ఉత్తరాయణం

వేధింపులు ఆపాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎన్నికల వేళ హామీల వర్షం కురిపించి అధికారంలోకి వచ్చిన రాజకీయ పక్షాలు ఆ తరువాత ప్రజల సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదు. నిధుల లేమితో బాధపడుతున్న రాష్ట్రంలో పొదుపు పాటించకుండా ఆర్భాటానికి ఎక్కువగా నిధులు వెచ్చిస్తున్నారు. జిఎస్‌టి వంటి విధానాలు సామాన్యులకు ఇబ్బందులు కలిగిస్తున్నాయి. ఇలాంటి వాటిని ప్రశ్నిస్తే అధికార పక్షానికి చెందిన నాయకులు వేధింపులు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. ఈ వైఖరి మారాలి. ప్రజాశ్రేయస్సుకోసం పనిచేసేవారిని ప్రోత్సహించాలే తప్ప వారిపై ఆగ్రహం ప్రదర్శించకూడదు.
-వై.శేషగిరిరావు, రాజమండ్రి
జగన్ వైఖరి మారాలి
ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత జగన్మోహన్‌రెడ్డిపై ఎంతో బాధ్యత ఉంది. అధికారపక్షాన్ని కట్టడి చేసి ప్రజాసమస్యల పరిష్కారానికి ఆయన కృషి చేయాల్సి ఉంది. అయితే పదేపదే ఆ బాధ్యతను మరచి పిడివాదాన్ని వినిపిస్తున్నారు. పార్టీ ఫిరాయించినవారి రాజీనామా కోసం ఎక్కువ సమయం వెచ్చిస్తున్నారు. దీనికన్నా ప్రజల్లోకి వెళ్లి వారి సమస్యల పరిష్కారంపై పోరాడుతూ వారికి దగ్గరయ్యేందుకు ప్రయత్నించడం మంచిది. రాజకీయ పరిణతితో వ్యవహరిస్తేనే ప్రజల ఆదరణ లభిస్తుంది. ఫిరాయించిన వారి వ్యవహారాన్ని ప్రజలు చూసుకుంటారు.
-టి.చక్రపాణి, ఏలేశ్వరం
లౌకికవాదులు ఏమయ్యారు?
భావప్రకటన స్వేచ్ఛ, లౌకికవాదం అంటూ బీఫ్ పెస్టివల్స్‌ను సమర్థించేవారు, ఉగ్రవాదుల మరణిస్తే సంతాపం వ్యక్తం చేసే వారు, గణేశ నిమజ్జనాన్ని విమర్శించేవారు, దేశభద్రతకు సవాలు విసిరే రోహింగ్యాలకు ఆహ్వానం పలికే వారు ఈ దేశంలో లౌకికవాదులు. ఎందుకో కొన్నిరోజులుగా వారు వౌనం పాటిస్తున్నారు. తమిళనాడులో అప్పులు తీర్చలేక ఓ కుటుంబం నిప్పంటించుకుని ఆహుతైంది. వారి బలవన్మరణం అందర్నీ విచలితుల్ని చేసింది. కానీ మన కుహనా లౌకికవాదులను కదలించలేకపోయింది. దేశానికి సమస్యలు తెచ్చిపెట్టేవారికి మద్దతుగా నోరువిప్పే ఈ కుహనా మేధావులు పేదల పక్షాన నోరువిప్పకపోవడం ఇవాళ కొత్తకాదు. ఇది అన్యాయం.
-వి.ఆర్.ఆర్.ఎ.రాజు, హైదరాబాద్
హామీలు మరచిన ప్రభుత్వం
ఇంటికో ఉద్యోగం ఇస్తామని అధికారంలోకి వచ్చిన టిఆర్‌ఎస్ ప్రభుత్వం ఇప్పుడు మాట మార్చింది. ఆ మాట తాను అనలేదని కెసిఆర్ ప్రకటించడం బాధాకరం. తెలంగాణ వస్తే దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానన్న ఆయన ఆ తరువాత భిన్నంగా ప్రవర్తించారు. ఇప్పటివరకు ప్రభుత్వం ప్రకటించిన పథకాలన్నీ ఆర్భాటాలే. కార్యరూపంలో అవి నత్తనడకే నడుస్తున్నాయి. ప్రభుత్వ వైఖరిపై కాంగ్రెస్ నేత వి.హనుమంతరావు చేస్తున్న విమర్శలకు అర్ధం ఉంది. ఎన్నికల వేళ ప్రజలకు ఇచ్చిన హామీల అమలుకు కేసీఆర్ ప్రాధాన్యం ఇవ్వాలి
-మహమ్మద్ షరీఫ్, సికింద్రాబాద్