ఉత్తరాయణం

త్రిలింగ దేశానికి త్రీ క్యాపిటల్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మూడు రాజధానుల ముచ్చటైన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ని చూడాలనుకొంటున్నారు గౌరవ ముఖ్యమంత్రి. ఒక వినూత్నమైన ఆలోచన. ఆంధ్ర మహావిష్ణువు పాలనలో మన రాష్ట్రం ఒకప్పుడు మూడువైపులా మూడు శైవక్షేత్రాల (లింగాల) నడుమ రాజ్యంగా విస్తరించి త్రిలింగ రాజ్యంగా పేరొందింది. కోస్తాలో ద్రాక్షారామం, సీమలో శ్రీశైలం, ప్రస్తుత తెలంగాణాలో కాళేశ్వరం అవి. ఇప్పుడు మూడుచోట్ల మూడు విభాగాల రాజధానులు నెలకొల్పాలనుకోవడం కొట్టిపారెయ్యదగ్గ ఆలోచన కాదు. లోతుగా చర్చించి గమనంలోకి తీసుకోదగ్గది. గత ముఖ్యమంత్రి బాహుబలి స్థాయి ఏకైక అంతర్జాతీయ మహానగరం రాజధానిగా కలగంటే, నేటి యువ ముఖ్యమంత్రి బహుళ నగరాల్ని రాజధానులుగా ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తే బాగుంటుందని భావిస్తున్నారు. అధికార వికేంద్రీకరణ, అభివృద్ధి కార్యక్రమాల వికేంద్రీకరణ అన్నవి ఎన్నటికీ మంచి ఆదర్శాలే. ఆచరింపదగ్గవే. ఐతే ఐదేళ్లూ రాబోయే అంతర్జాతీయ నగరం స్థాయి ప్రచారం పొందిన నగరం అతిమామూలు స్థాయికి మిగిలితే కలగబోయే నష్టమెంత, లేదా జరుగుతూన్న నష్టవిచారణ ఏమేరకు అన్నది మదింపు జరగాలి. ఆదా మార్గాలూ, ఆదాయ మార్గాలూ ఎలా ఉండబోతున్నాయి, ఆయా పట్టణాలపై, ప్రాంతాలపై ఏయే ప్రభావాలు ఏమేరకు అన్నది చర్చించాలి. అసలు ఈ డిజిటల్ ఏజ్‌లో రాజధాని పరిమాణం గానీ, ప్రాంతం కానీ సమస్యే కాదు. అమెరికాలో కూర్చుని అనకాపల్లిలో వ్యాపారం చెయొచ్చు. పారిస్‌లో కూర్చొని పలాసలో వ్యవహారం నడపొచ్చు. ఇక పాలనా వ్యవహారాలు ఏ మూల కూర్చొని ఏ మూలనైనా జరపొచ్చు. అయితే ముఖ్య కేంద్రాలన్నవి మా ప్రాంతాలకూ ఉన్నాయి అన్న భరోసా ప్రాంతాల మధ్య వివక్షని తగ్గిస్తుంది. ఒక రాష్ట్రానికి పాలనా రాజధాని, న్యాయ రాజధాని, శాసన రాజధాని వేర్వేరుగా ఏర్పరిచే ఆలోచన మేధోమధనం చేయదగ్గది.
- డా.డి.వి.జి. శంకరరావు, పార్వతీపురం