ఉత్తరాయణం

జనం సొమ్ము దోచేస్తున్న బ్యాంకులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘చదవేస్తే ఉన్న మతి పోయిన’ట్లు- ఖాతాదార్లకు మెరుగైన సేవలను అందించడానికి బదులు బ్యాంకులు బహిరంగ దోపిడీకి దిగడం దారుణం. పెద్దనోట్ల రద్దు తర్వాత నెలల తరబడి నగదు కోసం ఇబ్బంది పడిన ప్రజలను ఇప్పుడు సరికొత్త నిబంధనల పేరిట బ్యాంకులు ఇబ్బంది పెడుతున్నాయి. నగదు రహిత వ్యవస్థ అంటూ ప్రభుత్వం పలు సంస్కరణలు చేస్తుండగా, ఏదో ఒక రూపంలో చార్జీల బాదుడుకు బ్యాంకులు యత్నించడం విడ్డూరం. నెలలో అయిదు లావాదేవీలకు మించితే నూట యాభై రూపాయల సర్వీస్ చార్జీ, ఖాతాలో కనిష్ట నగదు నిల్వ 500 రూపాయలు ఉండాలంటూ బ్యాంకులు కొత్త నిబంధనలను విధిస్తున్నాయి. ప్రతి లావాదేవీపైన సేవాపన్ను విధించారు. కొన్నాళ్ల క్రితం ఖాతాలు తెరవండంటూ జనం వెంట పడిన బ్యాంకులు ఇప్పుడు అదే జనాన్ని హడలెత్తిస్తున్నాయి. సర్‌చార్జీలు, సేవాపన్ను, కనిష్ట నగదు నిల్వలపై ఆంక్షలను వెంటనే రద్దు చేయాలి. ఖాతా రద్దు చేసుకుంటే వెయ్యి రూపాయల పెనాల్టీ విధిస్తామనడం మరీ విడ్డూరం. ఈ తరహా నిబంధనలను రద్దు చేసినపుడే నగదు రహిత వ్యవస్థపై జనం ఆసక్తి చూపుతారు.
- సిహెచ్ సాయి రుత్విక్, నల్గొండ

మితిమీరుతున్న అనుకరణ
తమ అభిమాన సినీ నటీనటులను అనుకరించడం నేటి యువతకు పరిపాటే. అయితే, సినిమా వేరు- జీవితం వేరు అన్న వాస్తవం మరచిపోవడంతో ఈ అనుకరణ మితిమీరుతోంది. ఒకప్పుడు హీరో, హీరోయిన్ల వస్తధ్రారణ హుందాగా ఉండేది. పాతతరం హీరోలు చాలా నీట్‌గా, చిన్న మీసకట్టుతో కనిపించేవారు. అప్పటి హీరోయిన్లు చక్కటి వాలుజడతో తల నిండా పూలు పెట్టుకునేవారు. నేటి హీరోలకు గడ్డాలు, చిన్న పిలకలు కూడా ఉంటున్నాయి. ఈనాటి హీరోయిన్లు జుత్తు విరబోసుకుని, శరీర భాగాలు కనిపించేలా వస్తధ్రారణ చేసుకుంటున్నారు. అదే వేషధారణను అనుకరిస్తూ నేటి యువతులు అవస్థలు కొనితెచ్చుకుంటున్నారు. ఇలాంటి వస్తధ్రారణ వద్దని చెప్పే నాయకులపై విమర్శల దాడి తప్పడం లేదు. మితిమీరిన అనుకరణ మంచిది కాదని యువతీ యువకులు గ్రహించాలి.
- ఎన్.రామలక్ష్మి, సికింద్రాబాద్

వర్సిటీలో అసాంఘిక కలాపాలు!
అత్యుత్తమ విద్యా ప్రమాణాలకు నిలయంగా భాసిల్లిన విశాఖలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇపుడు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతోంది. హాస్టళ్లలో గంజాయి, మత్తుమందు, మద్యపానం, జూదం వంటి అసాంఘిక పనులు యథేచ్ఛగా సాగుతున్నాయి. ఇటీవల పోలీసుల తనిఖీల్లో గంజాయి, మత్తు పదార్థాలతో కొందరు విద్యార్థులు పట్టుబడడంతో అసాంఘిక కలాపాల వ్యవహారం బయటపడింది. కాలేజీ మైదానాల్లో, క్యాంటీన్లలో పట్టపగలే విద్యార్థులు మద్యం సేవిస్తున్నారు. బహిరంగంగా సిగరెట్లు తాగడం, అసభ్యకర ప్రేమ వ్యవహారాలు, సెల్‌ఫోన్లలో అశ్లీల దృశ్యాలు వీక్షించడం.. ఇవన్నీ నిత్యకృత్యంగా మారాయి. క్యాంపస్‌లోకి అనధికార వ్యక్తుల ప్రవేశం కారణంగా ఈ వ్యవహారాలన్నీ నడుస్తున్నాయి. ఇదంతా తెలిసినప్పటికీ వర్సిటీ అధికారులు, పోలీసులు చోద్యం చూస్తున్నారే తప్ప ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఎందరెందరో మహామహులు, మేధావులు చదివిన ఎయులో అసాంఘిక కలాపాలను అరికట్టేందుకు వర్సిటీ యాజమాన్యం తక్షణం కఠిన చర్యలు తీసుకోవాలి.
సి.ప్రతాప్, శ్రీకాకుళం