ఉత్తరాయణం

పురాతన ఆలయాలను మరిచారా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం జిల్లా రెండుగా విడిపోయిన తరుణంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భద్రాద్రి ఆలయంతో పాటు పర్ణశాల, పెద్దమ్మగుడితోపాటు పర్యాటక కేంద్రాలైన కినె్నరసాని, మణుగూరు చేరిపోయాయి. ఖమ్మంలో స్తంభాద్రి నరసింహస్వామి, జమలాపురంలో వెంకటేశ్వరస్వామి దేవాలయం, వైరాలోని స్వామి అయ్యప్ప దేవాలయం, కుసుమంచిలో శివాలయం, రఘునాథపాలెంలో షిర్డిసాయి దేవాలయం, పాలేరు జలాశయం, వైరా రిజర్వాయర్, నేలకొండపల్లిలోని బౌద్ధ ఆలయాలను సందర్శకులు దర్శించే విధంగా దేవాదాయశాఖవారు శ్రద్ధ వహిచాల్సిన అవసరం వుంది. ఖమ్మం జిల్లాలోని అత్యంత ప్రాచుర్యం పొందిన అనేక దేవాలయాలు అభివృద్ధికి దూరంగా ఉ న్నాయి. పర్వదినాల్లో భక్తుల రద్దీ ఉన్నా సౌకర్యాలు లేకపోవడంతో ఇబ్బందుల పాలవుతున్నారు. సౌకర్యాలు మెరుగుపరిస్తే ఆదాయం పెరిగే అవకాశం గణనీయంగా ఉంటుంది. కేవలం కొన్ని జిల్లాల పైనే రాష్ట్ర ప్రభుత్వం దృష్టిసారిస్తోంది. ఖమ్మం జిల్లాను పర్యాటకపరంగా అభివృద్ధిచేస్తే సందర్శకులకు ఆహ్లాదకరంగా ఉంటుంది. స్థానిక నాయకులు సైతం దీనిపై దృష్టిసారించి అభివృద్ధికి తోడ్పడాల్సిన అవసరం ఉంది.
- అయినం రఘురామారావు, ఖమ్మం

భాషను బతికించుకుందాం
ఎన్నికల్లో గెలిచే పార్టీలకు ఈ రోజుల్లో సిద్ధాంతాల కన్నా రాజకీయ లబ్ధి ముఖ్యం. ఈ కారణంగానే తెలుగు భాష దశాబ్దం కాలం నుంచి చావుబతుకుల మధ్య చిక్కుకుంది. ఒక్కోసారి రాజకీయ వైద్యుల తియ్యటి మాటల వలన తెలుగు భాష కోలుకుంటున్నట్లు కనిపించినా మళ్ళీ కుప్పకూలి కుక్కిలో చచ్చుబడి ఉంటుంది. తెలుగు భాషను బతికించుకోవాలనే మమకారం ఏ ప్రభుత్వాలకూ లేదు. మున్సిపల్ పాఠశాలల్లో తెలుగు మీడియం రద్దుచేసి ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాలని భావించిన ఎపి ప్రభుత్వానికి ఇపుడు ప్రజావ్యతిరేకత ఎదురైంది. ఫలితంగా ఇంగ్లీష్ మీడియం నిబంధనను తాత్కాలికంగా పక్టన పెట్టారు. తీవ్రస్థాయిలో ప్రతిఘటనలు చేస్తే తప్ప భాషను బతికించుకోవడం సాధ్యం కాదు.
- పొట్టి వెంకట శివప్రసాదరావు, అద్దంకి

