ఉత్తరాయణం

సుప్రీం తీర్పు నేతలకు గుణపాఠం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదాయానికి మించి ఆస్తుల కేసులో తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత, శశికళ సహా నలుగురిని దోషులుగా నిర్థారిస్తూ సుప్రీం కోర్టు ఇచ్చిన చారిత్రక తీర్పు ప్రస్తుత రాజకీయ నాయకులకు గుణపాఠం వంటిది. తీర్పు ఇవ్వడంలో ఏళ్ల తరబడి ఆలస్యం జరిగినప్పటికీ, అక్రమాలకు పాల్పడిన వారికి జైలుశిక్ష, జరిమానాలు విధించడం సబబే. సేవాభావంతో కాకుండా, స్వార్థం కోసం, అక్రమ ఆస్తులను కూడబెట్టుకునేందుకు రాజకీయ వ్యవస్థను నేడు నేతలు వాడుకుంటూ బరితెగిస్తున్నారు. ఎంతోమంది నేతలకు సంబంధించిన కేసులెన్నో ఇంకా విచారణ దశలో ఉన్నాయి. అయితే, ‘దొరికితేనే దొంగలు.. దొరకనన్నాళ్లు దొరలే’ అన్నట్లు చాలామంది రాజకీయ నేతలు పదవులను అనుభవిస్తూ అక్రమాలకు పాల్పడుతూనే ఉన్నారు. పంచాయతీ నుంచి పార్లమెంటు పదవుల వరకూ ఎన్నికైన నేతల్లో చాలామంది అక్రమాలకు పాల్పడుతున్నవారే. ప్రజలు తమను గెలిపించింది, పదవులు కట్టబెట్టింది- అడ్డగోలుగా దోచుకోవడానికేనని, రాజకీయాలు ఇందుకు సరైన మార్గమని ఎంతోమంది నేతలు భావిస్తున్నారు. అందుకే రాజకీయాలన్నా, రాజకీయ నేతలన్నా జనం చీదరించుకునే పరిస్థితి ఇప్పటికే ఏర్పడింది. రాజకీయ వ్యవస్థను ప్రక్షాళన చేస్తే తప్ప పరిపాలనా వ్యవస్థ కుదుటపడదు. ఈ తరుణంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తాజా తీర్పు ఓ ఆశాకిరణంలా మారింది. రాజకీయాలు అక్రమ సంపాదనకు కాదు, సేవ చేయడానికి అని నాయకులు తెలుసుకోవాలి. లేకుంటే వారికి ఆలస్యంగానైనా గుణపాఠం ఖాయం.
- కె.ఆదినారాయణ, విశాఖ

డిఎస్‌సి క్వాలిఫైడ్ టీచర్ల మొర
ఏళ్లు గడుస్తున్నప్పటికీ 2008- డిఎస్సీ క్వాలిఫైడ్ అభ్యర్థుల సమస్య కొలిక్కిరావడం లేదు. నోటిఫికేషన్ ఇచ్చినపుడు ఎస్‌జిటి పోస్టులను వంద శాతం బిఎడ్, డిఎడ్ అర్హత కలిగిన వారికి మెరిట్ ప్రకారం అని పేర్కొన్నారు. ఆ తర్వాత ఆ పోస్టుల్లో 30 శాతాన్ని డిఎడ్ అభ్యర్థులకు కేటాయించారు. ఉద్యోగాలు ఇచ్చే సమయంలో నోటిఫికేషన్‌లో మొదట పేర్కొన్న విధంగానే అభ్యర్థుల సర్ట్ఫికెట్ల పరిశీలన కూడా పూర్తి చేశారు. పోస్టింగ్‌ల కోసం ఎదురు చూస్తుండగా కోర్టు ‘స్టే’ రాకముందే ప్రభుత్వం కౌనె్సలింగ్‌ను వాయిదా వేసింది. ఆ తర్వాత ట్రిబ్యునల్ ఉత్తర్వులతో 30 శాతం పోస్టులను డిఎడ్ అభ్యర్థులకు ఇచ్చేశారు. సర్ట్ఫికెట్ల పరిశీలన కూడా పూర్తయిన బిఎడ్ అభ్యర్థులకు నేటికీ న్యాయం జరగలేదు. ఆందోళనలు చేసిన మీదట 2008- డిఎస్‌సి క్వాలిఫైడ్ అభ్యర్థులకు ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వం ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చినా అది నెరవేరలేదు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 1998, 2008, 2012 డిఎస్‌సి క్వాలిఫైడ్ అభ్యర్థులందరికీ ఉద్యోగాలిస్తామని తెలంగాణ సిఎం కెసిఆర్ ప్రకటించారు. ఆ హామీ ఇచ్చి ఏడాది గడిచినా కార్యరూపం దాల్చలేదు. ఇకనైనా తెలంగాణ ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీకి కట్టుబడి 2008 క్వాలిఫైడ్ అభ్యర్థులకు న్యాయం చేయాలి.
- శ్రావణి, హైదరాబాద్