ఉత్తరాయణం

సరికొత్త పంచాంగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదాయం: కాగితాల్లోనే వ్యయం: జీవితాల్లోనే
రాజపూజ్యం: రాసుకున్నోళ్లకి రాసుకొన్నంత
అవమానం: చేసుకున్నోళ్లకి చేసుకున్నంత
రాష్ట్రంలో అధిపతి ‘చంద్రుడు’
కేంద్రంలో అధిపతి ‘నరేంద్రుడు’
‘ఉత్తరో’త్తరా నరేంద్రుడి ప్రభావం బలంగా ఉండటం చేత ‘చంద్రుడి’ ప్రభ కాసింత మసకబారొచ్చు. అయినా కేంద్ర కిరణాల్ని ఒడుపుగా ఆకర్షించే అనుభవం చంద్రుడికి ఉండడం చేత అంతగా భయపడక్కరలేదు. ఎల్‌నినో ప్రభావమో, ఎన్నికల ప్రభావమో గానీ రాష్ట్రంలో వేడి క్రమక్రమంగా వేడెక్కే సూచనలున్నాయి. అప్పుడప్పుడూ అడపాదడపా ఉరుములతో కూడిన ‘పవనా’లు వీస్తాయి. అయితే పిడుగులు పడే ఛానే్స లేదు.
నవ్యాంధ్ర రాజధాని అమరావతిపై ఆశలు సజీవంగానే ఉంటాయి, ఇప్పుడప్పుడే తీరే అవకాశం లేదు కాబట్టి. శాసనసభలో చర్చల కన్నా సస్పెన్షన్‌లు ఎక్కువ కావొచ్చు. ప్రతిపక్షాలు వారి ‘గొంతు’కి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలి. మైకులు దొరికే ఛాన్సులు తగ్గుతాయి. ప్రత్యేక హోదా ప్రత్యేక ప్యాకేజీగా మారి, మళ్ళీ దానికి చట్టబద్ధతలూ, ఆ చట్టబద్ధతకి ఇన్సూరెన్స్‌లూ అవసరం పడొచ్చు. ఏదోరూపంలో నిధులు చేతికి రావడం దైవాధీనం. అందాకా అధికార పక్షం శాంతి యాగాలూ, సంధి ప్రయత్నాలు చెయ్యాలి. సామాన్య ప్రజలు యధావిధిగా త్యాగాలు చెయ్యడానికి సిద్ధంగా ఉండాలి. వైద్యులు శిరస్త్రాణాలు ధరించి విధులు నిర్వహించాలి. విమానాల్లో చెప్పులు ధరించి విహరించరాదు.
- డా. డివిజి శంకరరావు, పార్వతీపురం

మాతృభాషపై నిర్లక్ష్యం తగదు
ప్రతి చిన్న విషయానికీ విదేశీ సంస్కృతిని అనుకరించడం, పాశ్చాత్య భావాలను ఆధునికత పేరిట ఒంటపట్టించుకున్న ప్రజలు, పాలకులు సమష్టిగా మాతృభాషను నిర్లక్ష్యం చేయడంలో ప్రధానపాత్ర పోషిస్తున్నారు. పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, కర్నాటక, కేరళ, మహారాష్ట్ర, గుజరాత్‌లలో మాతృభాషను, సనాతన సత్సంప్రదాయాలను పరిరక్షించడంలో మెరుగైన కృషిచేస్తున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాలలో తెలుగు భాషకు తీరని అన్యాయం జరుగుతున్నా పాలకులు, భాషాభిమానులు పట్టించుకోవడం లేదు. ఎల్‌కెజి నుండే ఆంగ్ల విద్య బోధిస్తూ మాతృభాషను చిన్న పిల్లలకు దూరం చేస్తున్నారు. తెలుగులో చదువుకుంటే ఉద్యోగాలు రావని, తెలుగులో మాట్లాడడం అవమానకరమన్న భావనలతో ఆంగ్లం, హిందీతోపాటు ఫ్రెంచ్, జర్మనీ వంటి విదేశీ భాషల వెంటపడుతున్నారు.
- సి.ప్రతాప్, శ్రీకాకుళం
కులం కార్డు ఎందుకు?
ఒక వర్గానికి చెందిన వ్యక్తిపై అవినీతి ఆరోపణలు వచ్చాక చర్య తీసుకుంటే తమ వర్గంపై వివక్ష చూపుతున్నారంటూ కులం కార్డు, మతం కార్డు మాటున కొందరు ఆందోళనలకు దిగడం, ఆ వర్గం అంతా ఆ వ్యక్తికి మద్దతు పలకడం, ఓటుబ్యాంకు రాజకీయాలతో వారి మాట చెల్లడం చూస్తున్నాం. కోల్‌కత హైకోర్టు న్యాయమూర్తి తరచుగా తమ ఆదేశాలను ధిక్కరిస్తూ ఉండడంతో సుప్రీం కోర్టు అతనిపై అరెస్ట్ వారంట్ జారీచేస్తే ఆ న్యాయమూర్తి కులం కార్డు ఉపయోగించడం, సుప్రీం న్యాయమూర్తులపై అట్రాసిటీ కేసుపెట్టడం దిగ్భ్రాంతి కలిగిస్తున్నది.
- మరుదకాశి, కరప
అధికారం దక్కలేదని..
‘గోవా, మణిపూర్ శాసనసభల్లో అతిపెద్ద పార్టీగా అవతరించిన కాంగ్రెస్‌ని కాదని భాజపా సంకీర్ణానికి అవకాశం ఇవ్వడం ప్రజాస్వామ్య ద్రోహం, అధికార చౌర్యం’ అంటూ రాహుల్ గాంధీ తదితర నాయకులు వీరంగం ఆడటం భలే కామెడీగా ఉంది. ‘మీకు మెజార్టీ ఉంటే గవర్నర్‌ని ఎందుకు కలవలేదు? కోర్టుకు వచ్చేటప్పుడైనా మద్దతుదార్ల జాబితా ఎందుకు తేలేదు?’ అంటూ సుప్రీంకోర్టు ప్రశ్నిస్తే కాంగ్రెస్ వారి నుంచి ఎలాంటి సమాధానం లేదు. గతంలో పెద్ద పార్టీని కాదని మిగతా పార్టీలను గవర్నర్ ఆహ్వానించిన సందర్భాలు ఉన్నాయి. అప్పుడు కాంగ్రెస్ వత్తాసుతో కేజ్రివాల్, శిబుసోరెన్‌ల గద్దె ఎక్కారు. ఇప్పుడు అదే పద్ధతిలో భాజపా గద్దె ఎక్కితే గగ్గోలు ఎందుకు?
- ప్రసన్న, పేర్రాజుపేట