ఉత్తరాయణం

చారిత్రాత్మక తీర్పు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎట్టకేలకు ఎనిమిది సంవత్సరాల తరువాత ఢిల్లీలోని ప్రత్యేక కోర్టు నిర్భయను అత్యంత దారుణంగా అత్యాచారం జరిపి, హత్యచేసిన నలుగురు మానవత్వం మరచిన క్రూర మృగాలకు ఉరిశిక్ష విధించడం ఎంతైనా హర్షణీయం. ఒక విధంగా చెప్పాలంటే స్వతంత్ర భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారి ఓ నలుగురు దోషులకు ఉరిశిక్ష పడటం అనేది ఒక చారిత్రాత్మక, సంచలనాత్మక విషయం. ముఖ్యంగా ఈ చిరస్మరణీయ తీర్పు నిర్భయ తల్లిదండ్రులకు ఒక గొప్ప ఓదార్పును ఇచ్చి ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆమె తల్లిదండ్రులకు పుట్టెడు దుఃఖం సంప్రాప్తించి వారు ఒక్కసారిగా శోకసముద్రంలో మునిగిపోయారు. ఆ మృగాళ్ళకు ఉరిశిక్ష పడేంతవరకు పోరుబాటపట్టి తామనుకున్న లక్ష్యాన్ని సాధించడం ఎంతైనా అభినందనీయం. ఎందుకంటే తమకు జరిగిన అన్యాయం మరే ఆడ బిడ్డకు జరుగకూడదనే దృఢ నిశ్చయంతో ఆ నలుగురు కిరాతకులకు న్యాయస్థానంవారు ఉరిశిక్ష విధించేలా ఒక గట్టి ప్రయత్నం చేయడంతో దేశవ్యాప్తంగా వున్న మహిళామణులందరూ వారి పట్ల ఎంతో గౌరవ మర్యాదలు కలిగివున్నారు
అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇంకా చెప్పుకుంటూపోతే ఈ వెలకట్టలేని తీర్పుతో దేశంలోని మహిళా లోకానికి యావత్తు మన చట్టం పట్ల మరింత నమ్మకం, ఎనలేని భరోసా ఏర్పడింది అనే మాటలో ఏమాత్రం అవాస్తవం లేదు. ఏది ఏమైనా ఈ అత్యంత విలువైన తీర్పు మహిళలు అంటే ఒక ఆట వస్తువుగా భావించి వారి మానప్రాణాలను అత్యంత కర్కశంగా దోచుకోవాలనుకునే మానవ మృగాళ్లకు ఒక చెంపపెట్టు వంటిది. ఏమైనా ఈ ప్రత్యేక సందర్భాన ఇలాంటి అసాధారణ తీర్పుచెప్పి మహిళల్లో ఎనలేని ఆత్మవిశ్వాసాన్ని, వారి జీవితాలకు ఒక రక్షణను కల్పించిన న్యూఢిల్లీలోని ప్రత్యేక కోర్టు వారికి ఈ దేశంలోని ప్రజానీకం యావత్తు ఒక్కసారి జేజేలు చెబుదాం. వారికి మనసా వాచ కర్మణా, మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేయడం మనందరి బాధ్యత, కర్తవ్యం. జయహో భారత్, భారతమాతకి జై, మేరా భారత్ మహాన్.
- బుగ్గన మధుసూదనరెడ్డి, బేతంచర్ల, కర్నూలు జిల్లా