ఉత్తరాయణం

డిజిటల్ వ్యవస్థతో నష్టాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెద్దనోట్లను రద్దు చేశాక డిజిటల్ లావాదేవీలపై ప్రభుత్వాలు శ్రద్ధ చూపుతున్నాయి. డిజిటల్ లావాదేవీలు చాలా ప్రమాదకరం అన్న అనుమానాలు లేకపోలేదు. బ్యాంకు ఎకౌంట్ ‘హ్యాక్’ అయితే గనుక మొత్తం డబ్బు పోతుంది. ఎటిఎం కార్డుల పిన్ నెంబర్లు ఇతరులకు తెలిసిపోతే సులువుగా మోసాలు చెయ్యడం జరుగుతుంది. నూరు శాతం అక్షరాస్యత ఉండే అమెరికాలోనే నగదు వాడుతున్నారు. భారతదేశంలో చదువుకున్నవారే మోసపోతున్నారు. గ్రామీణ ప్రాంతాల వారు, నిరక్షరాస్యులు డిజిటల్ లావాదేవీలు చెయ్యగలరా? క్యాష్‌లెస్ ఎకానమీ కన్నా ‘ఎకానమీ విత్ క్యాష్’ మన దేశానికి ఎంతో సురక్షితమైంది.
- వి.వివేక్, విశాఖపట్నం

ఘరానా మోసగాళ్లు
నిత్యం అసత్య ప్రచారాలతో ప్రజలను నిలువుదోపిడీ చేయడం కొంతమంది మోసగాళ్లకు, వ్యాపారులకు పరిపాటిగా మారింది. ఇటీవల ఉప్పు్ధర విపరీతంగా పెరగబోతోందని వదంతులు వ్యాపించినపుడు ప్రజలు దుకాణాల వద్ద క్యూకట్టి మరీ పదుల సంఖ్యలో ఉప్పు ప్యాకెట్లు కొనుగోలు చేశారు. ఇది కొంతమంది మోసగాళ్ల వ్యూహమే. ప్రజలను సెంటిమెంట్‌తో దెబ్బకొట్టి గతంలో కొబ్బరికాయల, గాజుల వ్యాపారస్థులు విపరీతంగా లాభపడ్డారు. ఇలా ముందుముందు ఎన్ని మోసాలు జరుగుతాయో? ప్రజల నమ్మకాలను, బలహీనతలను ఆసరాగా చేసుకుని వదంతులు పుట్టిస్తూ కొందరు లాభాలను ఆర్జిస్తున్నారు. ఇలాంటి వదంతులను సృష్టించేవారిని, ఇష్టానుసారం రేట్లుపెంచి వస్తువులను అమ్మే వ్యాపారస్థులను కఠినంగా శిక్షించాలి.
- సరికొండ శ్రీనివాసరాజు, వనస్థలిపురం

వారసత్వ ఉపాధి ఎందుకు?
సింగరేణి కంపెనీలో వారసత్వ ఉద్యోగాలకు రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ తెర లేపింది. దీంతో మిగతా వారికి ఉద్యోగావకాశాలు లభ్యం కావు. ఇది నిరుద్యోగులకు తీరని అశనిపాతం. వారసత్వ ఉద్యోగాల వల్ల కొత్త పోస్టులకు అవకాశం ఉండదు. గతంలో కొన్ని ప్రభుత్వ శాఖలలో ఐదు సంవత్సరాలకు ముందే ఉద్యోగి స్వచ్ఛంద పదవీ విరమణ చేసి, తమ వారసులకు ఉద్యోగం ఇచ్చే సంస్కృతి ఉండేది. ప్రతివారు ఐదు సంవత్సరాలకు ముందే తప్పుకోవటం, తమ వారసులకు ఉద్యోగాలు ఇప్పించటం వల్ల ఇతరులకు అన్యాయం జరుగుతోందని ఆ విధానాన్ని తొలగించారు. మెడికల్ గ్రౌండ్స్ మీద ఇప్పుడు అన్నీ సక్రమంగా ఉంటేనే వారసుడికి ఉద్యోగం ఇస్తున్నారు. ఇది కొంతవరకు సబబే. సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలకు అవకాశం ఇవ్వటం విచారకరం. దీన్ని తొలగించాల్సిన ఆవశ్యకత ఉందని నిరుద్యోగుల విన్నపం.
- అయినం రఘురామారావు, ఖమ్మం

తెలుగు విద్యార్థి స్వగతం
మాదో మామూలు ప్రభుత్వ స్కూలు
ఉండడమే గొప్ప మాకో పెన్సిలు, స్కేలు
క్లాసు గోడలకు పగుళ్లు
బెంచీలకు ఊడి ఉంటాయి స్క్రూలు
ల్యాబ్ లేక మాకు ప్రాక్టికల్స్ నిల్లు
మైదానం లేక నో డ్రిల్లు

అంతెందుకు?
కిటికీలకు నో గ్రిల్
గంట వాయించడానికి నో బెల్
కానీ- సాధించాలట మేం నోబెల్
ఇదీ- చంద్రబాబు వంద కోట్ల డీల్
అరకొర సాయంతో అసాధ్యం కాదా..? ఈ గోల్..
ముందు చదువుకి బడ్జెట్ పెంచితే మేలు.
అందరికీ విద్యనందించండి చాలు,
స్వీకరిస్తాం మీ సవాలు.
- డా. డి.వి.జి.శంకరరావు, పార్వతీపురం