ఉత్తరాయణం

నీరుల్లికి నీరాజనం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ఉల్లిచేసే మేలు తల్లి చేయదన్నా’
నీరుల్లి, ఉల్లిపాయలు, ఎర్రగడ్డలు,
ఉల్లిగడ్డ, ఎఱుల్లి, సవాళ,
ఆనియన్, వెంగాయమ్, డున్గ్రీ,
ప్యాస్, పియాజ్, కాందా--
ఇన్ని నామాలింకెన్ని నామాలో! అన్నా
ఎంత మురిసిపోతావెంత మురిసిపోతావ్!

నామమేదైనా
భానుడి భగభగలకు బడలిన, సొమ్మసిల్లిన
బాలుని సేదతీర్చే ప్రక్రియ నీతోనే
‘చిల్లీ’తో కలిపి కోసినప్పుడు
కన్నీళ్ళు తెప్పించినా
కర్షకునికి కంచంలో
పంచభక్ష్య పరమాన్నానివి

సామాన్యుడికి ‘సేపు’వి,
అసామాన్యుడికి ‘ఆనియన్’వి.
దిగుబడి లేదంటావు, దిగిరావు
‘వెయిటు పెరిగేదే గానీ
నా విలువ తరగదు’ అంటావు!
ఏలినవారి కరుణతో ఎలాగో మెడ వంచి
బడుగుల బాగుకోసం
బలవంతంగా దింపినా
బంతిలా మరలెగురుతావు!
వినియోగదారుని విస్తుపోయేట్లు చేస్తావు,
విపణి వీధిలో చోరులకు చోటిస్తావు

ఎన్నికలప్పుడు ఎంతో ఒదిగిపోయే నీవు
ఎన్నికలానంతరం ఎంతో ఎదిగిపోతావు!
కష్టార్జితుడి కన్నీళ్ళోలికిస్తావు,
పగలబడి నవ్వుతావు
ప్రభుత్వాల పతనానికి హేతువై.
పోఖ్రాన్, చెగై, షహీన్‌ల కన్నా శక్తివంత విస్ఫోటనం నీది!

రోజుకొక్క ఆపిలు
ఒక వైదుడినొకింత దూరం పెడితే
ఓ ఎర్ర ఉల్లిగడ్డా! ఎల్లరనూ ఎడం చేస్కుంటున్నావు!

-వేదం సూర్యప్రకాశం 98661 42006
న్యాయవ్యవస్థలో మార్పులు అవసరం
ఇటీవల జరుగుతున్న అత్యాచార ఘటనల్ని చూస్తుంటే ఆడపిల్లల తల్లిదండ్రులకు గుండె బరువెక్కుతున్నది. నిందితులకు కఠిన శిక్షలు సత్వరం అమలుకాకపోవడం ఇందుకు కారణం. ఈ పరిస్థితి మారాలంటే ప్రస్తుత చట్టాలు, న్యాయవ్యవస్థలో సమూల మార్పులు అవసరం. ‘దిశ’ ఘటనను ఢిల్లీ నుంచి గల్లీవరకు ప్రజానీకం యావత్తు ముక్తకంఠంతో ఖండిస్తున్నది. నిరసన జ్వాలలు వ్యక్తమైన తర్వాత కూడా ఇలాంటి ఘటనలు పదే పదే జరుగుతున్నాయి. నిర్భయ చట్టాన్ని తీసుకువచ్చిన తర్వాత కూడా ఈ దారుణాలు పునరావృతం కావడానికి చట్టాల్లోని లొసుగులే కారణం. న్యాయవ్యవస్థ, ప్రభుత్వం, ప్రజలు కలిస్తే ఇలాంటి రుగ్మతలను రూపుమాపవచ్చు. ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు ఏర్పాటుచేస్తే బాధితులకు సత్వర న్యాయం లభిస్తుంది. కేసుల్ని విచారించడంలో విపరీత జాప్యం వల్ల అప్పీళ్లకు, క్షమాభిక్షలకు వెసులుబాటు లభిస్తోంది. ఇలాంటి ఘటనల్లో నిందితుల తరఫున న్యాయవాదులు వాదించకూడదనే చట్టం తేవాలి. చట్టాల పట్ల భయం లేనందున కొందరు యువకులు పెడదారిన పడుతున్నారు. మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాలు మహిళలపై అత్యాచారాల్లో ప్రథమస్థానంలో ఉన్నాయి. అన్ని జిల్లాల్లోనూ షీ టీం వ్యవస్థను పటిష్టపరచాలి. హెల్ప్‌లైన్ నెంబర్లపై యువతులు, మహిళలకు అవగాహన కల్పించాలి. కళాశాలల్లో, మహిళలు పనిచేస్తున్న చోట్ల భరోసా కేంద్రాలను ఏర్పాటుచేయాలి. ఇందుకు స్ర్తి, శిశు సంక్షేమ శాఖ బాధ్యత వహించాలి. అప్ఘనిస్థాన్, నార్త్ కొరియా, సౌదీ, ఈజిప్టు, అమెరికా తరహాలో మన దేశంలోనూ రేపిస్టులకు కఠిన చట్టాలను, బహిరంగ శిక్షలను అమలుపరచాల్సిందే. ప్రపంచమంతా ఒకే తరహా శిక్షలు ఉండాలి.
-సామంతుల సదానందం, పరకాల