ఉత్తరాయణం

చింతపండుపై జిఎస్‌టి వద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొన్ని కోట్ల మంది భారతీయులు చింతపండు లేకుండా వంట చేసుకోరు. నిజానికి ఇది నిత్యావసరంగానే భావించాలి. చింతపండుపై జిఎస్‌టి విధించడం వల్ల పేదలకు భారంగా పరిణమించింది. మధ్య తరగతివారికి ఇది చికాకు కలిగిస్తోంది. జిఎస్‌టి పేరుతో వ్యాపారులు కూడా దోపిడీ చేస్తున్నారు. నిజంగా ప్రభుత్వానికి చెల్లింపులు చేస్తున్నారో లేదో తెలీదుకానీ వసూళ్లు మాత్రం చక్కగా చేస్తున్నారు. దీంతో చింతపండు ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. దీనికి కళ్లెం వేసేలా జిఎస్‌టి శ్లాబ్‌ల నుంచి చింతపండును మినహాయించాలి.
-జె.సుధాకర్ పట్నాయక్, కాకినాడ
షిరిడికి రైలు నడపాలి
కరీంనగర్-నిజామాబాద్ మార్గంలో మెట్‌పల్లి ఉంది. ఇక్కడి నుంచి షిరిడి, తిరుపతి, ముంబయి ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల సంఖ్య ఎక్కువగానే ఉంది. అయితే సరైన రైలు సౌకర్యం లేదు. అందరూ బస్సులపైనే ఆధారపడవలసి వస్తోంది. బస్సుల్లో వెళితే ఎక్కువ సమయం పడుతోంది. రైలులో వెళ్లాలంటే 90 కిలోమీటర్ల దూరంలోని కరీంనగర్‌కు వెళ్లి ఎక్కవలసి వస్తోంది. ఇది వ్యయప్రయాసలతో కూడుకుంటోంది. పైగా కరీంనగర్ నుంచి వారంలో రెండుసార్లు మాత్రమే తిరుపతికి రైలు సౌకర్యం ఉంది. కరీంనగర్ - నిజామాబాద్ రైలుమార్గం ఇటీవలే పూర్తయింది. ప్రస్తుతం మెట్‌పల్లి మీదుగా రోజుకు ఒకసారి, అదీ ఉదయం ఆరు గంటలకు పుష్‌పుల్ రైలు వస్తోంది. అందువల్ల జగిత్యాల నుంచి షిరిడి, మెట్‌పల్లి నుంచి తిరుపతికి వెళ్లేందుకు వీలుగా రైలును నడపాలి.
-జి.అశోక్, గోధూర్
వారసత్వ ఉద్యోగాలు ఎందుకు?
సింగరేణిలో వారసత్వ ఉద్యోగ అవకాశాలు కల్పించడం సరైన చర్య కాదు. వారసత్వ ఉద్యోగాలు ఇవ్వాలన్నది హక్కు కాదు. అలా అయినప్పుడు అన్ని ప్రభుత్వ సంస్థలలో ఆ విధంగా ఉద్యోగ నియామకాలకు అవకాశం కల్పించాలి. ఐదేళ్ల ముందుగా పదవీ విరమణ చేసి తమ పిల్లలకు ఉద్యోగం వచ్చేలా ఉండే అవకాశాన్ని దుర్వినియోగం చేయడం వల్ల ఆ పద్ధతిని ప్రభుత్వాలు రద్దు చేసి, పదేళ్లు ముందుగా పదవీ విరమణ చేయాలన్న నిబంధన తీసుకువచ్చింది. అయినా మార్పు కనిపించకపోవడం దానినీ రద్దు చేశారు. సింగరేణిలోనూ వారసత్వ నియామక పద్ధతిని రద్దు చేయాలి. అనారోగ్య కారణాలు, సర్వీసులో ఉండా ప్రమాదాలకు గురైనవారికి వారసత్వ ఉద్యోగాలు ఇవ్వడంలో ఎటువంటి తప్పు లేదు. కానీ పదవీ విరమణ చేసినవారి ఉద్యోగుల పిల్లలకు అవకాశం ఇవ్వాలన్నది సరికాదు. ఈ విషయంలో కోర్టు తీర్పు స్పష్టంగా ఉంది. రాజకీయ లబ్ధికోసం ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోరాదు.
-ఎ.ఆర్.ఆర్., ఖమ్మం
అమలు కీలకం
తెలంగాణలో వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఒకటో తరగతి మొదలు ఇంటర్మీడియట్ వరకు తెలుగుభాషను తప్పనిసరి చేయాలన్న నిర్ణయం మంచిదే. అయితే లక్ష్యం సిద్ధించాలంటే దానిని చిత్తశుద్ధితో అమలు చేయాల్సి ఉంటుంది. ఇంటర్మీడియట్‌లో తెలుగు ద్వితీయభాషగా ఓ వెలుగు వెలగాలి. తెలుగువారంతా మన ముఖ్యమంత్రిని వేనోళ్ల పొగిడేలా కార్యాచరణ పథకం రూపొందించవలసి ఉంది.
-కూర్మాచలం వేంకటేశ్వర్లు, కరీంనగర్
పర్యావరణాన్ని కాపాడాలి
పొలాలు అదృశ్యమవుతున్నాయి. ఆ ప్రాంతాల్లో ఇప్పుడు బహుళ అంతస్థుల భవనాలు నిర్మిస్తున్నారు. వీధులు, సందుల్లోనూ సిమెంటు రోడ్లు దర్శనమిస్తున్నాయి. దీంతో పచ్చదనం కరవైంది. భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. చెరువులు, కుంటలు, నదీతీరాలు ఆక్రమణలకు గురవుతున్నాయి. ఈ చర్యల వల్ల పర్యావరణం దెబ్బతింటోంది. కాలుష్యం పెరిగిపోతోంది. భవిష్యత్ బాగుండాలంటే ప్రజలు, ప్రభుత్వం కళ్లు తెరవాలి.
-బిగ్గు అఖిల్ శ్రీనివాస్, గూడవల్లి