ఉత్తరాయణం

భండారీ విజయం అపూర్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయ న్యాయస్థానంలో భారత్ తరపున న్యాయమూర్తి దల్వీర్ భండారీ తన ప్రత్యర్థి బ్రిటిష్ న్యాయమూర్తిపై గెలుపొంది తిరిగి ఎన్నిక కావడం చారిత్రాత్మకం. 15మంది న్యాయమూర్తుల పానెల్‌కి మూడేళ్లకు ఒకసారి జరిగే ఎన్నికలకు భారత్ పోటీ పడటమేకాకుండా, ఐక్యరాజ్య సమితిలో శాశ్వత సభ్యత్వం కలిగిన బ్రిటన్‌కు గట్టిపోటీ ఇచ్చింది. అడుగడుగునా వ్యూహప్రతివ్యూహాలతో సాగిన పోరులో భారత్ పైచేయి సాధించడం, శక్తివంతమైన బ్రిటన్ ఓడిపోవడం భారత్ దౌత్య విజయానికి సంకేతం. ఐక్యరాజ్య సమితి సాధారణ అసెంబ్లీలో మూడింట రెండొంతుల మెజారిటీ సాధించడం ఆయా దేశాల్లో భారత్ పట్ల పెరిగిన సానుకూలతకు నిదర్శనం. ఫలితంగా 70 ఏళ్ల అంతర్జాతీయ న్యాయస్థానం చరిత్రలో మొదటిసారిగా బ్రిటన్‌కు న్యాయమూర్తి స్థానం లేకుండా పోయినట్లయింది. ఈ విజయం ద్వారా భారత్ భద్రతా మండలిలో సభ్యత్వం పొందేకల సాకారానికి కొంత దగ్గరవుతున్నట్లే. ప్రపంచదేశాల్లో తన వాణికి పెరుగుతున్న గౌరవానికి తగ్గట్లు భారత్ నడుచుకోవలసిన బాధ్యత పెరుగుతున్నట్లే. ఈ దౌత్య విజయం మరిన్ని విజయాలకు స్ఫూర్తికావాలి. అగ్రరాజ్యాలకు దీటైన ప్రత్యామ్నాయంగా ఎదగాలి.
డి.వి.జి.శంకరరావు, పార్వతీపురం