ఉత్తరాయణం

‘హోదా’తో లాభం ఏమిటి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేంద్ర బడ్జెట్‌కి ఆలంబనగా చేసే ఆర్థిక సర్వేలో ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలపై అధ్యయనం ఉంటుంది. ప్రత్యేక హోదా వున్న 11 రాష్ట్రాల్లో మిజోరాం పరిస్థితి కాస్త మెరుగ్గా వున్నా మిగిలిన రాష్ట్రాల పురోగతి అధ్వానంగా, కొన్ని అధమంగా వున్నాయి. వాటి తలసరి వార్షిక ఆదాయం దయనీయంగా 26 వేల రూపాయలు మాత్రమే. అంతకుముందు ఒక సంస్థ వాణిజ్య అనుకూల రాష్ట్రాలకు ర్యాంక్‌లు ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్‌కు ప్రథమ స్థానం లభించగా, ప్రత్యేక హోదా వున్న రాష్ట్రాల ర్యాంకులు 17 నుంచి 32 వరకు వున్నాయి. ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకోకుండా- ఏపికి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ కొందరు పట్టుబట్టడడం- ‘తాను పట్టిన కుందేలుకు మూడేకాళ్లు’ అని వాదించడం లాంటిదే.
-ఎన్.గిరిధర్, కాకినాడ

అగ్రిగోల్డ్ బాధితుల బాధలు
వివిధ రాష్ట్రాలలో లక్షలాది మంది మదుపరుల డబ్బును దిగమింగిన అగ్రిగోల్డ్ సంస్థ పట్ల ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి చూపడం దారుణం. అగ్రిగోల్డ్‌పై నమోదైన కేసుల్లో జాప్యానికి మదుపరులు చాలా నిరుత్సాహంతో, నిస్సహాయతతో ఉన్నారు. అనేకమంది పేద,మధ్య తరగతి ప్రజలు తమ భవిష్యత్తు అవసరాలకు దాచుకొన్న పైకాన్ని అగ్రిగోల్డ్ యాజమాన్యం ఎగనామం పెట్టుట చాలా బాధాకరం. ఇప్పటికే జప్తు చేసిన ఈ సంస్థ ఆస్తులను వెంటనే వేలం వేసి వచ్చిన సొమ్ముతో బాధితులను ఆదుకోవాలి. ఈ సమస్యను ఇంకా నాన్చక, ప్రభుత్వం స్పందించి తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి. ఇకపై ఇలాంటి బోగస్ సంస్థలపై గట్టి నిఘా వుంచి ప్రజల సొమ్ముకు భద్రత కల్పించడం ఎంతో అవసరం.
-కొలుసు విమల, గరికపర్రు, కృష్ణా జిల్లా

మాతృభాషను ఆదరిద్దాం
ఏపిలోని మున్సిపల్ స్కూల్స్, కార్పొరేషన్ స్కూల్స్‌లో ఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టాలనే ఆలోచనను ప్రస్తుతానికి వాయిదా వేసినా, ప్రమాదం మాత్రం ఇంకా పొంచే ఉంది. టీచర్ల సంఘాలు, తల్లిదండ్రుల నుంచి వ్యతిరేకత రావడంతో ప్రభుత్వ నిర్ణయం వాయిదా పడింది. అయితే, ఎప్పటికైనా తగిన ఏర్పాట్లు చేయకుండానే ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్ మీడియం ఎలా ప్రవేశ పెడతారు? తెలుగు మీడియంలో చదివిన టీచర్లు ఇంగ్లీషు మీడియంలో పాఠాలు ఎలా చెప్పగలరు? ప్రాథమిక స్థాయిలో మాతృభాష తెలుగు నేర్చుకుంటేనే విద్యార్థులు భవిష్యత్తులో ఏ రంగంలోనైనా రాణిస్తారు. కార్పొరేట్ పాఠశాలలను చూసి, ప్రభుత్వం ఇంగ్లీషు మీడియం స్కూళ్లను నడపాలనుకుంటే అది పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు అవుతుంది. తెలుగు ‘మృతభాష’ కాకముందే అందరూ మేల్కొనాలి. ఇంగ్లీష్ మోజులో తెలుగు భాషను చిన్నచూపు చూడటం తగదు.
-మార్టూరు అజయ్‌కుమార్, రామచంద్రాపురం

మహిళలకు వెలుగెన్నడు?
ఎన్ని దశాబ్దాలు గడిచిపోతున్నా, ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా మహిళల జీవితాలలో నిజమైన వెలుగు రావడం లేదు. లైంగిక వేధింపులు, కిడ్నాప్‌లు, హత్యలు, అత్యాచారాలు, గ్యాంగ్‌రేప్‌లు, గృహహింస వంటివి నానాటికీ పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు. ఇంట్లో భర్త, అత్తమామల వేధింపులు, బయటికెళ్తే దుర్మార్గుల చేతిలో అవమానాలు, ప్రేమ పేరుతో వేధింపులు, లైంగిక దాడులు ఇలా చెప్పుకుంటూ పోతే మహిళల పరిస్థితి శోచనీయం. ‘నిర్భయ’ వంటి చట్టాలు చేసినా పరిస్థితిలో మార్పు రాదా? మహిళలకు భద్రత, సాధికారత గురించి చెప్పే మాటలు నినాదాలేనా? చట్టాలను పకడ్బందీగా అమలు చేసి, కేసులను సకాలంలో విచారించి దోషులకు కఠిన శిక్షలు పడేలా పాలకులు తగు చర్యలు తీసుకోవాలి.
-సరికొండ శ్రీనివాసరాజు, వనస్థలిపురం