ఉత్తరాయణం

‘స్వజామ’ ఏం చేస్తోంది?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘స్వదేశీ జాగరణ మంచ్’ (స్వజామ) గతంలో కంటే ఇప్పుడు చెయ్యవలసింది చాలా ఉంది. ఎందుకంటే అవసరమైనప్పుడు ప్రధాని మోదీని నిలబెట్టి ప్రశ్నించగల జాతీయ నాయకులు ఇప్పుడు ఎవ్వరూలేరు, ఒక్క ఆర్‌ఎస్‌ఎస్ తప్ప. మిగతా అందరూ తమ తమ గ్రామాలకు ‘రాజులు’ మాత్రమే! దేశానికి నాయకులు కారు. ‘వాల్‌మార్ట్’ అనే అమెరికన్ పచారీ దుకాణపు సంస్థ ‘బిగ్ బజార్’, ‘మోర్’, ‘బిగ్ బాస్కెట్’ వగైరా ఎన్ని సంస్థల్లో దూరి వ్యాపారం చేస్తోందో తెలీదు. చిత్ర విచిత్రమైన వస్తువులన్నీ అమ్మి ప్రజలకు అలవాటు చేస్తోంది... వెదురు బియ్యం, నల్ల బియ్యం, అశ్వగంధ బిళ్లలు, కామంచి పళ్లు (నల్లవి, ఎర్రవి) యావౌడోకాయలు (లోపల వెన్న ఉంటుంది), బేబీకార్న్, నల్లచేమ మట్టలు వగైరా ఆహార పదార్థాలు మనల్ని ఆహ్వానిస్తూంటాయి. వీటిలో కొన్నింటిని ఇప్పటివరకూ మన వీధిచివర ఉన్న కోమటాయన కు టుంబం రోజంతా కష్టపడి కొద్ది లాభానికి అమ్ముతూండేది. కొన్నిటిని కోయవాళ్లు, ఆయుర్వేద షాపులవాళ్లు అమ్మేవారు. ‘అమ్మా.. మీకోసం గుంటగలగరాకు తెచ్చాను. ఈ పూలతో శివదేవుడికి హారాలు వేస్తారు. ఉచితంగా తీసుకోండి. పప్పుచేసి శివుదేవుడికి నైవేద్యం పెట్టండి... అమ్మా, మా పెద్దమ్మాయి నీళ్లుపోసుకుంది. చింతకాయ పచ్చడుంటే కొంచెం పెట్టరూ?’ అనే సహకారులైన మామ్మలే కాదు, గ్రామాలే- గయామార్! ఎగిరిపోయారు అమెరికా పుణ్యమాని! వాళ్ల కుర్రాళ్లే ‘బిగ్ బజార్’ లాంటిచోట ఆరువేలకో, ఏడువేలకో చేరి బానిస బతుకు నెట్టుకొస్తున్నారు. కోమటి చెంచయ్య 390 రూపాయలకు అమ్మే అరకేజీ జీడిపప్పు ప్యాకెట్ మీద వీళ్లు ‘420 రూపాయలు మాత్రమే’ అని గుద్ది ‘5% తగ్గిస్తున్నాం’ అని రాస్తారు. అంటే 399 రూపాయలు కాలేదా? ఇది చెంచయ్య నోరుకొట్టి మన జేబులు పిండటం కాదా? ఇక, అమరావతిలో చైనా మార్కెట్లు వెల్లివిరియబోతున్నాయట. కప్పలు, తొండలు, బురద పా ములు, పిట్టలు, కాకులు కూడా- మనకి నోరారగా విందు చెయ్యబోతున్నాయన్నమాట! మన శత్రువులు ఎన్ని రకాలుగా మన నెత్తిమీదికి ఎక్కుతున్నారో తె లుస్తోంది కదా!... మరి ‘స్వజామ’ ఏం చేస్తోంది? కేంద్రమంత్రి హరిస్మృతీ కౌర్‌బాదల్‌ను పదవి నుంచి తొలగించమనటం ఒక్కటేనా? ఇంకేం చెయ్యదా?

- గుండు సుబ్రహ్మణ్యదీక్షితులు, ఏలూరు
జల బలం
జలమేరా జీవానికి మూలం
జలము విలువ తెలుసుకొన్న మన ఉనికి పదిలం
భూమియందు మూడొంతుల జల భాగమున్నది
తాగేందుకు లెక్కచూడ లేశమున్నది
ప్రకృతి వరప్రసాదము జలము అయిననూ
కోట్ల రూపాయలకది వ్యాపారమాయెను
జీవక్రియలనన్నిటినీ నడిపించు ఆయుధం
జలమేకద ప్రాణాన్ని నిల్పు దివ్య ఔషధం
నీటికొరకు యుద్ధాలే జరుగుతుండెనోయ్
నీటికొరత లేకుండా పాటుపడవలెనోయ్
భూగర్భ జలాలు యింకుచుండెరా
ఇంకుడు గుమ్ములతోటి పరిష్కారముండెరా
నీటి వృథానరికట్టి మెలుగు మిత్రమా
నీటిపొదుపు జగతి వెలుగు.. అది నిజం సుమా
ప్రతిచోటా తరులు నిండి పుడమి ఉండినా
వర్షాలకు లోటనేది మనకు ఉండునా?
ఉదకమును బుద్ధితోడ వాడుకొనెదము
ముదముతోడ జలసిరులను పెంచుకొందము
( నేడు ప్రపంచ జల దినోత్సవం)
- చావలి శేషాద్రి సోమయాజులు, సాలూరు