ఉత్తరాయణం

కల్వకుర్తి చంద్రన్న.. కంచర్ల గోపన్న

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌ను చూస్తే ‘్భక్త రామదాసు’గా పేరుగాంచిన కంచర్ల గోపన్న గుర్తుకొస్తాడు. ఈయనలాగే ఆయన కూడా వీర భక్తుడు. గోపన్న ఎలాగైతే ప్రజల నుండి శిస్తులు వసూలు చేసి రామాలయం కట్టాడో, కెసిఆర్ కూడా అచ్చం అలాగే ప్రజల నుండి పన్నులు వసూలు చేసి మొక్కులు చెల్లించుకుంటున్నాడు. ఆయన కోదండరాముడికి గుడికట్టి జైలుకెళితే, ఈయన తన ఉద్యమ సహచరుడు కోదండరామ్‌ని అరెస్టు చేయించి గుడికెళ్లాడు. ఇంతకీ ఈ కోదండరామ్ తప్పేమిటంటే నిరుద్యోగుల విన్నపాలు కాస్త వినవలెనంటూ కోరడమే. మొక్కులు, ముడుపులు చెల్లించుకోవడంలో తప్పులేదు కానీ అదేదో సొంత డబ్బుతో అయితే సబబుగా ఉంటుంది. ప్రజల ఆస్తికి ధర్మకర్తగా వ్యవహరించే ప్రభుత్వం ఖజానాలోని ధనాన్ని పైసా పైసా వారి సంక్షేమానికే మొదట వినియోగించాలి. ప్రజాధనం వినియోగంలో సున్నితత్వం, కచ్చితత్వం పాటించడం ధర్మం. ఆపన్నుల కన్నీరు తుడవడమే దేవుడికి మనమివ్వగల అసలైన కానుక. ప్రభుత్వ సారథులకు అది మొదటి బాధ్యత కూడా.
-డా.డి.వి.జి.శంకరరావు, పార్వతీపురం

చిన్నమ్మ కోరికలకు కళ్లెం
బెంగళూరు జైలులో తనకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని అన్నాడిఎంకె నాయకురాలు శశికళ విప్పిన కోర్కెల చిట్టాను సుప్రీం కోర్టు తిరస్కరించడం హర్షణీయం. ఆమెను సాధారణ ఖైదీగా పరిగణించాలని కోర్టు పేర్కొనడం మంచి పరిణామం. భారీగా అవినీతికి పాల్పడి జైలులో ఉంటున్న దోషులకు శిక్షకాలం తగ్గించరాదు. ప్రజాపోరాటాలు చేసి శిక్ష అనుభవిస్తున్న వారికి మినహాయింపు ఇవ్వడం సమంజసం. జైలులో రాజభోగాలను అనుభవించాలనుకునే శశికళ వంటివారికి అడ్డుకట్ట వేయాలి. ఆమెను సామాన్య ఖైదీగా పరిగణించి జైలులో పని అప్పగించడం మంచిదే. జైలు సిబ్బంది కూడా ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా చిత్తశుద్ధితో విధులను నిర్వహించాలి.
- అయినం రఘురామారావు, ఖమ్మం

మొక్కల సంరక్షణ ఇంతేనా?
నల్గొండ జిల్లాలో హరిత విప్లవం పేరిట గత ఏడాది తెలంగాణ ప్రభుత్వం స్వచ్ఛంద సంస్థల సహకారంతో లక్షలాది మొక్కలను నాటించింది. రోడ్డుకు ఇరువైపులా ఖాళీ ప్రదేశాల్లో, ఆటస్థలాలు, విద్యా సంస్థలు, పార్కులలో మొక్కలు నాటడమే కాకుండా లక్షలాది రూపాయలు వెచ్చించి ‘ట్రీ గార్డులు’ ఏర్పాటు చేశారు. కింది స్థాయి సిబ్బందిలో చిత్తశుద్ధి లేకపోవడంతో అనేక చోట్ల ట్రీ గార్డులు అదృశ్యమైపోయాయి. దీంతో మొక్కలకు సంరక్షణ లేకుండా పోయింది. చాలా వరకూ మొక్కలు ఎండిపోతున్నాయి. మొక్కల పరిస్థితి ఇలా మారినా అధికారులు పట్టించుకోవడం లేదు. వేసవిని దృష్టిలో వుంచుకుని మొక్కలకు పటిష్ట రక్షణ చర్యలు చేపట్టాలి.
-సిహెచ్ సాయి రుత్విక్, నల్గొండ

కరెంటు కష్టాలు మొదలు
తాము అధికారంలోకి వస్తే కనురెప్పపాటు సమయం కూడా కరెంటు పోకుండా చూడగలనని ముఖ్యమంత్రి కెసిఆర్ వాగ్దానం చేశారు. ‘ఒకప్పుడు తెలంగాణలో కరెంటు ఉంటే వార్త.. ఇప్పుడు కరెంటు పోతే వార్త..’ అని కూడా ఆయన గొప్పగా చెప్పారు. అయినా గ్రామీణ ప్రాంతాల్లో తరచూ కరెంటు పోతూనే వుంది. వేసవిలో విద్యుత్ వినియోగం పెరుగుతుంది. మరోవైపు ప్రభుత్వం విద్యుత్ చార్జీలు పెంచుతుందనే సంకేతాలు వచ్చేశాయి. రాబడి తక్కువ, ఖర్చులు ఎక్కువ కలిగిన సామాన్య ప్రజలకు విద్యుత్ చార్జీల పెంపు పెనుభారం కాబోతున్నది. పేద, మధ్యతరగతి ప్రజలకు ఇబ్బంది లేకుండా విద్యుత్ చార్జీలు ఉండాలి. పరీక్షల సీజన్‌లో విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా చూడాలి.
-ఎన్.రామలక్ష్మి, సికింద్రాబాద్