ఉత్తరాయణం

జాతీయ నాయకులను మరిచారా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్వాతంత్య్ర సమరయోధుడు, మాజీ హోంశాఖ మంత్రి సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ బిజెపి వారికి ఆరాధ్య దేముడయ్యాడు. పటేల్ జయంత్యుత్సవాలను కాంగ్రెస్ పార్టీవారు పట్టించుకునేవారు కాదు. అది విచారకరం. అలాగే ఇందిరాగాంధీ భారతదేశ రాజకీయాలను, విదేశాంగ విధానాన్ని మేలుమలుపుతప్పిన ధీర. ఒక్క ఎమర్జెన్సీ తప్ప మిగతా నిర్ణయాలన్నీ ఆమె నాయకత్వ పటిమకు నిదర్శనంగా నిలిచాయి. అక్టోబర్ 31 ఆమె వర్థంతి. దేశం కోసం ప్రాణాలర్పించిన మహా నాయకురాలిని తగిన రీతిలో స్మరించుకోవడం లేదు. ముఖ్యంగా అన్ని రాజకీయ పార్టీల ధోరణి అలాగే ఉంది. అది బాధాకరం. గొప్పవారిని సందర్భానుసారం తలచుకోవడం, నివాళి అర్పించడం మన సంస్కృతి. తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూను మాత్రం ఏమంత గొప్పగా తలచుకున్నారని? జాతికి మేలుచేసిన నేతలను మరచిపోతే ఎలా?
-ఎన్.రామలక్ష్మి, సికింద్రాబాద్
దుస్థితిలో పిఎంపాలెం పోస్ట్ఫాసు
విశాఖ నగరంలోని పి.ఎం.పాలెం పోస్ట్ఫాసు నిర్వహణ సరిగ్గా లేదు. అక్కడి బ్రాంచ్‌లో పోస్టల్ స్టాంపులు, ఇన్‌లాండ్ కవర్లు దొరకడం లేదు. 5 రూపాయల స్టాంపు దొరకడం గగనం. చాలీచాలని ఇరుకు గదిలో పోస్ట్ఫాసును నిర్వహిస్తున్నారు. ఒకే ఒక కిటికీ ద్వారా లావాదేవీలు నిర్వహిస్తున్నారు. వినియోగదారులకు ఇది చాలా అసౌకర్యంగా ఉంది. ఉత్తరాలు పోస్టు చేద్దామన్నా అక్కడ పోస్ట్‌బాక్సులు లేవు. కనీసం కార్యాలయం వద్దనైనా పోస్టుబాక్సును ఏర్పాటు చేయాలి. పెద్దసంఖ్యలో ప్రజలు నివసిస్తున్న పిఎంపాలెంలో పోస్ట్ఫాసు అందుకు తగ్గట్లు ఉండాలి.
-శివాని, విశాఖపట్నం
ఆ నేతలకు మరో దారి లేదు
తెలంగాణ తెలుగుదేశం నేతలు రాజకీయ భవిష్యత్‌కోసం పార్టీలు మారుతున్నారు. వారికి ఇప్పుడు మరో దారి కనిపించడం లేదు. తెలంగాణలోని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ముందే మేల్కొని టిఆర్‌ఎస్‌లో చేరిపోయారు. ఇప్పుడు వారి బాటలో తెలంగాణ తెలుగుదేశం నేతలు పయనిస్తున్నారు. నవ్యాంధ్ర పాలనపై దృష్టిపెట్టిన చంద్రబాబు తెలంగాణలో పార్టీపై పెద్దగా పట్టించుకోవడం లేదు. దీంతో నాయకులు ఎవరికి తోచినదారిలో వారు వెడుతున్నారు.
-బి.వి.కె.రావు, హైదరాబాద్
కరెన్సీకి కొత్త కళ
ఒకప్పుడు కరెన్సీ నోట్లపై ఇష్టం వచ్చినట్లు రాసేవారు. తెల్లనిచోట బొమ్మలు వేసేవారు. నోట్లను నలిపేసేవారు. పెద్దనోట్ల రద్దు సందర్భంలో విడుదలైన కొత్తనోట్లపై అలాంటివి చేస్తే చెల్లవని రిజర్వుబ్యాంకు ప్రకటించడంతో వినియోగదారులు నోట్లను భద్రంగా చూసుకుంటున్నారు. ఒకటీ అరా నోట్లపై రంగులుపడ్డా, గీతలు పడ్డా చెల్ల్లుబాటుకావడం లేదు. దీంతో మరింత జాగ్రత్త వచ్చింది. అందువల్ల కొత్త కరెన్సీ తళతళలాడుతోంది.
-నున్న మధుసూదన రావు, హైదరాబాద్