ఉత్తరాయణం

ఆంగ్లంపై మోజు ఎందుకు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు భాషాభివృద్ధి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న రీతిలో ఉంది. ఇప్పటికీ మన పరిపాలనా వ్యవస్థలో తెలుగుకు ప్రాధాన్యం లేదు. నిజానికి బ్రిటిష్ వారి హయాంలోనే తెలుగు వెలుగులీనిందంటే అతిశయోక్తికాదు. ఇప్పుడు అటు ప్రజల్లో, ఇటు ప్రభుత్వం కూడా ఇంగ్లీషుపై మోజు పెరిగింది. ఇప్పటికే మినుకుమినుకుముంటున్న తెలుగు వెలుగు మరింత మసకబారడం ఖాయం.
-వులాపు బాలకేశవులు, గిద్దలూరు.
ఉత్తర కొరియా కొరివి
యుగయుగాలుగా ‘శాంతి’ సవాళ్లను ఎదుర్కొంటూనే ఉంది. పురాతన కాలంలో రాక్షసులు శాంతికి విఘాతం కలిగిస్తే వారిని సంహరించాల్సి వచ్చింది. శాంతికి, ధర్మానికి విఘాతం కలిగించే ప్రతి మనిషి రాక్షసుడే. ఉత్తర కొరియా నియంత యుద్ధబీరాలు, ఆయుధ పరీక్షలు ప్రమాద ఘంటికలు. అతడిని నియంత్రించాల్సిన ఐక్యరాజ్య సమితి చేవలేకుండాపోయింది. విజ్ఞులు, ప్రపంచాధినేతలు కలసికట్టుగా ఉత్తరకొరియాను దారికి తేవాల్సిన సమయం ఇది. నిర్లక్ష్యం చేస్తే మానవాళి మనుగడే ప్రశ్నార్ధకమవుతుంది.
ఎన్.ఆర్.లక్ష్మి, బొల్లారం
సెలవుల్లోనూ చదువులేనా?
సెలవులంటే పిల్లలకు ఆటవిడుపు. రోజూ స్కూలు, హోమ్‌వర్క్‌లతో బిజీగా గడిపేసిన చిన్నారులకు పండుగ సెలవులన్నా, టర్మ్ హాలీడేస్ అన్నా ఎక్కడ లేని ఆనందం కలుగుతుంది. తమకు నచ్చిన రీతిలో సెలవులు గడిపితే ఆ తరువాత స్కూళ్లకు ఎంతో ఉత్సాహంతో వారు వెళతారు. సెలవుల్లో బంధుమిత్రులు, కొత్త ప్రాంతాలకు వెళితే అక్కడి విషయాలు వారికి విజ్ఞానాన్ని అందిస్తాయి. అయితే చాలా విద్యాసంస్థలు ఈ సెలవుల్లో విద్యార్థులకు చేతినిండా పనిచెబుతున్నాయి. సెలవులున్న పది రోజులకు సరిపడా హోమ్‌వర్క్ ఇవ్వడంతో వారు నిరాశానిస్పృహలకు లోనవుతున్నారు. తలకుమించిన హోమ్‌వర్క్ ఇచ్చినపుడు సెలవులకు అర్థం ఏముంటుంది?
-సరికొండ శ్రీనివాసరాజు, హైదరాబాద్