవటం వంటి సంఘటనలను తల్లిదండ్రులు గమనించాలి. కనుక పిల్లలపై చదువుల భారం తగ్గించి కొంత సమయం ఆటలకు కేటాయించే ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవాలి. అమ్మఒడి పథకాన్ని ప్రభుత్వ పాఠశాలలతోపాటు క్రీడా సౌకర్యాలున్న ప్రైవేట్ స్కూళ్ళకే వర్తింపచేస్తే బాగుంటుంది. కానె్వంట్లలో చదివిన వారికే వుద్యోగాలు అనే మాట నిజం కాదు. ప్రతిభ, చదువుల పట్ల శ్రద్ధాసక్తులుంటే పాఠశాల స్థాయిలో మాధ్యమానికి ఏ భాషైనా ఒకటే.
ప్రపంచంతో పోటీపడాలంటే ఇంగ్లీషు అవసరమంటారు మన మంత్రులు. ఆమాట నిజమే కాని ఐదు, పది తరగతుల పాఠశాల విద్యతోనే విదేశాల్లో ఉద్యోగాలు లభించవు. కాలేజి స్థాయి నుండి తమ ప్రతిభకు తగిన విధంగా రాణించవచ్చు. ప్రభుత్వాలే భారీ రాయితీలిచ్చి విదేశీ విద్యను ప్రోత్సహిస్తుంటే మేధోవలసలతో మన దేశం నష్టపోతుంది. విదేశాలు లబ్దిపొందుతున్నాయి. వెళ్ళిన కొద్దిమంది కూడ అక్కడ ప్రభుత్వాల దయాదాక్షిణ్యాలపై ఆధారపడటం, వారికోసం మన ప్రభుత్వాలు కొన్ని సందర్భాల్లో రాజీపడాల్సి వస్తుంది. పొరుగింటి పుల్లకూర రుచి అన్నట్లు మన డాక్టర్ల అర్హత నిర్ధారించే పరీక్షల్లో రష్యా, చైనా దేశాల్లో చదివిన వారికంటే మన దేశం, బంగ్లాదేశ్‌ల్లో చదివిన వారే ఎక్కువమంది ఉత్తీర్ణత సాధిస్తున్నారట. ఇంగ్లీషు మాధ్యమం, విదేశీ చదువులు వ్యక్తిగతం. తల్లిదండ్రులు ఎవరిష్టం వచ్చిన రీతిలో వారు తమ పిల్లలను చదివించుకుంటారు. ప్రాథమిక పాఠశాలల్లో నిర్బంధ ఆంగ్ల మాధ్యమం పేరిట కోట్లాది రూపాయల ప్రజాధనం అవసరం లేదు. ప్రపంచీకరణతో ఆర్థిక అసమానతలు, విలాస సంస్కృతి పెరిగి కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నమైపోతుంది. ఫలితంగా దిక్కూ మొక్కూలేని అనాథ వృద్ధులు, బాలల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. మొదట అటువంటి నిరుపేదలు, అనాథల కోసం ప్రతి మండలంలో శరణాలయాల వంటివి నిర్మించి ప్రభుత్వం ఆదుకోవాలి. మొదట దేశంలోని పేదల గురించి ఆలోచించి, అటు పిమ్మట విదేశాలు వెళ్ళే వారి గురించి ఆలోచించుకోవచ్చు. విదేశాలకు వెళ్ళేవారు కూడ 2%లోపు మాత్రమే. ప్రాథమిక విద్యలో గ్ల మాధ్యమం నిర్బంధంగా అమలుచేయటం కష్టం గనుక, యథాస్థితి కొనసాగిస్తూ ఇంటర్మీడియట్ నుండి ప్రవేశపెడితే ప్రభుత్వం ఆశించే విధంగా కొంత ప్రయోజనం వుండవచ్చు.
- తిరుమలశెట్టి సాంబశివరావు, నర్సరావుపేట