ఉత్తరాయణం

వరంగల్ రహదార్లు అధ్వాన్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ తరువాత అతిపెద్ద నగరం, కార్పొరేషన్ వరంగల్. అయితే అందుకుతగ్గట్లు నగరంలో పరిస్థితి లేదు. మురికి కాల్వల నిర్వహణ ఏ మాత్రం బాగోలేదు. రహదార్లు అధ్వాన్నంగా ఉన్నాయి. ఎక్కడికక్కడ గోతు లు దర్శనమిస్తున్నాయ. నిజానికి వరంగల్ నగరానికి కేంద్ర ప్రభుత్వం ‘హృదయ్’, ‘స్మార్ట్‌సిటీ’గా అభివృద్ధి చేయడానికి ఎంపిక చేసింది. చారిత్రక పర్యాటక ప్రాంతమైన వరంగల్‌కు వచ్చే పర్యాటకులు ఇక్కడి పరిస్థితులు చూసి ముక్కునవేలేసుకుంటున్నారు. హనుమకొండ చౌరస్తా నుంచి బస్టాం డ్ రోడ్డు, బాలసముద్రం-నక్కలగుట్ట రోడ్డు చాలా దారుణంగా ఉంది. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి చక్కదిద్దే చర్యలు చేపట్టాలి.
-కామిడి సతీష్‌రెడ్డి, జడలపేట