ఉత్తరాయణం

ప్రజాధనం వృధా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెద్దనోట్ల రద్దు తర్వాతి పరిణామాలు గమనిస్తే దేశంలోని కొన్ని రాజకీయ పార్టీలు ఉద్దేశ పూర్వకంగా రాజకీయం చేస్తున్నాయన్న విషయం ప్రజలకు అర్థమవుతోంది. దొంగనోట్లు, నల్లధనాన్ని అరికట్టేందుకు ప్రధాని మోదీ తీసుకున్న కఠిన నిర్ణయాన్ని సామాన్య జనం అర్థం చేసుకొని ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని పార్టీల నేతలు అనవసర రాద్ధాంతం చేసి ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్నారు. శీతాకాల పార్లమెంట్ సమావేశాలు అరుపులు, కేకలతో ముందుకు సాగలేదు. పెద్దనోట్ల రద్దు సాహసోపేతమైన చర్యగా అధికశాతం ప్రజలు స్వాగతిస్తున్నారు. పన్ను ఎగవేతదారులు, దొంగనోట్లు కలిగి వున్నవారు భయపడాలి గాని ఇతరులకు ఇది మంచి చర్యే. పార్లమెంటు సమావేశాలను అడ్డుకుంటూ కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని వృధా చేయడం దారుణం.
- గర్నెపూడి వెంకట రత్నాకరరావు, హన్మకొండ

ఇది తొలి అడుగు
నల్లధనం నిర్మూలనలో ‘పెద్దనోట్లు రద్దు’ ఓ తొలి అడుగు. ఒక వ్యక్తి వద్ద ఎంత బంగారం నిల్వ ఉండాలన్న విషయమై కూడా కేంద్ర ప్రభుత్వం స్పష్టతకు రావటం శుభ పరిణామం. దేశంలో అవినీతికి తల్లివేరు లాంటిది రాజకీయ వ్యవస్థ. రాజకీయ పార్టీలను ముందుగా సంస్కరించాలి. అసెంబ్లీ, రాజ్యసభలకు పరోక్ష ఎన్నికలను రద్దుచేయాలి. లేకుంటే కొందరు భారీగా డబ్బును ఎరగా వేసి గద్దెనెక్కి నాయకులుగా చెలామణి అవుతారు. ప్రత్యక్ష ఎన్నికల పద్ధతిలోనే అన్ని పదవులను భర్తీ చేయాలి. నోటుకు ఓటును నిరోధించాలి. రాజకీయాలలో కొందరు వ్యక్తులు లక్షలు పెట్టుబడి పెట్టి కోట్లను కొల్లగొడుతూ నల్లధనాన్ని సృష్టిస్తున్నారు. అలాగే ఉద్యోగ నియామకాల్లోనూ పారదర్శకత పాటించాలి. పౌర సేవాపత్రము (సిటిజన్ చార్టు)లను ప్రభుత్వ కార్యాలయాల నుండి కచ్చితంగా అందించాలి. పౌరుడు కేంద్రంగా పరిపాలన జరగాలి. నాయకుల, ఉన్నతాధికారుల, బడాబాబుల చుట్టూ పరిపాలన తిరగరాదు. దేశ సంపద అంతా ప్రజల ఉమ్మడి ఆస్తి కావాలి.
-వోడపెల్లి చంద్రశేఖర్, వరంగల్

సుప్రీం ఆదేశం భేష్
జాతీయ, రాష్ట్ర రహదారులపై మద్యం దుకాణాలు ఉండరాదని, ఇప్పటికే ఉన్నవాటి లైసెన్సుల్ని రద్దుచేయాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించడం ముదావహం. న్యాయస్థానం చెప్పేవరకూ తమ బాధ్యత గుర్తుకురాకపోవడం ప్రభుత్వాలకు పరిపాటైంది. ప్రపంచంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో అత్యధికం మన దేశంలోనే. ఏటా దాదాపు లక్షన్నర మంది విలువైన ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. ఫలితంగా వారి కుటుంబాలు ఛిద్రవౌతున్నాయి. రోడ్డు ప్రమాదాల్లో ఎంతోమంది కాళ్లు, చేతులు,ఇతర అవయవాలు కోల్పోవడం ద్వారా ఉపాధికి దూరవౌతున్నారు. డెబ్భైశాతం రోడ్డు ప్రమాదాలకు మద్యపానం కారణం అవుతోంది. ఈ గణాంకాలు తెలిసినా, ప్రభుత్వాలు రహదారుల వెంబడి మద్యం అమ్మకాలను ప్రోత్సహించడం అంటే ప్రజల పట్ల ఏమాత్రం బాధ్యత లేకపోవడమే. ఆదాయం పట్ల ఆసక్తి తప్ప, సమాజానికి జరుగుతున్న కీడుని లక్ష్యపెట్టకపోవడమే. సుప్రీం ఆదేశాన్ని నిక్కచ్చిగా పాటించడంతోపాటు దాని వెనుకనున్న స్ఫూర్తిని ప్రభుత్వాలు అర్థం చేసుకోవాలి. రహదారి ప్రయాణాల్లో ప్రమాదాలను తగ్గించే దిశగా సమగ్ర ప్రణాళికలుండాలి. ట్రామా కేంద్రాలు, వేగంగా స్పందించే వైద్య బృందాలు, ఇతర సౌకర్యాలపై దృష్టిపెట్టాలి.
- డా.డి.వి.జి.శంకరరావు, పార్వతీపురం

విపక్షాల విపరీత ధోరణి
‘మొగుడ్ని కొట్టి మొగసాల ఎక్కి ఏడ్చిన ఇల్లాలి’ చందంగా ఉంది మన విపక్షాల తంతు. ఈమధ్య 12 మంది విపక్ష నేతలు రాష్టప్రతిని కలిసి పార్లమెంటులో పాలకపక్షం తమ గొంతు నొక్కుతున్నదని ఫలితంగా ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని వాపోయారు. కానీ, వాస్తవానికి జరుగుతున్నదేమిటి? పార్లమెంటులో ఏ విధమైన చర్చ జరగకుండా విపక్షాలే రభస చేస్తున్నాయి. ప్రధాని పార్లమెంటుకి వచ్చి తీరాలని పట్టుపట్టిన విపక్షాలు ఆయన వచ్చాక కూడా సభ జరగకుండా అడ్డుకున్నాయి. ప్రజాస్వామ్యానికి ప్రమాదం ఎవరి వల్లనో విపక్ష పార్టీల నాయకులు గ్రహించాలి.
- కృష్ణ, కొండయ్యపాలెం