ఉత్తరాయణం

సర్వే సర్వత్రా అవినీతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశంలో అవినీతి లేకుండా పాలన సాగుతోంది తెలంగాణాలోనే అని కేంద్ర ఇంటెలిజన్స్ సర్వేలో తేలినట్టు మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. ఈమధ్యనే హైదరాబాద్‌లో ఓ మహిళా కానిస్టేబుల్ తాను ఇల్లు నిర్మించుకొని ఆస్తి పన్ను మదింపుకోసం మునిసిపల్ ఆఫీస్‌కు అనేకసార్లు వెళ్లానని, లంచం ఇస్తేనే పని చేస్తామని, లేకుంటే చేయం అని ఉద్యోగులు తెగేసి చెప్పారని వెల్లడించింది. అవినీతి లేదంటూ ఎక్కడివారో వచ్చి సర్వే చేసి చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ అవినీతి ఉన్నది, లేనిది ఇక్కడి ప్రజలకు తెలుసు. దాదాపు అన్ని ప్రభుత్వ శాఖలలోను అవినీతి, లంచగొండితనం విశృంఖలంగా తాండవిస్తున్నది. నాయకులు వేదికలెక్కి చెప్పినంత మాత్రాన అబద్ధం నిజం కాబోదు.
- బి.సత్యప్రకాశ్, సూర్యాపేట

మానవాభివృద్ధి అజెండా కావాలి
కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి అజెండాగా పనిచేస్తుందని ప్రధాని, రాష్టప్రతి చెప్తున్నారు. అయితే, ప్రాథమ్యంగా మానవాభివృద్ధి అజెండానే ముందుకు రావాల్సివుంది. ఆర్థిక వృద్ధికి, మానవాభివృద్ధికి మధ్య అంతరం పెరుగుతూ వస్తుంది కాబట్టి. సాధించిన, సాధిస్తోన్న ఆర్థిక విజయాలు పౌరుని జీవన ప్రమాణాల్లో ప్రతిబింబించడం లేదు కాబట్టి. తాజాగా యూఎన్‌డీపీ మానవాభివృద్ధి సూచికల ప్రకారం 1990 నుండి 2015 వరకూ భారత్‌లో పెరిగిన స్థూల తలసరి ఆదాయం 223 శాతం కాగా, పెరిగిన జీవన ప్రమాణాల సూచీ విలువ కేవలం 46 శాతం. అంటే సాధించిన ఆర్థిక లాభం, మానవ వనరుల నిజమైన అభివృద్ధికి చేయూతనివ్వడంలో విఫలవౌతోంది. పంపిణీ లోపమిది. అదే నివేదిక గత సంవత్సరానికి 188 దేశాల్లో మన దేశానిది 131వ స్థానంగా నిర్ధారించింది. ప్రజల ఆరోగ్యం, విద్య, జీవన స్థితిని మెరుగుపర్చుకొనే అవకాశాలపై ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన సమగ్ర వ్యూహాలు అమలుచేయనంత కాలం ఈ దుస్థితి నుండి గట్టెక్కలేం.
- డా. డివిజి శంకరరావు, పార్వతీపురం

ఎన్‌ఆర్‌ఐలకు భద్రత ఏది?
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధానాల వల్ల ఇతర దేశాల్లో సైతం జాతి విద్వేషాలు చెలరేగుతున్నాయి. న్యూజిలాండ్‌లో ఇప్పటికే ఈ ధోరణి మొదలైంది. అమెరికాలో భారతీయులపై దాడులు, బెదిరింపులు ఎక్కువవుతున్నాయి. ప్రవాస భారతీయులు బయటకు వచ్చే పరిస్థితులు కొన్ని దేశాల్లో లేకుండా ఉంది. గతంలో ఆస్ట్రేలియాలోనూ జాతి వివక్ష, విద్వేషాలకు భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. ఇది ఇంతటితో ఆగకుండా మరిన్ని దేశాలకు విస్తరించకుండా భారత ప్రభుత్వం ఎన్‌ఆర్‌ఐలకు రక్షణ కల్పించేలా సంబంధిత దేశాధినేతలపై ఒత్తిడి తేవాలి. భారతీయులు కూడా దాడులకు గురికాకుండా అప్రమత్తంగా ఉండాలి.
- అయినం రఘురామారావు, ఖమ్మం

కులమతాలను ప్రోత్సహిస్తున్న టిడిపి
ఏపిలో తెలుగుదేశం ప్రభుత్వం కుల, మత రాజకీయాలను ప్రోత్సహించడం రాజ్యాంగ విరుద్ధం. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్లు కల్పిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. కుల ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పడం సరైనది కాదు. ఒకవైపు కాపుకులస్థులు రిజర్వేషన్ల కోసం ఉద్యమం చేస్తున్నారు. బిసి కులాలను అణగదొక్కేలా ఇతర కులాలకు రిజర్వేషన్లు ఇస్తామని ఆశలు కల్పించడం సరికాదు. మతపరమైన రిజర్వేషన్లు చెల్లవు. ఇవి మతం మార్పిడులకు దారితీస్తాయి. కులాలను, మతాలను రాజకీయాలకు వాడుకోవటమేమిటి? గతంలో దివంగత సిఎం వైఎస్ రాజశేఖర రెడ్డి ముస్లింలకు ప్రకటించిన నాలుగు శాతం రిజర్వేషన్లు చెల్లవని కోర్టు ప్రకటించింది. మతపరమైన రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమని తెలిసినా నేతలు ఎందుకు హామీ ఇస్తున్నారు?
- జి.శ్రీనివాసులు, అనంతపురం