ఉత్తరాయణం

ఒకేసారి ఎన్నికలు అసాధ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లోక్‌సభకు, అన్ని అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలన్న ప్రధాని మోదీ ఆలోచన ఆచరణలో అసాధ్యం అనిపిస్తోంది. ఈ విధానం గతంలోనే విఫలమైంది. అప్పట్లో దేశ జనాభా తక్కువగా ఉండేది. రాజకీయ పార్టీలు కొంతవరకైనా విలువలను పాటించేవి. ఓటర్లపై ధన ప్రభావం, ఇతర ప్రలోభాలు అంతగా ఉండేవి కావు. స్వేచ్ఛగా ఓటర్లు తమకు నచ్చిన పార్టీని గెలిపించేవారు. నేడు దేశ జనాభా విపరీతంగా పెరగడంతో శాంతిభద్రతల సమస్య పెను సవాలుగా మారింది. ఇంత పెద్ద దేశంలో ఒకేసారి ఎన్నికలు జరపాలంటే తగినంత భద్రతా సిబ్బంది, స్థానిక పోలీసులు లేరు. భారీ సంఖ్యలో ఎన్నికల అధికారులు ఒకేసారి అందుబాటులో ఉండడం కష్టం. అన్ని ప్రాంతాల్లో ఒకేసారి పోలింగ్ జరిగితే రిగ్గింగ్‌లు వంటివి జరిగినా నియంత్రించడం వీలుకాదు. తగినంత భద్రతా సిబ్బంది లేకుంటే శాంతిభద్రతలు విషమించే ప్రమాదం ఉంది. దశలవారీగా ఎన్నికలు జరుగుతున్నపుడే చాలాచోట్ల హింస, అక్రమాలు అదుపులోకి రావడం లేదు. ఇక ఒకేసారి ఎన్నికలంటే పోలీసుల, పోలింగ్ అధికారుల పర్యవేక్షణ పూర్తిస్థాయిలో ఉండదు. అన్ని రాజకీయ పార్టీల, ప్రజాసంఘాల అభిప్రాయాలను తెలుసుకొని ఈ విషయమై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోవడం మంచిది.
- అయినం రఘురామారావు, ఖమ్మం

నగదు రహితానికి రాయతీలివ్వండి
నగదు రహిత లావాదేవీలు సమర్ధవంతంగా అమలు కావాలంటే హార్డ్‌వేర్, సాఫ్ట్ రంగాలకు పన్ను రాయితీలు ఇవ్వాలి. ఆధార్ ఆధారిత చెల్లింపులు, వెయ్యి రూపాయలకు మించిన లావాదేవీలు స్మార్ట్‌కార్డ్ ఆధారంగా జరిగే విధానం, స్మార్ట్ ఫోన్‌ల ధరలు తగ్గింపు, సైబర్ సెక్యూరిటీని పటిష్టం చేయడం, స్వైపింగ్ యంత్రాల కొనుగోలుపై రాయితీ, ఇంటర్నెట్ సేవల విస్తరింపు, బ్యాంకింగ్, కమ్యూనికేషన్ చార్జీలను తగ్గించడం వంటివి అమలు జరగాలి. నగదు రహిత లావాదేవీలపై ప్రజలకు అవగాహన, వాటిపై నమ్మకం పెంపొందించేలా చర్యలు తీసుకోవాలి.
- సి.ప్రతాప్, శ్రీకాకుళం

పెన్షనర్ల ఆవేదన
కొందరు బడాబాబులకు సంబంధించి వేల కోట్ల రూపాయల బ్యాంకు రుణాలను మాఫీ చేసిన కేంద్ర ప్రభుత్వం పెన్షనర్లపై కాస్తయినా జాలి చూపకపోవడం విడ్డూరంగా ఉంది. ఇపిఎఫ్-95 పెన్షనర్లను చిన్నచూపు చూడడం దారుణం. వెయ్యి రూపాయలు కూడా పెన్షన్ రాని రిటైర్డు ఉద్యోగులు ఏళ్ల తరబడి చేస్తున్న విజ్ఞప్తులు ఇంకా ఫలించడం లేదు. కొన్ని ప్రభుత్వరంగ సంస్థల్లో పదవీ విరమణ చేసిన వారికి వైద్య సదుపాయాలు కల్పించలేదు. 1992, 1997లో జరగాల్సిన వేతన సవరణను నిలిపివేసి, 2002లో వేతనాలకు కొంత కలిపి ఉద్యోగులను తొలగించారు. ఫెర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో మూడు దశాబ్దాలకు పైగా చాకిరీ చేసిన ఉద్యోగులు రిటైరయ్యాక నానా పాట్లు పడుతున్నారు. సుప్రీం కోర్టులో వేసిన కేసులు దశాబ్దాలు గడిచినా కొలిక్కిరావడం లేదు. వీరిలో కొందరు మరణించినా సంబంధిత కుటుంబాలకు న్యాయం జరగలేదు.
- ఎన్.రామలక్ష్మి, సికిందరాబాద్

కల్తీమాంసంతో రోగాలు
లాభార్జనే ధ్యేయంగా ఇపుడు ఎక్కడపడితే అక్కడ కల్తీమాంసాన్ని విక్రయిస్తున్నారు. మాంసాహారానికి ఉన్న డిమాండ్‌ను ఆసరాగా చేసుకుని కొందరు వ్యాపారులు కల్తీకి పాల్పడుతున్నారు. మేకలు, గొర్రెల మాంసం అంటూ ఇతర జంతు మాంసాలను విచ్చలవిడిగా విక్రయిస్తున్నారు. కోళ్లు బరువుగా ఉండేందుకు కొన్నిరకాల యాంటీ బయోటిక్స్‌ను వాటిచేత తినిపిస్తున్నారు. దీంతో కోళ్లలోకి రసాయనాలు చేరిపోతున్నాయి. చాలా హోటళ్లలో కల్తీ మాంసాన్ని యథేచ్ఛగా వండుతున్నారు. ఇంతజరుగుతున్నా సంబంధిత అధికారులు ఎలాంటి దాడులు చేయడం లేదు. కల్తీమాంసం కారణంగా ఎంతోమంది రోగాల పాలవుతున్నారు.
- ఎస్.ఎస్. రాజు, వనస్థలిపురం

తెలుగు భాషాభివృద్ధి కేంద్రం ఎక్కడ?
దక్షిణాది భాషలకు సంబంధించి పురాతన భాషల కేంద్రం బెంగళూరులో వుంది. దానిలో ఆంధ్రులు కూడా సభ్యులే. తెలుగుకి సంబంధించిన కేంద్రం మన రాష్ట్రంలోనే వుండాలని రాష్ట్రం విడిపోకముందే కొందరు భాషాభిమానులు ప్రతిపాదించినా ఈలోగా తెలుగుకి ప్రాచీన హోదా ఇవ్వరాదని ఒక తమిళుడు కోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేయడంతో ఆ ప్రయత్నాలు ఆగిపోయాయి. కోర్టు ఆ వ్యాజ్యం కొట్టివేసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆ కేంద్రం ఎక్కడ వుండాలి? బెంగళూరులోనే వుంటే మంచిదా? నిధుల పంపకం ఎలా? ఈ ప్రశ్నలకు ఎలాంటి సమాధానం లేదు.
-చంద్ర, కాకినాడ