ఉత్తరాయణం

అసలు నేరస్థులను శిక్షించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ విద్యార్థిని ఆయేషా హత్య కేసులో వెలువడిన తీర్పు న్యాయ పాలికపై సామాన్యుడి గౌరవం పెంచేదిగా ఉంది. అదే సమయంలో ప్రస్తుతం దేశంలో, రాష్ట్రంలో సహజ న్యాయానికి ఎన్ని ఇనుప తెరలు అడ్డుగా నిల్చి ఉన్నాయో, సామాన్యుడికి న్యాయం అందుకోవడమన్నది ఎంత దైవాధీనంగా మారుస్తున్నాయో అవగతమవుతోంది. ‘వందమంది నేరస్థులైనా తప్పించుకోవచ్చు కానీ ఒక్క నిరపరాధి కూడా శిక్షించబడరాద’న్న మానవీయ సూత్రం ఆధారంగా ఈ దేశ న్యాయవ్యవస్థ పనిచేస్తోంది. అయితే ఒక పేరుమోసిన నేరస్థుణ్ణి తప్పించడానికి ఎంతమంది అమాయకులు బలి అయినా ఫరవాలేదన్న ఆటవిక న్యాయరీతులు చొరబడిపోతున్నాయి. ఆ లొసుగుల్ని సరిచేయనంత కాలం సంపూర్ణ న్యాయం నిక్కచ్చిగా నూటికినూరు కేసుల్లో సామాన్యుడికి అందడం అన్నది ఎండమావే.
ఆయేషా హత్యకేసులో దర్యాఫ్తు సంస్థలు నిందితుడైన సత్యం బాబుపై చూపించిన ఆధారాలు ఇంత బలహీనంగా, సందేహాస్పదంగా ఉన్నప్పుడు కింది కోర్టు ఏ ప్రాతిపదికన నేరస్థునిగా గుర్తించి యావజ్జీవ కారాగారశిక్ష విధించింది? పైకోర్టుకి వెళ్లలేని పరిస్థితిలో ఒక అమాయకుడు జీవితాన్ని కోల్పోయేవాడు కదా!
ఒక అమాయకురాలిని నేలరాల్చిన తీవ్ర నేరంపై దర్యాప్తు జరగాల్సిన తీరు ఇదేనా? అనుమానిత నిందితులు పలుకుబడి కలవారైతే, వారికి బదులుగా అమాయకులు బలి కావాలా? అలా జరుగుతున్నప్పుడు అడ్డుకోవాల్సిన న్యాయ వ్యవస్థ ఇంత బలహీనమా? దర్యాప్తు, నేర విచారణాప్రక్రియల్లో లొసుగులకు బడావ్యక్తులు తప్పించుకోవడం ఒక ప్రమాదం కాగా, అమాయకులు బలికావడం మరింత ప్రమాదం. నేర పరిశోధన, విచారణల్లో అన్ని దశలూ లోప రహితంగా ఉండేటట్లు, వత్తిళ్లకు అవకాశం ఇవ్వనట్లు చట్టాల్ని, వ్యవస్థని తీర్చిదిద్దుకోవాలి. అందుకు తగ్గ సంస్కరణల్ని చేబట్టాలి. నేరస్థుల చేతిలో విలువైన జీవితాన్ని కోల్పోయిన అభాగ్యులకు, వారి కుటుంబాల్ని ఆదుకోవడంతోపాటు వ్యవస్థ చేతిలో చేయని నేరానికి శిక్ష అనుభవించిన అమాయకులకు ఆసరా అందించాలి. ఇది ప్రభుత్వ బాధ్యత. అసలు నేరస్థుల్ని, నేరాన్ని మసిపూసి మాయచేసిన తోడుదొంగల్నీ బోనులో నిలబెట్టగలిగినప్పుడే ఆయేషా ఆత్మకు శాంతి. ఇది నాగరిక సమాజానికి కనీస ధర్మం.
- డివిజి శంకరరావు, పార్వతీపురం
మతం రంగు పులమొద్దు
సంగీతానికి కులం, మతం, భాష, ప్రాంతీయత వంటి భేదాలు ఉండవు. సంగీతం విశ్వజనీనమైనది. కర్నాటకకు చెందిన సుహానా సయ్యద్ హిందూ భక్తిగీతాలను పాడటంలో తప్పేంటి? లౌకిక దేశంలో పాడే స్వేచ్ఛ లేదా? ప్రతి దానికి మతంతో ముడిపెడతారు. బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్ గణపతి నిమజ్జన వేడుకల్లో పాల్గొంటే రాద్ధాంతం, క్రికెట్ క్రీడాకారుని భార్య ఆధునిక దుస్తులు ధరిస్తే విమర్శించడం, క్రీడాకారిణి సానియా మీర్జా వస్తధ్రారణపై ఫత్వా జారీచేయటం వంటి ఉదంతాలు చూశాం. మేటి గాయకుడు మహ్మద్ రఫీ ‘్భక్తరామదాస్’లో మత సామరస్యాన్ని చాటుతూ ‘దైవం ఒకటే’ అనే భక్తిగీతం పాడారు. ఈమధ్య ఓ ముస్లిం బాలిక రామాయణాన్ని పారాయణం చేసి ప్రశంసలు పొందింది. మతం పేరుతో మనుషులను విభజించి వారు చేసే పనులను తప్పు పట్టడం సమర్థనీయం కాదు.

- అయినం రఘురామారావు, ఖమ్మం

కానె్వంట్లపైనే మోజు..
తెలుగు భాషపై చిన్న చూపంటూ మాటలాడితే సరిపోదు. ఎవరు అలా చేస్తున్నారంటే- మనమే కదా! ఒకప్పుడు తెలుగు మీడియంలో చదివిన వారిలో డాక్టర్లు, ఇంజనీర్లు, కలెక్టర్లు లేరా! ఇప్పటి వారికి తెలుగు మీడియం అసలే ఇష్టం లేకపోవడంతో కొన్ని చోట్ల తెలుగుబడులనస మూసివేస్తుంటే, కొన్ని పల్లెటూర్లలో అక్కడి ప్రజలు, పెద్దమనుషుల అభ్యర్థన మేరకు ఆంగ్లబడులను ప్రభుత్వం నెలకొల్పుతోంది. ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రభుత్వాలు ప్రజాభిప్రాయానికి పెద్దపీట వేస్తాయి కదా. కూలీనాలీ చేసుకునే చిన్నా చితకా కుటుంబాలు సైతం తెలుగు మీడియాన్ని ఈసడిస్తూ రెక్కలు ముక్కలు చేసుకునైనా సరే కానె్వంట్లలో తమ పిల్లలను చదివిస్తుంటే సర్కారు బడిలోకి ఎవరొస్తారు? తెలుగు భాష దుస్థితిపై జాలిపడే పండితులు, కవులు, కళాకారులు, టీచర్లు వాళ్ల పిల్లలని కానె్వంట్లలోనే వేస్తారు. ఇక, తెలుగు మీడియం కోసం తపన పడడం దండగేమో!
-కూర్మాచలం వెంకటేశ్వర్లు, కరీంనగర్