ఉత్తరాయణం

డెబిట్ కార్డులతో కష్టాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెద్దనోట్ల రద్దు తరువాత డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా చెల్లింపులు చేయాలన్న ప్రచారం విస్తృతమైంది. కానీ మన వ్యవస్థలో అది అంత సులువుకాదు. బ్యాంకు అకౌంట్లు లేని ప్రజల సంఖ్య తక్కువేమీ కాదు. డెబిట్, క్రెడిట్ కార్డులతో చిల్లర మార్కెట్లు, కూరగాయల మార్కెట్లలో చెల్లింపులకు తగిన ఏర్పాట్లు కూడా సరిగా లేవు. అది ఆచరణలో కష్టమే. చిన్నచిన్న లావాదేవీలకు సంబంధించి బ్యాంకు అకౌంట్లను అప్‌డేట్ చేయించడం తలనొప్పి వ్యవహారమే. ఎటిఎంలు, బ్యాంకుల చుట్టూ తిరగడం చిర్రెత్తిస్తుంది. ప్రజలకు చక్కటి అవగాహన కల్పించడం, విద్యావంతులను చేయడం ఇప్పుడు ముఖ్యం. ఆ తరువాతే కాష్‌లెస్ విధానాల అమలు సాధ్యం.
-ఎన్.రామలక్ష్మి, సికిందరాబాద్

బీచ్ ఫెస్టివల్ వద్దు

పర్యాటక రంగం అభివృద్ధి పేరిట విశాఖలో ఈనెల 12 నుంచి 14వ తేదీ వరకు తలపెట్టిన బీచ్ ఫెస్టివల్ సమర్థనీయం కాదు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు ఇది విరుద్ధం. ప్రచారం, పేరు కోసం ఈ కార్యక్రమం చేపడుతున్నారన్నది జనాభిప్రాయం. పర్యాటక రంగం అభివృద్ధికి ఇతరత్రా కార్యక్రమాలు చేపట్టే ఆలోచనలు చేయాలి. విదేశీ సంస్కృతిని అనుసరించడం సరికాదు. బీచ్ ఫెస్టివల్ వంటి కార్యక్రమాల నిరోధానికి చట్టం తీసుకురావాలి. హిందూ మతాన్ని రక్షించాలి.
-కర్నెపూడి వెంకట రత్నాకర్ రావు, హనుమకొండ

అవినీతి రూపుమాపాలి
అవినీతి లేని సమాజం తయారవ్వాలంటే రేపటి పౌరులైన విద్యార్థినీ విద్యార్థుల వల్లే సాధ్యమవుతుంది. ఆర్థిక వ్యవహారాలు, అవినీతిని అడ్డుకునే మార్గాలు, నీతి నిజాయితీలకు సంబంధించిన విషయాలను పాఠ్యాంశాలుగా తీసుకురావాలి. ఆయా అంశాలపై వారికి అవగాహన, చైతన్యస్ఫూర్తి రగల్చాలి. నల్లధనం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థకు జరుగుతున్న నష్టం, అవినీతి నిర్మూలకు చేపడుతున్న కార్యక్రమాలు, డిజిటల్ మనీ విధానాల వల్ల కలిగే ప్రయోజనాల వంటి అంశాలపై విద్యార్థి దశ నుంచే పిల్లలకు అవగాహన కల్పించాలి. అప్పుడే సత్ఫలితాలు సాధ్యమవుతాయి.
-సి.ప్రతాప్, శ్రీకాకుళం

మోదీని సమర్ధించాలి

నల్లధనం, నకిలీ నోట్ల నిరోధమే లక్ష్యంగా కేంద్రంలోని మోదీ ప్రభుత్వం చేపట్టిన పెద్దనోట్ల రద్దు వ్యవహారం దీర్ఘకాలంలో చక్కటి ఫలితాలను ఇస్తుంది. ఇప్పటి వరకు ఇబ్బందులు ఎదుర్కొంటున్న సాధారణ పౌరులు మరికొంత కాలం కేంద్రప్రభుత్వానికి మద్దతుగా నిలవాల్సిన అవసరం ఉంది. నోట్ల రద్దు వ్యవహారంలో ప్రభుత్వంపై వస్తున్న విమర్శలు రాజకీయ దురుద్దేశంతో చేసినవే.
-బి.వి.సుబ్రహ్మణ్యశాస్ర్తీ, సికిందరాబాద్