నల్గొండ

బ్యాంకులు అన్ని వర్గాల ప్రజలకు సేవలు అందించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

*టిపిసిసి చీప్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
హుజూర్‌నగర్, నవంబర్ 27 : ప్రభుత్వ రంగ, ప్రైవేటు బ్యాంకులు కూడా అన్ని వర్గాల ప్రజలకు, రైతులకు, నిరుద్యోగులకు త్వరిత గతిన సేవలు అందించాలని స్థానిక ఎంయల్‌ఏ, టిపిసిసి చీప్ కెప్టెన్ యన్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. శుక్రవారం హుజూర్‌నగర్ పట్టణంలో సుధాబ్యాంకు 5వ శాఖను ప్రారంభించిన అనంతరం మాట్లాడుతూ బ్యాంకులు నూతన సాంకేతిక పరిజాఞనాన్ని వినియోగిస్తున్నప్పటికి రైతులు, పేదలకు సేవలు అందించటంలో తాత్సార్యం చేస్తున్నాయని సుధాబ్యాంకు హుజూర్‌నగర్ ప్రజలకు మేలైన సేవలు అందించాలని ఆయన కోరారు. సుధాబ్యాంకు చైర్మన్ మీలా సత్యనారాయణ మాట్లాడుతూ 100 కోట్ల టర్నోవర్‌తో తమ బ్యాంకు సేవలు అందిస్తున్నదని రాజకీయ ప్రమేయాలకు తావు లేకుండా రుణాలు ఇస్తున్నామని అన్నారు. నెలకు 2 సార్లు బ్యాంకు డైరెక్టర్లు సమావేశమై కార్యకలాపాలు సమీక్షించి ఎలాంటి అవకతవకలు జరుగకుండా పర్యవేక్షణ చేస్తున్నామని అన్నారు. బంగారంపై 10 శాతం, సీనియర్ సిటిజన్స్‌కు 11.5 శాతం, వడ్డీ ఇస్తున్నామని అన్నారు. రైస్ మిల్లర్లకు రుణాలు ఇవ్వలేమని చిన్న వ్యాపారులకు, రైతులకు, గృహాలకు రుణాలు ఇస్తారని అంతర్జాతీయంగా ఎక్కడికి వెళ్లినా సుధా బ్యాంకు నుండి విత్‌డ్రా చేసుకోవచ్చని చెప్పారు. బ్యాంకు మేనేజింగ్ డైరెక్టర్ పి గణేష్ మాట్లాడుతూ జిల్లాలో గత 16 సంవత్సరాలలో 100 కోట్ల టర్నోవర్ చేశామని హుజూర్‌నగర్‌లో 5వ శాఖను ప్రారంభించి సేవలు అందించటానికి ముందుకు వచ్చామని అన్నారు. బ్యాంకులో ఏ పని అయినా 5 నిమిషాలలో పూర్తి చేసే సాంకేతిక పరిజాఞనం సమకూర్చుకున్నామని, ఆర్‌బిఐ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భీమా ఉందని 4 కోట్ల డిఫాజిట్‌లు ఉన్నాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో నగర పంచాయితీ చైర్మన్ జక్కుల వెంకయ్య, టిడిపి రాష్ట్ర కార్యదర్శి చావా కిరణ్మయి, రైస్ మిల్లర్స్ అధ్యక్షుడు గజ్జి ప్రభాకర్, మాజీ సర్పంచ్ గొట్టె రామయ్య తదితరులు మాట్లాడారు.