ఉత్తరాయణం

శభాష్.. తెలంగాణ పోలీస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘దిశ’ హంతకులను పోలీస్ కస్టడీకి ఇస్తున్నారని తెలియగానే - ప్రజల్లో చాలామంది ‘పోలీసులు నిందితులను ఎన్‌కౌంటర్ చేస్తారనే’ ఆలోచనకు వచ్చారు. అలా అనుకున్నట్టుగానే నలుగురు నిందితులు ఎన్‌కౌంటర్‌లో ప్రాణాలు కోల్పోయారు. పోలీసుల చర్యకు తెలంగాణ సమాజమే కాకుండా యావత్ భారత దేశం హర్షం వ్యక్తం చేస్తున్నది. 2008లో వరంగల్‌లో ఒక యువతిపై యాసిడ్ పోసిన ఘటనలో ముగ్గురు యువకులను పోలీసులు ఎన్‌కౌంటర్ చేసినపుడు అప్పటి ముఖ్యమంత్రిని సర్వత్రా అభినందించారు. ‘దిశ’ దుర్ఘటన గురించి చర్చోపచర్చలు జరుగుతున్న తరుణంలో- గ్యాంగ్‌స్టర్ నరుూంను ఎన్‌కౌంటర్ చేసినట్లు ఈ నిందితులను ఎందుకు ఖతం చేయడం లేదని చాలామంది ప్రశ్నించారు. నరుూంను దశాబ్దాలుగా అన్ని రాజకీయ పక్షాల నాయకులు పెంచి పోషించారు. అతడు భస్మాసురునిగామారి చివరకు పాలకవర్గం నేతలకు సం బంధించిన వారిని బెదిరించడంతో అప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో పైనుంచి వచ్చిన ఆదేశాల మేరకు నరుూంను ఎన్‌కౌంటర్ చేశారు. ‘దిశ’ కుటుంబానికి రాజకీయ నేపథ్యం లేనందుకు ఈ కేసు పట్ల పోలీసులు, పాలకులు నిర్లిప్తతతో వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వచ్చాయి. 6 నెలల కిందట సీనియర్ కిల్లర్ శ్రీనివాస్‌రెడ్డిని ఎన్‌కౌంటర్ చేసివుంటే నేడు ‘దిశ’కు ఈ దుస్థితి వచ్చేదికాదని మరికొంతమంది విమర్శించారు. 2012లో ఢిల్లీలో నిర్భయ పట్ల జరిగిన దారుణాన్ని ఖండిస్తూ ఆ హంతకులకు శిక్ష పడడానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకున్నది. వారికి ఉరిశిక్షను ఖరారు చేశారే తప్ప ఇంతవరకు అమలుచేయలేదు. నిర్భయకు జరిగిన ఘోరం ‘దిశ’కు కూడా జరిగింది. హంతకులను నింపాదిగా రిమాండ్‌కు పంపించారు. వాళ్లు సబ్ జైలులో హాయిగా వున్నారు. వీరిమీద విచారణ పూర్తి అయ్యేదెన్నడు? శిక్ష పడేదెన్నడు? అని మరికొందరు ఆవేదన వ్యక్తం చేశారు. మెజార్టీ సమాజం హంతకులను ఎన్‌కౌంటర్ చేయాలి లేదా అతి కొద్ది సమయంలోనే విచారణ పూర్తిచేసి ఉరిశిక్ష వేయడానికి ప్రత్యేక కోర్టు ఏర్పాటుచేయాలని డిమాండ్ చేశారు. ఎలాగైతేమి? తెలంగాణ పోలీసులు తాము రచించిన వ్యూహంలో భాగంగా ‘దిశ’ నిందితులను ఎన్‌కౌంటర్ చేశారు. చట్టాలు, నిబంధనలు అనే అడ్డుగోడలను తొలగించి ‘స్పాట్ జడ్జిమెంట్’ అనే విధంగా పోలీసులు వ్యవహరించినందుకు ప్రతి ఒక్కరూ హర్షం ప్రకటిస్తున్నారు.
-తిప్పినేని రామదాసప్పనాయుడు