ఉత్తరాయణం

సైన్స్ కాంగ్రెస్ వేదిక మార్చొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జనవరి 3 నుండి 7 వరకు ప్రతిష్ఠాత్మకంగా జరిగే ‘ఆలిండియా సైన్స్ కాంగ్రెస్’ ఈసారి చారిత్రాత్మక ‘ఉస్మానియా యూనివర్సిటీ’ వేదిక కాబోతున్న తరుణంలో అధికారులు యూనివర్సిటీలో తాజా పరిస్థితుల వల్ల వేదిక హెచ్‌ఐసిసి కి మార్చాలనుకోవటం సరికాదు. దేశంలో ఒక్కో ఏడాది ఒక్కో యూనివర్సిటీలో భారత సైన్స్ కాంగ్రెస్ నిర్వహిస్తారు. దేశంలో వివిధ యూనివర్సిటీల నుండి అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్థులు హాజరవుతారు. వివిధ ప్లీనరీ సెషన్స్ ద్వారా, ప్రజెంటేషన్‌ల ద్వారా వివిధ సైన్సు మరియు దాని అనుబంధ అంశాలపై చర్చలు నిర్వహిస్తారు. గత ఏడాది శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం విజయవంతంగా నిర్వహించింది. ఈ ఏడాది వందేళ్ల చారిత్రాత్మక ఉస్మానియా విశ్వవిద్యాలయానికి ఈ అవకాశం లభించింది. ఇందుకోసం విద్యార్థులకు సెలవులు కూడా ప్రకటించారు. ఉస్మానియా యూనివర్సిటీ మొట్టమొదటగా 1937లో 24వ సైన్స్ కాంగ్రెస్, 1954లో 41వ, 1967లో 54వ, 60వ సైన్స్ కాంగ్రెస్ 1979లో మరియు 85వ సైన్స్ కాంగ్రెస్ 1998వ సంవత్సరంలో విజయవంతంగా నిర్వహించి దేశంలో అనేక పరిశోధకులకు, శాస్తవ్రేత్తలకు వేదికగా నిలచింది. అలాగే ఆరవసారి 105వ సైన్స్ కాంగ్రెస్ ఉస్మానియా యూనివర్సిటీ కాదని వేరే వేదికలో నిర్వహించాలనుకోవటం సరికాదు. ఎందుకంటే సైన్స్ కాంగ్రెస్ అనేది ఒక విద్య, పరిశోధనల గల విశ్వవిద్యాలయాలలో మాత్రమే జరిపే ఒక భారత శాస్త్ర సాంకేతిక విభాగంలో జరిగే దేశ అత్యున్నత సదస్సు. ఇలాంటి సదస్సులు కేవలం యూనివర్సిటీలో మాత్రమే జరిపే ఆనవాయితీ ఉంది. ఇప్పుడు యూనివర్సిటీలో పరిస్థితులు బాగాలేవని వేదికలను అధికారులు మారిస్తే వందేళ్ల చరిత్ర, గత ఐదు సైన్స్ కాంగ్రెస్‌లు విజయవంతం చేసిన ఉస్మానియా యూనివర్సిటీని అవమానించినట్లే. శతాబ్ది వేడుకలకి గౌరవ రాష్టప్రతి ఉస్మానియా యూనివర్సిటీకి రావటం ఒక గొప్ప విషయం. అలాగే ఈసారి సైన్స్ కాంగ్రెస్ వేడుకలకు గౌరవ ప్రధానమంత్రి మొదటి రోజు ముఖ్య సందేశం ఇస్తారు. కాబట్టి అధికారులు, మరియు ప్రభుత్వం 105వ సైన్స్ కాంగ్రెస్ మహా సదస్సుని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో మాత్రమే నిర్వహించి వందేళ్ల ఉస్మానియా ఖ్యాతిని దేశ నలుమూలల విస్తరించేలా కృషి చేయాలి. దీనికి ఆచార్యులు, పరిశోధకులు, విద్యార్థులు సహకరించాలి.
-కందగట్ల శ్రవణ్‌కుమార్,
కాకతీయ యూనివర్సిటీ, వరంగల్
సీరియల్స్‌తో దుష్ప్రభావం
కుళ్లు కుతంత్రాలతో నిండిపోయిన టీవీ సీరియల్స్‌లో మహిళా విలన్లు రాజ్యమేలుతున్నారు. అందుకు భిన్నంగా చిన్నపిల్లల పాత్రలలో సైతం కుళ్లు కుతంత్రాలు కుట్రలనూ నింపుతూ చిత్రీకరణ జరుగుతోంది. ముఖ్యంగా పాఠశాలల్లో జరిగే సన్నివేశాల్లో ఇటువంటివి చోటు చేసుకోవడం విచారకరం. ఇటీవల ఒక సీరియల్‌ను చూసి అదే విధంగా ఫాలో కావాలని నిప్పు అంటించుకుని బాలుడు మరణించిన సందర్భం ఉంది. సీరియల్స్ పేరుతో పిల్లల్లో విష బీజాలు నాటకండి.
-అయినం రఘురామారావు, ఖమ్మం