ఉత్తరాయణం

కోరి కొరివితో తల గోక్కుంటున్న కేంద్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశం ముందు పెను సవాళ్లున్నాయి. అందులో మొదటిది ఆర్థికంగా దివాళా దిశగా దేశం దిగజారుతూ పోవడం. కనుక ఆర్థికస్థితి చక్కబరచడం ప్రభుత్వానికి తొలి ప్రాధమ్యం కావాలి. ఒక రకంగా చూస్తే అదే ఏకైక ప్రాధమ్యం కావాలి కూడా. ఆ స్థాయిలో ఫోకస్ అవసరమున్న తీవ్రమైన అంశం ఇదే. త్వరలో ఐదు లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక శక్తి కావాల్సిన దేశం అవసరమైన వృద్ధిలో అర సగమైనా నమోదు చెయ్యలేకపోతుందంటే దిద్దుకోవాల్సిన లోపాలు స్పష్టంగా ఉన్నట్టేకదా. ద్రవ్యోల్బణం, మందగించి చతికిలపడ్డ వృద్ధిరేటు, ప్రజల్లో కొనుగోలుశక్తి తగ్గిపోవడం, పేదరికం పెరగడం, మానవాభివృద్ధి సూచికలు దయనీయంగా ఉండడం.. వీటిని అధిగమించానికి ప్రభుత్వం చేసే ప్రయత్నాలు విఫలం కావడం ఈ దుస్థితిని కొనసాగిస్తే దేశం మరింత వెనక్కిపోవడం తప్పించి ఫలితం ఏముంది? ఇలాంటి స్థితిలో ఏకోన్ముఖంగా దేశ సౌభాగ్యానికి దారులు వెదకడం, మేధావులు, ప్రజలతో సమాలోచనలు జరపడం పరిష్కారాలకై పనిచెయ్యడం కదా ప్రభుత్వం చెయ్యాల్సింది. ఆ పనిని వెనక్కి నెట్టి అప్రధాన విషయాలను తలకెత్తుకొంటుంది కేంద్ర ప్రభుత్వం. ఆ కారణంగానే వెనక వరుసలో ఉండాల్సిన సమస్యలు ముందు వరుసలోకి వచ్చి పరిస్థితిని మరింత దిగజారుస్తున్నాయి. పౌరసత్వ సవరణ చట్టం ఆ కోవలోనిదే. పౌరసత్వం అంశం ప్రధానమైనదే కావొచ్చు కానీ అర్జెంట్‌గా నిర్ణయించాల్సిందేమీ కాదు. కొంతకాలం వేచియున్నా కొంపలేమీ మునగవు. ముఖ్యంగా ఇప్పటికిప్పుడు తేల్చేయాల్సింది ఏమీలేదు ఇందులో. ఇప్పటికే దేశంలోకి వచ్చి బ్రతుకులీడుస్తున్న కొన్ని కోట్ల మంది జీవితాలతో ముడిపడి ఉన్న సమస్య అయినప్పటికీ హడావిడిగా నడుం కట్టాల్సిన అత్యవసర స్థితి అయితే లేదు. పైగా పక్క దేశాలనుండి వచ్చిన శరణాగతుల్ని ఆదుకోవాలనుకోవడం మంచి విషయమే. మన భారతీయ చరిత్రలో అడుగడుగునా ద్యోతకమయ్యే ఉత్తమ సంస్కృతి అదే. అయితే శరణాగతుల్ని మతం ద్వారా గుర్తించడం, మతం కారణంగా విస్మరించడం సంస్కృతీ పరంగానే కాక రాజ్యాంగపరంగా కూడా సబబుకాదు. ఈ నేపథ్యంలో వచ్చిన అపోహలకు దేశవ్యాప్తంగా చెలరేగుతున్న అలజడికి ప్రభుత్వం బాధ్యత వహించక తప్పదు. అసలు సమస్యకు రాజకీయ ఆజ్యం తోడవ్వకుండా చూడాల్సిన గురుతర బాధ్యత ముఖ్యంగా అధికారపక్షం మీదనే ఉంది. సున్నితమైన పౌరసత్వం, జాబితా నిర్ణయాల్ని ప్రభుత్వం వాయిదావేసి అత్యవసరమైన ఆర్థిక సమస్యలపై దృష్టిపెట్టాలి.

- డా. డి.వి.జి. శంకరరావు, పార్వతీపురం