రంగారెడ్డి

ఉరకలేసిన ఉత్సాహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేడ్చల్, జనవరి 1: పాత సంవత్సరానికి గుడ్‌బై చెబుతూ నూతన సంవత్సరానికి గ్రాండ్‌గా వెలకమ్ పలుకుతూ మేడ్చల్‌లో నిర్వహించిన వేడుకలు మిన్నంటాయి. పట్టణంలోని కంట్రీక్లబ్‌లో ఎసియాస్ బిగ్గెస్ట్ బాష్ 2016 పేరిట నిర్వాహకులు నిర్వహించిన నూతన సంవత్సర వేడుకలు అత్యంత అట్టహాసంగా జరిగాయి. నగరంలోని వివిధ ప్రాంతాల నుండే కాకుండా మేడ్చల్‌తో పాటు పరిసర ప్రాంతాల నుండి వేలాదిగా జనం పాల్గొని వేడుకలను తనివితీరా ఆస్వాదించారు. వేడుకల్లో కుర్రకారును ఉర్రూలుతలూగించడానికి ప్రత్యేకంగా కనువిందు చేయడానికి ప్రముఖ టాలీఉడ్ నటి పూనమ్‌కౌర్ విచ్చేసి తన డ్యాన్స్‌తో అలరించింది. బాలీవుడ్, టాలీఉడ్ పాటలపై అదిరే స్టెప్పులు వేస్తూ యువతలో కేక పుట్టించింది. ప్రముఖ యాంకర్ మృదుల తన యాంకరింగ్‌తో ఆహూతులను విశేషంగా అకుట్టుకున్నారు. నేపథ్య గాయకులు అభినవ్, సురభీ, భార్గవి తమ గాన మాధుర్యంతో ఆహూతులను కట్టిపడేశారు. పెద్ద సంఖ్యలో విచ్చేసిన జనవాహినికి ఎలాంటి అసౌర్యం కలుగకుండా నిర్వాహకులు సమగ్ర ఏర్పాట్లను చేశారు. ప్రయివేటు సెక్యూరిటీతో పాటు స్థానిక పోలీసులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. రాత్రి 12 గంటలకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బాణసంచాను కాల్చి నిర్వాహకులు నూతన సంవత్సరానికి స్వాగతం పలికారు. కార్యక్రమంలో ఈవెంట్ మేనేజర్ అలీఖాన్, కంట్రీక్లబ్ మేనేజర్ విశ్వనాథ్, అసిస్టెంట్ మేనేజర్ నిరంజన్‌రెడ్డి దగ్గరుండి వేడుకలను పర్యవేక్షించారు. నటి పూనమ్‌కౌర్‌ను మేనేజర్ విశ్వనాథ్ పుష్పగుచ్ఛాన్ని అందజేసి మేడ్చల్ క్లబ్‌లో నిర్వహించిన వేడుకలకు సాదరంగా ఆహ్వనం పలికారు.
భక్త జనసంద్రమైన చిలుకూరు
మొయినాబాద్: కొత్త సంవత్సరం సందర్భంగా కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారుగా వెలుగొందుతున్న చిలుకూరు బాలాజీ ఆలయం శుక్రవారం భక్త జనసంద్రమైంది. తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి సాయంత్ర వరకు సుమారు లక్షకు పైగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని అంచనా. ఆలయ పరిసరాలు భక్తుల గోవింద నామస్మరణతో మారుమోగింది. ఉదయం నుంచే స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తుల రద్దీతో ఆలయంలో 108, 11 ప్రదక్షిణలను పూర్తిగా నిలిపివేసి మహాద్వార దర్శనానికే అనుమతించారు. తిరుమల సంప్రదాయ సంగీత ట్రస్ట్ ఆధ్వర్యంలో రవిరాజా బృందం ఆలపించిన అన్నమయ్య కీర్తనలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా శంషాబాద్ జోన్ డిసిపి శ్రీనివాస్ పర్యవేక్షణలో ఏసిపి రంగారెడ్డి, సైబర్‌క్రైమ్ ఏసిపి జయరామ్, సిఐ శ్రీనివాస్, ఎస్‌ఐలు, పోలీసులు, వాలంటీర్లు భక్తులకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకున్నారు.