ఉత్తరాయణం

‘డిజిటల్’కు బాలారిష్టాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విద్యార్థులకు సులువుగా పాఠాలు బోధించేందుకు డిజిటల్ తరగతులను ప్రభుత్వం అమలులోకి తీసుకువచ్చింది. దృశ్య రూపకంగా బోధించడం వల్ల సాధారణ విద్యార్థులకూ పాఠ్యాంశాలు సులువుగా అర్థమవుతాయి. అయితే, అనేక పాఠశాలల్లో డిజిటల్ తరగతులకు అనుగుణగా వసతులు లేవు. కొంతమంది టీచర్లకు సాంకేతిక నైపుణ్యం లేకపోవటం, ఎలక్ట్రానిక్ ఉపకరణాల వినియోగంపై అవగాహన లేమి, ఇంటర్నెట్ కనెక్టివిటీ సమస్య, సాఫ్ట్‌వేర్ ఇబ్బందులతో డిజిటల్ పాఠాలు చాలా స్కూళ్లలో అమలు కావటం లేదు. రెండు మానిటర్లు, ప్రొజెక్టరు, స్కానర్, సిపియు, యుపిఎస్, హార్డ్ డిస్క్‌లు వంటి ఖరీదైన వస్తువులను చోరుల నుంచి కాపాడుకునేందుకు కొన్ని బడుల్లో వాటిని గదిలో పెట్టి తాళం వేస్తున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే ప్రభుత్వ ఆశయం నీరుకారిపోవడం ఖాయం.
- యర్రమోతు ధర్మరాజు, ధవళేశ్వరం

విద్వేషం ఇక్కడా ఉంది..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వల్లనే అక్కడ జాత్యాహంకారం రగిలి హత్యలకు దారితీస్తోందని భారతీయ మీడియా కూడా ఆయనను నిందిస్తోంది. స్థిమితంగా ఆలోచిస్తే మన దేశంలోనూ విద్వేషం ఉంది. తెలంగాణ రాష్ట్రం కోసం జరిగిన ఉద్యమం సందర్భంగా ఎంత విద్వేషం రగిలిందో మనకు అనుభవమే. ఓ ఉత్తరాది విద్వేషి- ప్రధాని మోదీ తన నియోజకవర్గంలో అడుగుపెడితే ముక్కలుగా నరికేస్తానని అన్నాడు. దక్షిణాది విద్వేషి ఒకడు నోట్ల రద్దు సందర్భంగా ప్రధానిని ఎన్నిసార్లు చంపినా పాపం లేదు అన్నాడు. మమత, కేజ్రివాల్ లాంటి నేతల విద్వేషం గురించి చెక్కనక్కరలేదు. అయితే, మనవాళ్లు అంత తీవ్రంగా స్పందించరు కాబట్టి హత్యలు వంటి అరాచకాలు జరగలేదు. ట్రంప్ ప్రభుత్వం కూడా విద్వేషుల్ని ఉపేక్షించడం లేదు. అరెస్ట్‌లు జరుగుతున్నాయి, కేసులు పెడుతున్నారు. ఈ పరిస్థితుల్లో భావోద్వేగాలను రగిల్చేలా మాటలు అనవసరం.
- శాండో ప్రచండ్, కాకినాడ

ప్రలోభాలతో మత మార్పిడులు
మన దేశంలో మత మార్పిడులు విపరీతంగా జరుగుతున్నాయి. హైందవ సమాజాన్ని దెబ్బతీయాలనే లక్ష్యంతో అన్యమతాల వారు హిందువులను తమవైపు తిప్పుకోవాలని తాపత్రయపడుతున్నారు. వీటిని నిరోధించటానికి మఠాధిపతులు, పీఠాధిపతులు, ధార్మిక సంస్థలు కలిసి హైందవ సనాతన ధర్మం గొప్పతనాన్ని చాటి హిందువుల్లో చైతన్యం తీసుకొని రావాలి. పేదరికాన్ని, వారికి వచ్చే అనారోగ్య పరిస్థితులను ఆసరా చేసుకొని, ప్రలోభాలకు గురిచేసి మతాన్ని మారుస్తున్నారు. ఇతర దేశాల నుండి వచ్చే ధనాన్ని వినియోగించి మత మార్పిడులు కొనసాగిస్తున్నారు. మత మార్పిడులు చేసేవారు ఇస్లామిక్ తీవ్రవాదుల కంటే ప్రమాదకరం. ఓటు బ్యాంకు రాజకీయాలతో ఈ పరిణామాలపై ప్రభుత్వాలు నోరు మెదపని గడ్డు పరిస్థితి దాపురించింది. దేశ క్షేమాన్ని ఆలోచించే రాజకీయ పార్టీలు మత మార్పిడులను నిరోధించేలా వ్యవహరించాలి.
- జి.శ్రీనివాసులు, అనంతపురం

కోర్టు తీర్పులు పట్టని సర్కారు
కొన్ని ప్రభుత్వరంగ సంస్థల ఉద్యోగులకు పదవీ విరమణ తరువాత న్యాయపరంగా చెల్లించవలసిన వేతన బకాయిలను, గ్రాట్యుటీ, పెన్షన్‌లను ఇవ్వలేమని మొండికేస్తే, ఉద్యోగ సంఘాలు కోర్టులను ఆశ్రయించగా, ఏళ్ళ తరబడి విచారణ జరిగాక ఉద్యోగుల పక్షాన తీర్పులు వెలువడినా ఫలితం లేదు. ప్రభుత్వ సంస్థలు కుంటిసాకులు చెబుతూ కోర్టుతీర్పులను మార్చమని ప్రాధేయపడడం సరికాదు. రిటైర్డు ఉద్యోగులకు అనుకూలంగా వచ్చిన కోర్టుతీర్పులను తిరగతోడవద్దని ప్రభుత్వరంగ సంస్థలను ప్రధాని ఆదేశించాలి.
- ఎన్.రామలక్ష్మి, సికిందరాబాద్