ఉత్తరాయణం

యువతను తీర్చిదిద్దాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశ్వంలోనే అత్యుత్తమ జీవన విధానంగా భారతీయత వినుతి కె క్కింది. ‘అహింసా పరమో ధర్మః’ అన్న వేదోక్తి మానవులందరూ అహింసా ప్రవృత్తిని అలవరచుకొని, వైషమ్యాలు పక్కనపెట్టి సమైక్యంగా కలిసిమెలిసి జీవించాలని బోధిస్తోంది. ప్రార్ధించే పెదవుల కంటే సహాయం చేసే చేతులు మిన్న అంటూ భారతీయత సమాజసేవ వైశిష్ట్యాన్ని చాటి చెప్పింది. భారతీయత యువతను అద్భుతమైన శక్తిగా తీర్చిదిద్దేందుకు బాల్యం నుండే నీతికథలను బోధించడం, మహనీయుల జీవిత చరిత్రలను చదివించడం, భగవద్గీత, రామాయణ, భారత, భాగవతాలను పాఠ్యాంశాలుగా చేర్చడంతోపాటు వారిలో వసుధైక కుటుంబ సిద్ధాంతాన్ని జీర్ణింపచెయ్యాలి. సమాజసేవ వారి నిత్యజీవితంలో భాగం చెయ్యాలి. నేడు సమాజంలో అంతరిస్తున్న మానవతా విలువలను పరిమళింపచేయడానికి భారతీయ యువతను తీర్చిదిద్దడంలో తల్లిదండ్రులు, గురువులు, మేధావులు, ఆధ్యాత్మికవేత్తలు తమవంతు కృషి నిర్విరామంగా చెయ్యాలి.
- సి.ప్రతాప్, శ్రీకాకుళం

ఆలయాల్లో పాతపద్ధతే మేలు
తెలంగాణలో ప్రధాన దేవాలయాలకు ఆదాయం బాగానే వుంది. దేవాలయ రాబడిలో ముప్పైశాతం అనువంశీకులైన అర్చకులకు అందిస్తే పలు కుటుంబాలకు మేలు జరుగుతుంది. ప్రస్తుతం వున్న ప్రభుత్వ పోస్టులు రద్దుచేసి పూర్వపు స్థితిని కొనసాగించడం ఉత్తమం. అధిక రాబడి ఉన్న కొండగట్టు ఆంజనేయస్వామి దేవస్థానం ద్వారా ఒకప్పుడు దాదాపు ముప్ఫై కుటుంబాల వరకు జీవనోపాధి సాగేది. ఈ విషయాన్ని లోతుగా పరిశీలించి పూర్వ మిరాశీ, ఇనాం భూములు, దేవాలయ రాబడిలో ముప్ఫైశాతం వరకు ప్రతి ఏటా అనువంశీకులకు చెల్లించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.
- అంజన్న, అనిల్, కొండగట్టు (జగిత్యాల)

మహిళల కోసం లైబ్రరీలు
మహిళల కోసం ప్రత్యేకంగా గ్రంథాలయాలను ఏర్పాటు చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చూరవ చూపాలి. ఇపుడువున్న గ్రంథాలయాలకు ఎక్కువగా పురుషులే వస్తుంటారు. నేడు విద్య, ఉపాధి రంగాల్లో పోటీ పడుతున్న మహిళల సంఖ్య బాగా పెరిగింది. ప్రభుత్వం జిల్లా కేంద్రాలు, ముఖ్య పట్టణాల్లోనైనా మహిళల కోసం గ్రంథాలయాలు ఏర్పాటు చేయాలి.
- ఎం.బి.నిర్మల, తాడిపత్రి

వృద్ధులకు రాయితీలు
కేంద్ర ప్రభుత్వం సీనియర్ సిటిజన్ల బ్యాంకు డిపాజిట్లపై కొంత వెసులుబాటు కల్పించింది. పదేళ్ళ కాలానికి ఏడున్నర లక్షలకు ఎనిమిది శాతం వడ్డీని ప్రకటించింది. దీనిని కొంత మార్చమని మనవి. పదేళ్ళ కాలాన్ని ఆరు సంవత్సరాలకు, ఎనిమిది శాతాన్ని తొమ్మిదికి, డిపాజిట్ పరిమితిని పది లక్షలకు పెంచాలి. అత్యవసర పరిస్థితులలో కొంత దనం వెనక్కి తీసుకున్నా డిపాజిట్‌దారుడు నష్టపోకుండా చూడాలి. నెలకు కనీసం పది వేల రూపాయలు లేకుంటే నిత్యజీవనం కష్టం. వైద్యానికే చాలా ఖర్చవుతుంది. ప్రభుత్వం తగిన ఆలోచన చేసి మార్పులు చేయాలి.
- ఎన్.రామలక్ష్మి, సికిందరాబాద్