ఉత్తరాయణం

విజ్ఞత లేని నేతలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజకీయ నేతల వ్యాఖ్యల్లో విజ్ఞత, వివేకం, విచక్షణ లేకుండా పోతున్నాయి. అందుకే ప్రజలు వారిని పట్టించుకోవడం లేదు. ఆమధ్య సిపిఐ నారాయణ తమిళనాట కేంద్ర ప్రభుత్వం రావణకాష్ఠం రగిలించిందని విమర్శించాడు. నిజానికి దశాబ్దాల క్రితం నెహ్రూ కాశ్మీర్‌లో రగిల్చిన రావణకాష్ఠం ఇంకా రగులుతూనే వుంది. తమిళనాట మండుతున్నది భోగి మంట. ఇది ఒకరోజు తీవ్రంగా మండి తర్వాత రెండుమూడు రోజులు వేడిమికక్కి తర్వాత పూర్తిగా చల్లారిపోతుంది. దీని వెనుక శశికళను సిఎంగా కోరుకోని ప్రజల అసంతృప్తి ఉంది. ఆమె సిఎం అయితే అమెరికాలో ట్రంప్ ఎదుర్కొంటున్న లాంటి సమస్యలు ఇక్కడా రాజుకోవచ్చు.
- మరుదకాశి, కరప

మతమార్పిడి సరికాదు
లౌకిక రాజ్యంలో మత స్వేచ్ఛ ఉంది. కాని మతం మార్చడం హేయమైన చర్య. మా మతం స్వీకరించండి అంటూ కానుకలు ఇచ్చి, నయానో భయానో మతం మార్చడం ఎంతవరకు న్యాయం? ఒకరి మతం గౌరవిస్తూ, తన మతాన్ని ఆచరించడం అన్నివిధాలా శ్రేయస్కరం. మతం మార్పిడులవల్ల ఆ దేశ సంస్కృతి దెబ్బతింటుంది. ప్రతీ హిందూ వ్యక్తి గుర్తించాల్సిన విషయం మతం మారకపోవడం. మతం మారితే కష్టాలు, రోగాలు, ఇబ్బందులు పోతాయి అనుకుంటే ప్రపంచంలో ఒకే మతం ఉండేది.
- ఆర్.శశిభూషణ, కంచరపాలెం

మహిళాసదస్సులు మరిన్ని జరగాలి
విజయవాడలో నిర్వహించిన జాతీయ మహిళా పార్లమెంట్ సదస్సును కేవలం బిజెపి, టిడిపి సభగానే నిర్వహించారు తప్ప ఇతర పార్టీ నాయకురాళ్లకు అంత ప్రాధాన్యం ఇవ్వలేదు. వామపక్ష పార్టీలకు సంబంధించి, కాంగ్రెస్ పార్టీలకు సంబంధించిన నేతలు ఎవ్వరూ అందులో కనిపించని పరిస్థితి. వివిధ దేశాలకు చెందిన ప్రముఖ రంగాలలో వున్న మహిళలను, సంఘ సంస్కర్తలను ఆహ్వానించటం మంచిదే కాని మన దేశంలో గల ప్రతిభగల నాయకురాళ్లకు విలువ ఇవ్వకపోవటం విచారకరం.
ఈ ఒక్క లోపం మినహా మిగతావన్నీ బాగానే ఉన్నాయి. మహిళా సాధికారత సమానత్వ సాధనకు ఈ వేదిక పోరాట స్ఫూర్తిని ఇవ్వటమేకాక సంఘటితంగా పోరాటానికి నాంది పలికింది. ఇలాంటివి మరిన్ని సదస్సులు జరగాలి.
- అయినం రఘురామారావు, ఖమ్మం

మన్మోహన్ వైఖరి తప్పు
స్వతంత్ర భారత రాజకీయ వేదికను డెబ్భై సంవత్సరాల తర్వాత చూస్తే ప్రజాధనం లూటీ అవడమే ఇతివృత్తంగా నడుస్తోంది. ఫ్యాక్టరీలో సంపద, మెషీన్లు మొత్తం లూటీ అయింది. కాని వాచ్‌మన్ బుద్ధిమంతుడంటే ఎలా? ప్రధానిగా మన్మోహన్ చేయి స్వచ్ఛంగా వుంది, ప్రతి లూటీ వెనక హస్తం గుర్తులు కన్పిస్తున్నాయంటూ ఇంకా సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు రెయిన్ కోటుతో స్నానం అంశంపై. దొంగతనం చేసిన వారే కాదు, అప్పుడు కళ్లుమూసుకున్న వారూ నేరస్తులే. ఐదు సంవత్సరాల ముందు పంజాబ్ ఎన్నికలలో ప్రధానిగా ‘నేనూ మీవాడినే’ అని చెప్పుకోవడాన్ని- ఒక్క సెక్యులరిస్టూ ప్రశ్నించకపోవడం ప్రజల దౌర్భాగ్యం. ఇరవై సంవత్సరాలకు ముడిపడి తమిళనాట శశికళకు శిక్షపడింది. స్వాతంత్య్రానంతరం అపరిశుద్ధంగా మారిన భారత్‌లో దోచుకునేవారు బ్రతుకుతోంది ఇన్‌స్టంటుగా దొరికే మద్దతుదారులతోనే. ఇకనైనా ప్రజాస్వామ్యంలో నీతిగూర్చి ఆర్భాటాలు చేసేవారు వాట్సాప్‌లనుంచి పోలింగ్ బూత్‌లకు తరలాలి. అప్పుడే మంచి జరుగుతుంది.
- వి.ఆర్.ఆర్.ఎ.రాజు, హైదరాబాద్