ఉత్తరాయణం

ఐలయ్యవాదం అభ్యంతరకరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సామాజిక స్మగ్లర్లు కోమట్లు అన్న పుస్తకం రాసిన ఐలయ్య వాదం ఎంత అసమంజసమో సోదాహరణంగా వివరిస్తూ అక్కిరాజు రమాపతి రావు గారు రాసిన వ్యాసాలు రచయితకు కనువిప్పు కలిగించేవిగా ఉన్నాయి. సాముదాయికంగా ఒక వర్గాన్ని నిందించడంలో అర్థం లేదు. మంచివారు, చెడ్డవారు అన్ని కులాలు, మతాలు, వర్గాల్లో ఉన్నారు. అందర్నీ ఒకేగాటన కట్టి విమర్శించడం సరికాదు. రమాపతి రావుగారి వ్యాసాలు చదివిన తరువాతనైనా ఐలయ్యగారికి విశాలభావాలు కలుగుతాయని ఆశ.
-గంగిశెట్టి శివకుమార్, నెల్లూరు
ఔషధ ప్రయోగాలను అడ్డుకోండి
తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలో యువకులపై వివిధ ఫార్మా కంపెనీలు గుట్టుచప్పుడు కాకుండా ఔషధ ప్రయోగాలు నిర్వహిస్తున్నాయి. జమ్మికుంట, హుజూరాబాద్ మండలాల్లో ఈ ప్రయోగాలు ఎక్కువగా జరుగుతున్నాయి. లక్షల రూపాయల ఆశచూపి కొందరిని, మాయమాటలతో మరికొందరిని ఆ పరీక్షలకు అంగీకరించేలా చేస్తున్నారు. హైదరాబాద్ పరిసరాలలోని ఫార్మా కంపెనీలు ఈ దురాగతాలకు పాల్పడుతున్నాయి. పరీక్షలు వికటించి ఎవరైనా అనారోగ్యానికి గురైతే వారు నోరువిప్పకుండా ఆయా సంస్థలు జాగ్రత్తపడుతున్నాయి. జమ్మికుంట పోలీసులను కొందరు బాధితులు ఆశ్రయించారు కూడా. ఈ వ్యవహారాన్ని ప్రభుత్వ సీరియస్‌గా తీసుకోవాలి. ఫార్మా కంపెనీల దురాగతాలను అడ్డుకోవాలి.
-కామిడి సతీష్‌రెడ్డి, జడలపేట
రిజర్వేషన్లపై రాజకీయాలు
న్యాయస్థానాలు అంగీకరించవని, రాజ్యాంగం అనుమతించదని తెలిసినా రాజకీయ లబ్దికోసం ప్రభుత్వాలు రిజర్వేషన్లను ఇష్టం వచ్చిన రీతిలో పెంచుతున్నాయి. 50 శాతానికి మించి రిజర్వేషన్లు ఉండరాదని సుప్రీంకోర్టు చెప్పినా వివిధ రాష్ట్రాలు ఆ విషయాన్ని పట్టించుకోవడం లేదు. ఎన్నికల్లో ఇష్టం వచ్చినట్లు వాగ్దానాలు ఇవ్వడం, వాటిని అమలు చేసేయడం అంతా రాజకీయ డ్రామానే. కోర్టులు కొట్టేస్తాయని తెలిసినా రిజర్వేషన్లను పెంచడంలో అర్ధం అదే. రాజస్థాన్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో ఇటీవల వివిధ వర్గాలకు 5 శాతం రిజర్వేషన్లు పెంచడం ఒక రాజకీయ ప్రహసనం. రిజర్వేషన్లపై తమకు చిత్తశుద్ధి ఉన్నా కోర్టులు అడ్డుపడుతున్నాయంటూ నిందమోపి పబ్బం గడుపుకోవడం ఆయా ప్రభుత్వాల రాజకీయం.
-బి.ప్రభాస్, గాంధీనగర్
కమల్ వెనుకడుగు?
రాజకీయాల్లోకి వస్తానంటూ తెగ హడావుడి చేసిన కమల్‌హాసన్ ఇప్పుడు వెనుకడుగు వేసినట్లుంది. పార్టీకి అభిమానులు పంపిన విరాళాలు వెనక్కి పంపడం అందులో భాగమే. రాజకీయంగా, పన్నుల విభాగం నుంచి చిక్కులు తప్పించుకునేందుకు కమల్ ముందు జాగ్రత్తపడ్డాడని అంతా భావిస్తున్నారు. పార్టీ పేరుతో విరాళాలు వస్తే ఇబ్బందులు ఉండవు. ఇప్పుడు వ్యక్తిగతంగా ఆయన పేరుతో విరాళాలు రావడం సమస్య. అందుకే కమల్ అలా చేశాడని అంటున్నారు. రజనీకాంత్‌లో కమల్ కూడా ఇప్పుడు రాజకీయ హడావుడికి దూరంగా ఉండటంలో మర్మం ఏమిటో?
-పి.చంపక్, మాధవనగర్