ఉత్తరాయణం

ఇంత గగ్గోలు దేనికి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ప్రజల సొమ్ముతో డిజిటల్ సోకులు, వంటగ్యాస్ బుకింగ్ సమయంలో వినియోగదారుల జేబులకు చిల్లులు’- అంటూ ఓ వర్గం మీడియాతో పాటు కొందరు విపక్ష నేతలు మోదీ విధానాలను ఏకపక్షంగా విమర్శించడం సరికాదు. ప్రతి చిన్న విషయానికి అతిగా స్పందించడం కొందరికి అలవాటుగా మారింది. కేంద్రం విధానాలపై వ్యతిరేకత ఉంటే నేరుగా ప్రధాని మోదీకి ఫిర్యాదు చేయవచ్చు. ‘మన్‌కీ బాత్’ ద్వారా ప్రధాని తన విధానాలను నేరుగా ప్రజలకు వివరించడం మంచి పరిణామం. సమస్యలు ఉంటే స్థానిక అధికారుల్ని నిలదీయవచ్చు. ‘మన్‌కీ బాత్’ ప్రసంగాన్ని ఫోన్‌లో వినే వారికి పన్ను వేయడం తగదంటూ విపక్షాలు విమర్శిస్తున్నాయి. ఈ ప్రసంగం వల్ల వినియోగదారులకు అదనంగా అయే ఖర్చు ఏభై పైసలు కూడా వుండదు. దీనికే ఇంత గగ్గోలా? ఇది కూడా శాశ్వతం కాదు. కొంత కాలమే. గ్యాస్ బండ ఇంటికి తెస్తున్న డెలివరీ బాయ్ 20 నుంచి 50 రూపాయల వరకూ వసూలు చేస్తే లేని బాధ యాభై పైసలకేనా..?
-కృష్ణ, కొండయ్యపాలెం

తల్లిదండ్రులూ ఆలోచించండి
మైనారిటీ తీరకుండానే కొంతమంది పిల్లలు వాహనాలను నడపడం వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. తెలిసీ తెలియని దుందుడుకు వయసులోనే పిల్లలకు బైక్ డ్రైవింగ్, కారు డ్రైవింగ్ నేర్పి తప్పు చేస్తన్నారు తల్లిదండ్రులు. ఆ వయసులో వారు దూకుడు స్వభావంతో మితిమీరిన వేగంతో వాహనాలను నడిపి ప్రమాదాలు చేస్తూ అమాయకులను బలిగొంటున్నారు. పిల్లలను వాహనాలు ఇచ్చి తప్పు చేస్తున్నామని తల్లిదండ్రులు ఎందుకు గ్రహించడం లేదు. తమ పిల్లలు ఏమైపోతారో అన్న భయం వారికి ఎందుకు కలగడం లేదు. హెల్మెట్లు లేని, లైసెన్సులు లేని యువకులను పోలీసులు ఎందుకు పట్టుకోవడం లేదు. 18 ఏళ్ల లోపు పిల్లలకు డ్రైవింగ్ ఇవ్వడం నేరంగా పరిగణించాలి. వారు వాహనాలు నడిపితే భారీగా జరిమానా విధించాలి. ప్రమాదాలు జరిగితే కఠినంగా శిక్షించాలి.
-ఎస్.ఎస్.రాజు, హైదరాబాద్

పాడుబడ్డ బావులతో అవస్థలు
జాతీయ రహదారుల పక్కన, గ్రామాలకు వెళ్లే రోడ్ల పక్కన పాడుబడిన బావులను, పెద్ద పెద్ద గోతులను పూడ్చివేసే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టాలి. వీటి కారణంగా తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. రోడ్ల పక్కన వుండే ముళ్లపొదలను, శిథిలావస్థకు చేరుకున్న వృక్షాలను కూడా తొలగించాలి. చెట్లకొమ్మల కారణంగా బస్సులు, లారీలను నడిపే వారికి ఇవి ఇబ్బంది కలిగిస్తున్నాయి. చెట్ల కొమ్మలు ఒక్కోసారి బస్సు కిటికీల గుండా లోపలకు చొచ్చుకొని వస్తున్నందున ప్రయాణీకులు సైతం ఇబ్బంది పడుతున్నారు. ఆర్ అండ్ బి, జాతీయ రహదారుల శాఖ అధికారులు ఈ విషయాన్ని గమనించాలి.
-కూర్మాచలం వెంకటేశ్వర్లు, కరీంనగర్

జానపద కళల్ని బతికించాలి
ఒకప్పుడు పల్లెల్లో ఎక్కడ చూసినా జానపద కళలకు ఆదరణ ఉండేది. నేటితరం వారు ఆ కళలను మరచిపోతున్నారు. తోలుబొమ్మలాటలు, హరికథలు, బుర్రకథలు, జానపద నాట్యాలు, తప్పిటగుళ్లు, గరగల నృత్యాలు, భజనలు, పగటి వేషాలు, వీధి నాటికాలు తెలుగు కళావైభవానికి ప్రతీకలుగా ఉండేవి. నేడు పల్లెల్లో సైతం విదేశీ సంస్కృతి వెర్రితలలు వేస్తున్నందున ప్రాచీన జానపద కళారూపాలు కనుమరుగు అవుతు వున్నాయి. పండుగలు, పర్వదినాల్లో కొన్ని దేవస్థానాలు వారి ప్రోత్సాహంతో మొక్కుబడిగా జానపద కళారూపాలు ప్రదర్శిస్తున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఇకనైనా మన సంస్కృతిని, జానపద కళారూపాలను కాపాడాలి. కళాకారులకు అండగా నిలిచి వారిని అన్నివిధాలా ప్రోత్సహించాలి.
-జె.సుధాకరరావు, కాకినాడ

పొంచి ఉన్న ప్రమాదం
పెద్దనోట్ల రద్దుతో నల్లకుబేరులను పట్టుకోవడం మాట దేవుడెరుగు. సామాన్యుల జనజీవనం మాత్రం అస్తవ్యస్తం అయిన మాట నిజం. క్యాష్‌లెస్ స్వైపింగ్ మిషన్లు అంటూ మరో కొత్తరకం సమస్యలకు తెర తీస్తున్నారు. అద్దె ఇళ్ళల్లోవున్న వాళ్ళు క్యాష్‌లెస్ స్వైపింగ్ మిషన్లంటే యజమానులు వింటారా? ఒక పద్ధతి ప్రకారం పొదుపు చేసుకుంటూ బతుకుతున్న వారి జీవితాలలో ఇపుడు ఆర్థికపరమైన గండిపడింది. ఇక పొదుపు చెయ్యాలంటేనే ఏదో అభద్రతాభావం ఏర్పడుతుంది. అంతేకాదు ఎక్కడ చూసినా అసహనం ప్రబలుతోంది. బ్యాంక్‌ల దగ్గర ముష్టియుద్ధాలు, ఇళ్ళల్లో ఆర్థికపరమైన కలహాలు జరుగుతున్నాయి. జనంలో అసహనం ప్రబలి భయంకరమైన పరిస్థితులు రాకమునుపే పాలకులు మేల్కొని పరిష్కారం చూడాలి. లేకుంటే ఎన్నో దుష్ప్రరిణామాలు దాపురించే ప్రమాదం లేకపోలేదు.
- షహనాజ్, అనంతపురం