ఉత్తరాయణం

రేషన్ కోసం ప్రత్యక్ష నరకం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రేషన్ డిపోల్లో నగదు రహిత లావాదేవీల్లో వినియోగదారులకు అధికారులు నరకం చూపిస్తున్నారు. చంటిబిడ్డల తల్లులు, వృద్ధులు ఇంటి వద్ద పనులు మానుకుని ఉదయం నుండి సాయంత్రం వరకు నిరీక్షించవలసి వస్తోంది. రేషన్ కార్డు యజమాని ఆధార్‌కార్డు నెంబర్ బ్యాంకు ఖాతాకు అనుసంధానం చేయకపోవడం, బ్యాంకు ఖాతా ఉన్నా పని చేయకపోవటం, ‘ఈ పాస్’ యంత్రాలపై వేలిముద్ర వేసిన తరువాత బ్యాంకు ఖాతా అనుసంధానం అయ్యేందుకు చాలా సమయం పట్టడం వంటి సవాలక్ష సమస్యలతో వినియోగదారులు గందరగోళానికి గురౌతున్నారు. అవినీతి, అక్రమాలకు తావు లేకుండా రేషన్ అందించాలనేది ప్రభుత్వ ఉద్దేశమే అయినా సాంకేతిక ఇబ్బందుల మూలంగా వినియోగదారులు సరుకులు తీసుకోవటం బ్రహ్మప్రళయంగా మారింది. వారిలో సంతోషం కంటే బాధ ఎక్కువగా ఉంది. ప్రత్యామ్నాయ మార్గాలు ఆలోచించి కష్టాలను గట్టెక్కించాలి.
-యర్రమోతు ధర్మరాజు, ధవళేశ్వరం

జంబ్లింగ్‌తో అక్రమాలకు చెక్
పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో చూచిరాతలు, అక్రమాలను నివారించడం పెద్ద కష్టమేమీ కాదు. పోటీ పరీక్షల తరహాలో టెన్త్ పరీక్షల్లో జంబ్లింగ్ విధానంలో ఎ, బి, సి, డిలుగా ప్రశ్నపత్రాలు ఇవ్వాలి. ఇలా చేస్తే తప్ప పరీక్షల్లో అక్రమాలను నివారించడం సాధ్యం కాదు. టెన్త్, ఇంటర్, డిగ్రీ పరీక్షల్లో జంబ్లింగ్ విధానంలో ప్రశ్న పత్రాలు తయారుచేయాలి. వచ్చే విద్యా సంవత్సరం నుంచైనా ఈ విధానానికి శ్రీకారం చుడితే పరీక్షలు సక్రమంగా జరుగుతాయి. టెన్త్ పరీక్షల్లో చూచిరాతలపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని ఇటీవల హైకోర్టు విద్యాశాఖాధికారులను ఓ వ్యాజ్యం సందర్భంగా ప్రశ్నించింది. ఎంపిక చేసిన కొన్ని కేంద్రాల్లో సిసి కెమెరాలను పెడుతున్నామని, చూచిరాతలపై నిఘా పెంచుతామని అధికారులు కోర్టుకు వివరించారు. పరీక్షా నిర్వహణ విధానమే లోపభూయిష్టంగా ఉంది. జంబ్లింగ్ విధానంలో ప్రశ్న పత్రాలను ఇస్తే కాపీలను నివారించవచ్చు.
-వాండ్రంగి కొండలరావు, పొందూరు

ఎస్‌బిఐ చార్జీల బాదుడు
బస్సు చార్జీలు, కరెంటు చార్జీలు, వంటగ్యాస్ ధర పెంచగా లేనిది మేం మాత్రం తక్కువ తిన్నామా? అంటూ ఏప్రిల్ 1 నుంచి చార్జీలు పెంచేందుకు ఎస్‌బిఐ నిర్ణయించడం దారుణం. కనీస బ్యాలెన్స్ లేకుంటే పెనాల్టీ, మూడు నగదు జమలు మించితే ప్రతి లావాదేవీపై యాభై రూపాయలను సేవా రుసుంగా వసూలు చేస్తారట. బ్యాంకు ఖాతా మూసేసినా చార్జీలు తప్పవట. పేద ప్రజలను బ్యాంకింగ్ సేవలకు దూరం చేసేలా ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం సబబు కాదు. ఈ దేశ ప్రజలను ఇక దేవుడే రక్షించాలి.
-బి.ఆర్.సి.మూర్తి, విజయవాడ

ట్రంప్‌ను నిలదీయరా?
ఒక పేదవాడు ప్రధాని కావడాన్ని జీర్ణించుకోలేక మన దేశంలో కొన్ని రాజకీయ పార్టీలు నరేంద్ర మోదీపై ప్రతిరోజూ దుమ్మెత్తిపోస్తున్నాయి. ఒక పేద దేశం సాంకేతికతలో అగ్రదేశాన్ని అధిగమించి ఒకేసారి 104 ఉపగ్రహాలను రోదసి లోకి పంపడాన్ని జీర్ణించుకోలేక హఠాత్తుగా ఆమ్నెస్టీ సంస్థ భారత్‌కు వ్యతిరేకంగా అవాకులు వాగడం ప్రారంభించింది. ప్రఖ్యాత యూనివర్సిటీల్లో ‘తలలు పండిన’ పెద్దలు సుమారు 400 మంది చేరి అందరూ ఎప్పుడో మర్చిపోయిన జెఎన్‌యు సంఘటనను గుర్తుచేస్తూ భారతీయ సంస్కృతికి ముప్పు వాటిల్లుతున్నదని బెంగ పడిపోతున్నారు. ప్రపంచానే్న అతలాకుతలం చేస్తున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు వ్యతిరేకంగా ఈ పెద్దలు నోరెత్తితే ఓట్టు!
-కె.హితీక్ష, కాకినాడ