ఉత్తరాయణం

నగదు కష్టాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జంట నగరాలలో మళ్లీ నగదు కష్టాలు మొదలయ్యాయి. చాలా ఏటీఎం కేంద్రాలలో నగదు రావ డం లేదు. ఆధార్ అనుసంధానం చేయకపోవడం వంటి కారణాలతో కొన్ని కేంద్రాలు పనిచేయడం లేదు. మరికొన్ని ఏటీఎంలలో నగదు లేకపోవడం మరో సమస్య. మొత్తంమీద మెజారిటీ ఏటీఎంలలో నాలుగైదు రోజులుగా నగదు లభ్యం కావడం లేదు. ఎందువల్ల అలా జరుగుతున్నదో ఎవరూ చెప్పడం లేదు. వినియోగదారులు పదేపదే ప్రయత్నించడం, ఒకదగ్గర కాకపోతే మరో ఏటీఎంలో ప్రయత్నించడం ప్రహసనంగా మారిపోయింది. నగదు కొరత ఉంటే ఆ విషయాన్ని బ్యాంకింగ్ అధికారులు ప్రకటిస్తే బాగుండేది.
-ఎస్.శ్రీనివాస రాజు,
వనస్థలిపురం
తెలుగులోనే
మాట్లాడాలి
దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, కర్నాటక, మహారాష్టల్రలో మాతృభాషాభిమానం ఎక్కువ. అక్కడివారికి ఆంగ్లం, హిందీ వంటి భాషలలో ప్రావీణ్యం ఉన్నా స్థానికంగా మాతృభాషనే వినియోగిస్తారు. మాట్లాడటమూ సొంత భాషలోనే సాగుతుంది. మరీ అత్యవసరమైతే తప్ప ఆంగ్లం లేదా ఇంగ్లీషు జోలికి వెళ్లరు. అయితే తెలుగువారికి అంతటి మమకారం సొంత భాష పై లేదనిపిస్తోంది. భాగ్యనగరంలో తెలుగు వచ్చినా మాట్లాడేది తక్కువమందే. ఎందుకు అలా వ్యవహరిస్తారో అర్థం కాదు. వివిధ సంస్థల్లో పనిచేసేవారిలో మెజారిటీ సిబ్బందికి తెలుగు వచ్చు. కానీ మాతృభాషలో మాట్లాడానికి ఇష్టపడరు. ఇది మన దౌర్భాగ్యం.
-కాయల నాగేంద్ర, హైదరాబాద్