ఉత్తరాయణం

మేడారం పనుల నత్తనడక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణలో జరిగే అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన మేడారం సమ్మక్క-సారలమ్మ మహాజాతరకు సమయం అసన్నమవుతోంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని తాడ్వాయి మండలంలోని మేడారం గ్రామంలో జరిగే ఈ జాతర ఈ ఏడాది జనవరి 31 నుంచి ఫిబ్రవరి 3వ తేదీవరకు నాలుగు రోజులపాటు నిర్వహిస్తారు. దాదాపు రెండున్నర కోట్ల మంది భక్తులు ఈ జాతరలో పాల్గొంటారని అంచనా. రహదార్లు, ఇతర వౌలిక వసతుల కల్పన కోసం తెలంగాణ ప్రభుత్వం 80.6 కోట్ల రూపాయలు కేటాయించింది. ప్రభుత్వం పెద్దఎత్తున నిధులు విడుదల చేస్తున్నా ఉన్నతాధికారుల పర్యవేక్షిస్తున్నా వేగంగా పనులు సాగడం లేదు. కిందిస్థాయి అధికారులు శ్రద్ధ చూపకపోవడం ప్రధాన సమస్య. స్నానఘట్టాలు, రహదార్లు, విడిది ఏర్పాట్లు, వైద్య సదుపాయం, మంచినీటి ఏర్పాట్లు వంటి పనులు నత్తనడకన సాగుతున్నాయి. ప్రభుత్వం ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుని అధికారులను హెచ్చరిస్తే తప్ప పనులు వేగం పుంజుకోవు. ఉమ్మడి రాష్ట్రంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు పెద్దగా ప్రాధాన్యం ఇచ్చేవారు కాదు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తరువాత స్వరాష్ట్రంలో ప్రత్యేక ప్రాధాన్యత కల్పిస్తున్నారు. ప్రభుత్వం నుంచి మంచి ప్రోత్సాహం లభిస్తున్నప్పుడు అధికారులు సహకరించకపోతే ఎలా? ఇరుగుపొరుగు రాష్ట్రాల నుంచికూడా పెద్దఎత్తున భక్తులు వస్తారు. అన్నింటినీ దృష్టిలో పెట్టుకుని రాష్ట్రానికి మంచిపేరు వచ్చేలా అందరూ కలసికట్టుగా పనిచేయాలి.
-కె.ఎస్.రెడ్డి, భూపాలపల్లి
సైకిల్‌షెడ్లు నిర్మించాలి
ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో చదువుకునేవారికి సైకిళ్లు పనిచేసింది. అయితే రాష్ట్రంలో చాలా పాఠశాలల్లో ఖాళీ స్థలం లేదు. ఒకటీ అరా స్కూళ్లలో స్థలం ఉన్నా సైకిళ్లు నిలుపుకునేందుకు షెడ్లు లేవు. ఆరుబయట సైకిళ్లను ఉంచడం వల్ల అవి పాడవుతున్నాయి. ప్రభుత్వం పెద్దఎత్తున నిధులు వెచ్చింతి సైకిళ్లను కొనుగోలు చేసింది. షెడ్లు నిర్మిస్తే ఎక్కువకాలం పాటు సైకిళ్లు పనిచేస్తాయి. పల్లె ప్రాంతాల నుంచి దూరంగా ఉన్న ఉన్నత పాఠశాలలకు వెళ్లేవారికి ఈ సైకిళ్లవల్ల ఎంతో ప్రయోజనం కలుగుతోంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ప్రభుత్వ విద్యాసంస్థల్లో సైకిల్‌షెడ్లు, ప్రహారీలు నిర్మించేందుకు చర్యలు తీసుకోవాలి.
-ఎర్రమోతు ధర్మరాజు, ధవళేశ్వరం
దేశాధినేతల ఫొటోలు వాడాలి
జమ్మూకశ్మీర్‌లోని రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ నాయకులు, దేశాధినేతల ఫొటోలను అధికారికంగా వాడుతున్నారో లేదో తెలియడం లేదు. ఒకవేళ వాడుతున్నట్టయితే కాస్తంత ఊరటనిచ్చినట్లే. వేర్పాటువాద సమస్యతో తల్లడిల్లుతున్న ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీలు సొంత అజెండాతో వ్యవహరించడం చూస్తూనే ఉన్నాం. ప్రత్యేక రాజ్యాంగంతో పనిచేసే కశ్మీర్‌లో మన జాతీయ నాయకులకు ఏమాత్రం ప్రాధాన్యం ఇస్తున్నారో గమనించాలి. అవసరమైతే మన దేశాధినేతలు, జాతీయ నాయకుల ఫొటోలను ప్రభుత్వ కార్యాలయాల్లో వాడేటట్లు చర్యలు తీసుకోవాలి.
-ఎన్.మధుసూదనరావు, సికింద్రాబాద్