ఉత్తరాయణం

అయోధ్యపై సుప్రీం సూచన భేష్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అయోధ్యలో ‘మందిర్-మసీదు’ వివాదం పరిష్కారం దిశగా సుప్రీం కోర్టు ఇచ్చిన సలహా సమంజసమైనదే. మధ్యవర్తిత్వం ద్వారా ఇరు వర్గాల వారూ ఈ వివాదాన్ని ముగించుకోవచ్చని కోర్టు సూచించింది. సున్నితమైన మత విశ్వాసాలతో ముడిపడి ఉన్నందున చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవడం ఉత్తమం అన్న న్యాయపాలిక అభిప్రాయంతో అందరూ ఏకీభవించాల్సిందే. అయితే, అయోధ్యపై సయోధ్య సాధ్యమా? అన్న అనుమానాలు లేకపోలేదు. అరవై ఎనిమిదేళ్లుగా కోర్టులో నలుగుతున్న వివాదానికి ఈ తరహా చర్చలు కూడా విఫలమైన చరిత్ర ఉండనే ఉంది. గతంలో అప్పటి ప్రధానులు చర్చా మార్గాన్ని సూచించి విఫలమయ్యారు. అలా అని ఇది కోర్టు తీర్పుతో తేలిపోయే అంశం అయితే ఎప్పుడో ముగింపునకు వచ్చేది. ‘మందిర్- మసీదు’ వివాదంపై వ్యాజ్యం నడుపుతున్న ముగ్గురు కక్షిదారులు చర్చా మార్గాన్ని మరోసారి ఎంచుకుంటే తప్పులేదు. అవసరమైతే తామే మధ్యవర్తిగా ఉంటామని లేదా ఆమోదయోగ్యుడైన మధ్యవర్తిని చూడమంటే చూస్తామని సుప్రీం ప్రధాన న్యాయమూర్తి హామీ ఇచ్చారు. పరమత సహనం, సంయమనం పాటించి హిందూ, ముస్లిం పెద్దలు ఈ వివాదానికి ఇకనైనా స్వస్తిపలకాలి. ఉద్రేకాలకు తావులేని రీతిలో చర్చలు జరిపితే సమస్యకు పరిష్కారం లభించడం అసాధ్యమేమీ కాదు. ప్రస్తుత పరిస్థితి సయోధ్యకు అనుకూలం కాదని అనుకోవడం కూడా సరికాదు. హిందూ, ముస్లిం సంస్థలు ఎలాంటి భేషజాలకు పోకుండా, దశాబ్దాల నాటి వివాదాన్ని శాంతి యుతంగా, సామరస్య పూర్వకంగా పరిష్కరించుకునేందుకు చొరవ చూపవలసిన తరుణం ఇది.
-డా. జివిజి శంకరరావు, పార్వతీపురం

ట్రంప్ దూకుడు తగ్గాలి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న అనాలోచిత, అర్థరహిత నిర్ణయాలతో ప్రవాస భారతీయులు విద్య, ఉపాధి రంగాల్లో కష్టాలను ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడింది. అక్కడి పరిస్థితులపై భారత్‌లోని యువత నిరాశ చెందుతోంది. అమెరికా అభివృద్ధికి చేయూతనిస్తూ స్వదేశంలోని తమవారిని ఆదుకుంటూ వస్తున్న ప్రవాస భారతీయులకు దినదిన గండంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ట్రంప్ దూకుడుకు కళ్లెం వేసేలా అంతర్జాతీయ సమాజం దృష్టి పెట్టాలి. భారత ప్రభుత్వం అమెరికా అధ్యక్షుడిపై ఒత్తిడి తెచ్చి మనవారికి అక్కడ ఎలాంటి ఇబ్బందులూ లేకుండా చూడాలి. ప్రపంచ దేశాలను కూడగట్టుకుని భారత్ తన ప్రయత్నాలను ముమ్మరం చేయాలి. ట్రంప్ దుందుడుకు చర్యల వల్ల నిరుద్యోగ సమస్య మరింత తీవ్రతరం కాగలదు.
-ఆశం సుధాకరరావు, గూడలి (నెల్లూరు జిల్లా)

అంతా కల్తీమయం
సర్వం సకలం కల్తీ
మనలను బతికించే
బియ్యంలో ప్లాస్టిక్ కల్తీ
కూరగాయల్లో రసాయనాల కల్తీ
ఆబాలగోపాలం అందరికీ
ఆరోగ్యదాయకమైన
పండ్లలోను కార్బయిడ్ కల్తీ
ఫాస్ట్ఫుడ్, జంక్‌ఫుడ్
బయట అమ్మేవాటితో
ఆరోగ్యానికి చెలగాటం
తినే మాంసంలోనూ కల్తీ
పసిపిల్లలు తాగే పాలలో
విష రసాయనాల ఇంజెక్షన్ల కల్తీ
పప్పులు, ధాన్యాలు ఒకటేమిటి
అన్నిటా కల్తీ కల్తీ
ప్రాణాధారమైన నీరు కల్తీ
కాలుష్యపుకోరల్లో
పీల్చేగాలీ కల్తీ
కల్తీ జరగనిదెక్కడ?
మనస్తత్వాల్లో కల్తీ
మనసుకు జరగాలి చికిత్స
అప్పుడే మనకు మనుగడ
-సరికొండ శ్రీనివాసరాజు, వనస్థలిపురం