డబ్బు మూలుగుతోందా?
పేద, మధ్యతరగతి ప్రజలు అనునిత్యం నానాపాట్లు పడుతుండగా, రాష్ట్రానికి పేరుతెచ్చే వారికి భారీగా నగదు నజరానాలు ఇస్తామని ఎపి సిఎం చంద్రబాబు ప్రకటించడం విడ్డూరం. జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పతకాలు సాధించే క్రీడాకారులకు ఇప్పటికే భారీగా నగదు పురస్కారాలు, ఇళ్లస్థలాలు ఇస్తున్నారు. రాష్ట్రం నుంచి ఎవరైనా నోబెల్ బహుమతి సాధిస్తే వందకోట్ల రూపాయలు అందజేస్తామని చంద్రబాబు తాజాగా భారీ ఆఫర్ ప్రకటించారు. ఒక్కరినో, ఇద్దరినో సంతృప్తపరచేందుకు ఇలా ప్రభుత్వ నిధులను నజరానాలుగా ఇవ్వడం భావ్యమా? ఉపాధి కోసం ఎదురుచూస్తున్న లక్షలాది మంది యువతీ యువకులకు నిరుద్యోగ భృతి ఇచ్చేందుకు మాత్రం ప్రభుత్వానికి మనసొప్పదు. ప్రభుత్వోద్యోగులకు, పెన్షనర్లకు డిఎ బకాయిలు చెల్లించవచ్చు. ఇలాంటి సంక్షేమ చర్యలు చేపట్టడానికి బదులు, ప్రభుత్వ ఖజానాలో డబ్బు మూలుగుతున్నట్లు ముఖ్యమంత్రి నగదు నజరానాలను ఉదారంగా ప్రకటించడం సరికాదు. పదిమందికీ మేలు జరిగేలా ప్రభుత్వ నిధులను ఖర్చు చేయడం ఉత్తమం. - బిఆర్‌సి మూర్తి, విజయవాడ

క్రమశిక్షణ లేని భక్తులు
శబరిమల సన్నిధానంలో ఈమధ్య తొక్కిసలాట జరిగి ఎంతోమంది భక్తులు గాయపడి ఆస్పత్రిపాలయ్యారు. మన దేశంలో కుంభమేలాలు, జాతరలు వంటి సందర్భాల్లో తరచూ తొక్కిసలాటలు జరుగుతూ ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. శబరిమలలో ఇలాంటి సంఘటనలు జరగడం కొత్తేమీ కాదు. నలభైరోజుల పాటు ఎన్నో నియమాలు పాటించి నిష్ఠగా ఉండే అయ్యప్ప స్వాములు కొండపైకి చేరగానే ఎందుకు తొందరపడాలి? దీక్షలో ఉన్నట్లే స్వామి దర్శనం ముగిసేవరకూ క్రమశిక్షణ పాటించాలి. తిరుమలలోనూ బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి వంటి సందర్భాల్లో తోపులాటలు జరుగుతున్నాయి. క్రమశిక్షణ, సంయమనం కూడా భక్తిలో అంతర్భాగాలని భావించినపుడు ఇలాంటి సంఘటనలకు చోటుండదు.
- ఎన్.రామలక్ష్మి, సికిందరాబాద్

సంక్షేమ పథకాలకు నల్లధనం
మన దేశంలో లక్షలాది నిరుపేదలకు ఇంకా కనీస సౌకర్యాలు అందడం లేదు. గృహవసతి, మంచినీరు, విద్య, వైద్యం వంటి వౌలిక అవసరాలు తీరక బడుగువర్గాల ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పాఠశాలలకు తగిన వసతులు లేవు. ఆరోగ్య కేంద్రాలు, రవాణా సౌకర్యాలు అంతంత మాత్రమే. ఏటా ప్రభుత్వం బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తున్నా, నిరుపేదలు అభివృద్ధికి దూరంగానే ఉంటున్నారు. ఇటీవల పెద్దనోట్ల రద్దు ఫలితంగా బ్యాంకులకు లక్షల కోట్ల రూపాయల్లో నల్లధనం చేరింది. ఈ డబ్బును పేదవర్గాల సంక్షేమం కోసం ఖర్చు చేయాలి.
- మందపల్లి సత్యం, రామచంద్రపురం