ఉత్తరాయణం

మన జాతీయ పతాకం ఏది?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారతజాతి అనేక వేల సంవత్సరాల నాటిది. ప్రపంచంలో ప్రప్రథమంగా భారతదేశం, భారత జాతి పుట్టింది. భారత జాతి నుండి అలనాటి సంస్కృతిని విడదీయలేము. సంస్కృతి, ఆచారాలు, సాహిత్యం, సమాజం, భౌగోళిక సరిహద్దులతో కూడిన భూ భాగం, పతాకం.. ఇవన్నీ ఉంటేనే ‘జాతి’ అని పిలువబడుతుంది. ఈ విధంగా ఆలోచిస్తే మనకు స్వరాజ్యం రాకమునుపు ఒక పతాకం ఉన్నదా? లేదా? ఉంటే- ఆ పతాకం ఏది? ఇప్పటి మన జాతీయ జెండాను పింగళి వెంకయ్య రూపొందించారు. పూర్వకాలంలో అంటే- ఇతిహాస కాలం నుండి మహాభారత, రామాయణ కాలం నుండి ఉన్న పతాకం ‘కాషాయ ధ్వజం’. దీనికి భారతజాతి చరిత్రే ప్రత్యక్ష సాక్ష్యం. కనుక- మన జాతీయ పతాకం కాషాయ ధ్వజం అని భావించాలా? ఈ పతాకం భారత జాతి సంస్కృతిని ప్రతిబింబిస్తుంది. కాషాయం త్యాగానికి చిహ్నం. కాషాయ జెండా మధ్యలో ‘ఓమ్’ అనే అనే పదం ఉండాలి. స్వాతంత్య్ర సంగ్రామానికి ముందు- వేల సంవత్సరాల క్రితమే భారతజాతి, సంస్కృతికి ఈ గడ్డపై పరిఢవిల్లాయి. వాటికి ప్రతీకగానే మన జెండా ఉండాలి.
- పున్నావఝల వెంకటేశ్వరరావు, గుంటూరు

ముగింపు లేని సీరియళ్లు
కొత్త కథలు లేకో, ఉన్నా నచ్చకో ప్రస్తుతం టీవీ చానళ్లలో వస్తున్న సీరియళ్లనే ఏళ్ళ తరబడి కొనసాగిస్తున్నారు. అసంబద్ధంగా కొత్త పాత్రలను, సన్నివేశాలను సృష్టిస్తూ ప్రేక్షకులకు విసుగుపుట్టిస్తూ అయోమయంలో పడవేస్తున్నారు. ‘అభిషేకం’ అనే సీరియల్ రెండు వేల అయిదు వందల ఎపిసోడ్లు అంటే ఎనిమిదేళ్లుగా ప్రసారం అవుతోందని ప్రచారం చేస్తున్నారు. ఏదో కాలక్షేపం కోసం ఇంట్లో ఆడవాళ్లు చూడడం తప్ప, వీటిలో తెలుసుకోవలసిన విషయాలేమీ ఉండవు. ఉంటే గింటే ‘ఆడ విలనిజమ్’ ఏలా చూపాలి? సంసారాల్లో చిచ్చు ఎలా పెట్టాలి? ఎన్ని రకాలుగా హింసలు పెట్టవచ్చు? ప్రేమికులను, భార్యాభర్తలను ఎలా విడదీయవచ్చు? హత్యలు ఎన్ని రకాలుగా చేయవచ్చు?.. ఇలాంటి విషయాలు చెప్పే సీరియళ్లను ఎలా అనుమతిస్తున్నారు? వీటికి సెన్సారు నిబంధనలు, ఇంత నిడివి ఉండాలనే రూల్సు ఉండవా?
- ఎన్.రామలక్ష్మి, సికిందరాబాద్

సత్తాలేని ‘గాంధీ’లు!
ఇంటిపేరు ‘గాంధీ’గా ఉన్న కాంగ్రెస్ నేతలు ఇపుడు రాజకీయంగా ఎలాంటి ప్రభావం చూపలేకపోతున్నారు. స్వాతంత్య్ర పోరాట సమయంలో గాంధీజీ ఎంతో నిష్టగా పనిచేసి ‘జాతిపిత’గా జనం గుండెల్లో నిలిచాడు. కానీ, ఇప్పటి ‘గాంధీ’లు కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేసేందుకు కంకణం కట్టుకున్నారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ నాయకత్వంలో ‘వందేళ్ల కాంగ్రెస్’ కుదేలైపోతోంది. గత లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. రాజకీయ దిగ్గజమైన ప్రధాని మోదీపై ‘పిల్ల గాంధీ’ రాహుల్ చేస్తున్న ఆరోపణలు అపహాస్యం పాలవుతున్నాయి. యుపి ఎన్నికల్లో కొన్ని సీట్లయినా దక్కించుకోవాలన్న ఆశతో అఖిలేష్ బృందంతో కాంగ్రెస్ పొత్తు కుదుర్చుకుంది. ఎన్నికల ప్రచారంలో రాహుల్ కంటే ఆయన సోదరి ప్రియాంకకు కాంగ్రెస్ అధిక ప్రాధాన్యం ఇస్తోంది. ‘కాబోయే ప్రధాని రాహుల్ గాంధీయే’ అని చెబుతున్న కాంగ్రెస్ నేతలు యుపిలో ప్రచారానికి ప్రియాంకను నమ్ముకున్నారు. సోనియా, రాహుల్ జనాకర్షణలో విఫలం కావడంతో అనేక రాష్ట్రాల్లో అధికారం కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ ఇపుడు గత వైభవ చిహ్నంగా మిగిలింది. ఈ పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లోనూ మోదీ హవా కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయి.
- కెవి రమణమూర్తి, కాకినాడ