ఉత్తరాయణం

చైనాను నమ్మవద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చైనాను నమ్మవద్దు

చైనాను గుడ్డిగా నమ్మిన మన తొలి ప్రధాని నెహ్రూ దారుణంగా మోసపోయారు. 1962 యుద్ధంలో మన భూభాగాన్ని ఆక్రమించి నమ్మకద్రోహానికి పాల్పడిన దేశం చైనా. ఆ దిగులుతోనే ఆయన చివరకు కన్నుమూశారు. పైకి స్నేహంగా ఉన్నట్లు నటిస్తూ తెరవెనుక తన వ్యూహాన్ని అమలు చేయడం చైనా అలనాటు. అప్పటితో పోలిస్తే మన సైన్యం బలపడినా ఆ దేశాన్ని గుడ్డిగా నమ్మి ఏమరుపాటుగా ఉండటం శ్రేయస్కరం కాదు.
-కె.హెచ్.శివాజీరావు, హైదరాబాద్

కపాలీశ్వరాలయాన్ని పట్టించుకోండి

గుంటూరు జిల్లాలోని కపాలీశ్వరాలయంపై దేవాదాయ శాఖ శీతకన్ను వేసింది. క్రీ.శ. 3వ శతాబ్దానికి చెందిన ఈ కట్టడాలు, ఆలయంలోని శిల్పసంపద, అపురూపమైన సౌందర్యంతో ఆకట్టుకునే విగ్రహాలను తనివితీరా చూసేందుకు పెద్దఎత్తున భక్తులు వస్తుంటారు. ఆలయం శిథిలావస్థకు చేరుకోవడం బాధ కలిగిస్తోంది. అయితే ఈ క్షేత్రానికి చేరుకునేందుకు సరైన రవాణా సౌకర్యం లేదు. వందల ఎకరాల ఆస్తులు, లక్షల్లో ఆదాయం వస్తున్నప్పటికీ రోజువారీ ధూపదీప నైవేద్యాలకు నోచుకోకపోవడం దురదృష్టకరం. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరచి చర్యలు తీసుకోవాలి.

-ఎం.కనకదుర్గ, తెనాలి

దొంగబాబాలను నమ్మవద్దు

బాబాలను నమ్మితే సమాజానికి చేటు తప్పదని ఇటీవల డేరాబాబా సంఘటన రుజువు చేంది. మతగ్రంధాలను అంతంతమాత్రంగా చదివి, మాటచాతుర్యంతో అమాయకులైన భక్తులను బాబాలు ఏమారుస్తున్నారు. రాజకీయ పలుకుబడితో ప్రభుత్వ భూములను కబ్జా చేసే దొంగబాబాలు చాలామంది ఈ సమాజంలో ఉన్నారు. సోమరులను, సంఘవిద్రోహశక్తులను శిష్యుల పేరిట చేరదీసి ప్రచారానికి వాడుకుంటున్నారు. ప్రజల అమాయకత్వాన్ని, విశ్వాసాలను ఆసరా చేసుకుని మోసం చేసే దొంగ స్వాములకు డేరాబాబాకు పట్టిన గతే పడుతుంది.

-వులాపు బాలకేశవులు, గిద్దలూరు