ఉత్తరాయణం

శశికళకు వత్తాసు దేనికి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సుబ్రహ్మణ్య స్వామి అనగానే అవినీతి కార్యక్రమాలపై కోర్టుల ద్వారా పోరాడిన యోధుడు జ్ఞాపకం వస్తాడు. కొన్ని కేసుల్లో అతనికి చుక్కెదురైనా 2-జి స్కాంని వెలుగులోకి తేవడమే కాదు, జయలలిత, ఆమె నెచ్చెలి శశికళలపై అక్రమాస్తుల కేసు ప్రయోగించిన ఘనుడు. కానీ, హఠాత్తుగా ఈ పోరాట యోధుడు శశికళ పక్షం వహించి, సిఎం పదవిని చేపట్టేందుకు గవర్నర్ ఆమెను ఆహ్వానించకపోతే కోర్టుకి వెళతాననడం ప్రజాస్వామ్యవాదులకు తీవ్ర దిగ్భ్రాంతి కలిగించింది. ఆయన దృష్టిలో అవినీతి ఆరోపణలున్న శశికళ పవిత్రురాలైపోయిందా? లేక ఇదొక ‘శకుని పన్నాగం’ లాంటిదా?
- ప్రవీణ్, కాకినాడ

ఓటుబ్యాంకు రాజకీయాలు
ఎన్నికల్లో ప్రయోజనం పొందేందుకు ముస్లింలకు మత ప్రాతిపదికన 12 శాతం రిజర్వేషన్లను ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించడం రాజ్యాంగ విరుద్ధం. ఈ నిర్ణయం అమలులోకి వస్తే మత మార్పిడులు భారీగా జరగడమేగాక భవిష్యత్తులో మరిన్ని విపరిణామాలకు దారితీస్తుంది. ఇప్పటికే కులపరమైన రిజర్వేషన్లను హిందూమతం పేరుతో పొందుతూ క్రైస్తవులుగా మారిన అనేక మంది ఎస్‌సి, ఎస్‌టిల వల్ల నిజమైన దళిత హిందువులకు నష్టం జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో కేవలం మత ప్రాతిపదికపై ముస్లింలకు రిజర్వేషన్లను ఇవ్వడం ఎంతవరకు సబబు?
- వేదుల జనార్ధనరావు, వంకావారిగూడెం

ప్రజాసమస్యలు పట్టవా?
ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజల సమస్యలను గాలికి వదిలేసి, ఎప్పుడూ సదస్సులు, సమావేశాల్లో మునిగి తేలుతూ బడా పారిశ్రామికవేత్తలను పొగుడుతూ కాలం గడుపుతున్నారు. జాతీయ, అంతర్జాతీయ సదస్సులంటూ ప్రజాధనాన్ని విచ్చలవిడిగా ఖర్చుపెడుతున్నారు. ఈ సదస్సులతో పేదలకు, నిరుద్యోగులకు, రైతులకు ఒరిగిందేమీ లేకపోగా, పరిపాలనా వ్యవస్థ స్తంభించిపోతోంది. ఫలితంగా రాష్ట్ర అభివృద్ధి కుంటుపడుతుంది. తాగునీరు, సాగునీరు లేక గ్రామాలు అల్లాడుతున్నాయి. పనులు లేక కూలీలు, చిన్న రైతులు ఇతర రాష్ట్రాలకు వలసపోతున్నారు. ఆకాశంలో విహరించే నేతలకు భూమిమీద ప్రజల కష్టాలు కనబడటం లేదు. ఆందోళనలు, ఉద్యమాలు చేసేవారిని ముందస్తుగా అరెస్టు చేయడం పరిపాటిగా మారింది. తాను నిద్రకు సైతం దూరమై కష్టపడుతున్నానని చంద్రబాబు చెబుతుంటారు. ప్రజలకు మాత్రం కష్టాలు తీరడం లేదు. ప్రపంచంలోనే అద్భుత రాజధానిని నిర్మిస్తామని అంటారు. రాజధాని సంగతేమో గానీ రాష్ట్ర ప్రజలు మాత్రం అన్ని విధాలుగా అసంతృప్తి చెందుతున్నారు.
- ఈశ్వర్, ప్రొద్దుటూరు

ధన్యజీవి రామయ్య
తెలంగాణకు చెందిన ‘వృక్షమిత్ర’ దరిపెల్లి రామయ్యకు పద్మశ్రీ పురస్కారం లభించడం అభినందనీయం. రామయ్య నాటిన మొక్కలు కోట్లలో ఉంటాయి. కష్టపడే వారికి ఏనాటికైనా గుర్తింపు లభిస్తుంది. అవార్డుల కోసం ఆయన పనిచేయలేదు. తన పని తాను చేసుకుపోయారు. సమాజం గురించి ఆలోచించే రామయ్య లాంటి వ్యక్తులు బహుకొద్దిమంది ఉంటారు. ఇలాంటి వారిని గుర్తించి ప్రోత్సహించడం ప్రభుత్వాల కనీస బాధ్యత. విజయవాడకు చెందిన మాంటిస్సోరి కోటేశ్వరమ్మ బాలికల విద్యకోసం విద్యాలయాలను ఏర్పాటుచేశారు. ఆమెకు పద్మశ్రీ అవార్డు ఇవ్వడం సబబే. ఈ ఇద్దరూ సామాజిక సేవలో మనకు స్ఫూర్తిదాతలు.
- మార్టూరు అజయ్‌కుమార్, రామచంద్రాపురం